చైతో మొదటి మజిలీ


Sun,March 31, 2019 03:19 AM

పెండ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. శివనిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. సమంతతో పాటు దివ్యాంశ కౌషిక్ లీడ్ పోషిస్తున్నది. తమిళ్, హిందీలో బిజీగా ఉండి తెలుగు తెరకు పరిచయం కానున్న ఈ అమ్మడు గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. దివ్యాంశ ఢిల్లీలో పుట్టి పెరిగింది. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి నటన, సంగీతం మీద ఆసక్తి పెంచుకుంది. మసూరీ పట్టణంలో బోర్డింగ్ స్కూల్‌లో చదువు పూర్తి చేసింది.
-మజిలీలో నాగచైతన్య ప్రేయసిగా కీలక పాత్ర పోషిస్తున్నది. అంశూ పాత్ర పేరుతో సినిమాలో కనిపించనున్నది.
-స్కూల్‌లో ఉన్నపుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది దివ్యాంశ. కానీ, నటన మీద పెద్దగా దృష్టి పెట్టేది కాదు. ఫ్రెండ్స్ నుంచి వచ్చే అభినందనలు, సూచనలు ఆమెను మోడలింగ్ వైపు తీసుకెళ్లాయి.
-యష్‌రాజ్ సినిమాలకు క్యాస్టింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసింది. ఫిల్మ్‌మేకింగ్, నటన మీద అనుభవం పొందింది. ఆ సమయంలోనే తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది.
-సినిమాలో దివ్యాంశ క్యారెక్టర్ పేరు నాగచైతన్యనే నిర్ణయించాడట. మొదటి సారి దివ్యాంశ నాగ్‌ను కలిసినప్పుడు ఆమె పేరులోంచి చివరి పదాలను తీసుకొని ఆంశూ పాత్ర పేరును సృష్టించినట్టు చెప్తున్నది.
-దివ్యాంశ భోజన ప్రియురాలు. ఢిల్లీలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. హైదరాబాద్‌లో మొదటి సారి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ బిర్యానీ చెబుతున్నది దివ్యాంశ.
-దివ్యాంశ తల్లి ఫ్యాషన్ డిజైనర్. వీరికి ఢిల్లీలో స్పాలు, సెలూన్‌లు ఉన్నాయి. దివ్యాంశ మొదట మోడల్ ప్రయత్నాలు చేసింది.
-కభీ ఖుషి కభీ కమ్‌లో కరీనా కపూర్ పాత్రను చూసి నటనా రంగంపై ఆసక్తి పెంచుకున్నదట.
-మొదటిసారి తమిళ్ సినిమాల్లో తెరంగెట్రం చేసింది. వాటికి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాలపై పూర్తి దృష్టి సారించింది. తర్వాత అవకాశం వచ్చిన సినిమాల్లో లీడ్‌రోల్‌లో నటించింది.
-క్యాస్టింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి నటనారంగానికి వచ్చే ముందు దివ్యాంశ హైదరాబాద్, ముంబై నగరాల్లో ఆడిషన్స్‌కు వెళ్లేది. అప్పటి నుంచి వివిధ భాషల్లో ప్రాజెక్టులకు ఒప్పందాలు చేస్తూ వస్తున్నది.
Divyanka

881
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles