విమానం ఎక్కలేదా..? ఐతే.. మీరు చదవాల్సిందే..


Sun,March 31, 2019 03:09 AM

అందరికీ విమానం ఎక్కాలని కోరిక ఉంటుంది. కొంతమంది వృత్తిలో భాగంగా విమానం ఎక్కితే, కొంతమంది ఆర్థిక పరపతిని బట్టి విమానం ఎక్కుతుంటారు. గమ్యాన్ని తొందరగా చేరుకోవాలంటే విమాన ప్రయాణాన్ని మించింది లేదు. అలాంటి విమాన ప్రయాణంలో మీకు తెలియని ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి.

సేఫ్‌సైడ్ సీట్లు..

ప్రతి వాహనంలో ముందుసీట్లు సేఫ్ అని చాలా మంది భావిస్తారు. కానీ, విమానంలో మాత్రం వెనుకసీట్లు సురక్షితంగా ఉంటాయట. పెద్ద శబ్దాలు రావడం, విమానాలు ప్రమాదానికి గురవడం జరిగితే ఈ వెనక భాగంపై త్వరగా ప్రభావం చూపవు. ఈ సీట్ల దగ్గర ప్రమాదాల నుంచి 40శాతం తప్పించుకొనే అవకాశం ఉంటుంది.

బాత్‌రూమ్ లాక్..

బాత్‌రూమ్ లోపలి నుంచి లాక్ వేయడానికి వీలుండదు. డోర్ ఎంట్రన్స్ దగ్గర ఉండే బటన్ నొక్కితే తలుపు తెరుచుకుంటుంది. లోపలికి వెళ్లగానే ఆటోమెటిక్‌గా లాక్ అవుతుంది. బయటకు వచ్చేందుకు డోర్ నెట్టగానే ఓపెన్ అవుతుంది. నిజానికి బాత్‌రూమ్ బయట నుంచే ఓపెన్ చేయవచ్చు. ఏదైన ప్రమాద సమయంలో విమాన సిబ్బంది వాటిని సులభంగా తెరవడానికి వీలుండేందుకు ఈ విధంగా

రెండు ఇంజిన్లు అవసరం లేదు..

విమానం ఎగరడానికి రెండు ఇంజిన్లు అవసరం లేదు. ఒక ఇంజిన్ పని చేయకపోయినా విమానం ఎగురుతుంది. అలాగే లాండ్ అవ్వాలంటే ఎటువంటి ఇంజిన్ సాయం అవసరం ఉండదు. కాబట్టి ల్యాండ్ అయ్యే సమయంలో విమానం చెడిపోతే ఎలాంటి ఆటంకం కలుగజేయకుండా సేఫ్‌గా ల్యాండ్ అవుతుంది. అంతేకాకుండా విమానంలో ప్రయాణికులు ఆత్మహత్య చేసుకోవడానికి వీలుండదు.

లైట్లు ఎందుకో తెలుసా..

విమానం ఎగురుతున్నప్పుడు రెండు లైట్లు కచ్చితంగా కనిపిస్తాయి. అవి ఎర్రలైటు, పచ్చలైటు. ప్రతి విమానానికీ ఈ లైట్లుంటాయి. అయితే వీటికీ ఓ పద్ధతి ఉంది. విమానానికి ఉండే ఎడమ రెక్క కింద ఎరుపు లైట్, కుడిరెక్క కింద పచ్చ లైట్ ఉంటుంది. ఇతర పైలట్లు విమాన మార్గాన్ని సులభంగా గుర్తించడానికి ఈ లైట్లు ఉపయోగపడుతాయి. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానాలు 150 నుంచి 200 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీంతోపాటు విమానం వెళ్తున్నప్పుడు వెనుక భాగంలో తెల్లటి గీత పడుతుంది కదా!. దీనికి కారణం విమాన ఇంజిన్ దహన ప్రక్రియలో భాగంగా నీటి ఆవిరిని విడుదల చేస్తుంది. ఆ వేడి నీటి ఆవిరి ఎగ్జాస్ట్ నుంచి పంప్ చేస్తుంది. ఆకాశంలో చల్లటి గాలిని తాకినప్పుడు తెల్లని గీతలు సృష్టించబడుతాయి.

Aeroplane

మరికొన్ని విషయాలు

-విమానంలో ఇచ్చే రుమాళ్లు, దుప్పట్లు ముప్పై రోజులకి ఒకసారి శుభ్రపరుస్తారు.
-విమానాల్లో పొగతాగడం 25 ఏండ్ల కిత్రం నిషేధించారు. అయినా కానీ ఇప్పటికి కొన్ని పెద్ద పెద్ద ఎయిర్ సర్వీస్ విమానాల్లో యాష్ ట్రేలుంటాయి.
-విమాన ప్రయాణాలంటే బయపడే వారుంటారు. ఈ రకమైన భయాన్ని ఏవియో ఫోబియా అంటారు. ప్రతి ఐదుగురిలో ఒకరికి ఇది ఉంటుంది.
-విమానంలోని టాయిలెట్స్‌ని వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరుస్తారు.
-ప్రపంచంలోని అతిపెద్ద విమానం బరువు ఇంచుమించు 600 టన్నులుంటుంది.
-కొన్ని ప్రమాదకరమైన సమయాల్లో ఆక్సిజన్ మాస్కులు ధరించడం విమానాన్ని నిలిపివేస్తున్నట్టు తెలుపుతుంది.
-విమానాన్ని మెరుపులు ప్రేరేపించగలవు.

సిబ్బంది కోసం..

విమానం నడిపే వాళ్లను పైలట్ అంటారని తెలుసు. ప్రతీ విమానంలో కనీసం ఇద్దరు పైలెట్లు తప్పనిసరిగా ఉంటారు. మరి వాళ్లకి ఫుడ్ ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? పైలట్, కో-పైలట్ తినే ఆహారం వేర్వేరుగా ఉంటుంది. ఇద్దరికీ ఒకేరకమైన ఆహారం అందకుండా చూసుకుంటారు. విమాన సిబ్బిందికి ప్రత్యేకమైన గదులు ఉంటాయి. ఆ గదిలో ఆరు నుంచి పది పడకలు ఉంటాయి. వీటితో పాటు అటాచ్ బాత్‌రూమ్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఈ గదినే ఎంటర్‌టైన్‌మెంట్ రూమ్‌గా మార్చుకుంటారు.

లోపలికి గాలి రావడానికి..

విమాన నిర్మాణం చూస్తే బయట నుంచి గాలి వచ్చే అవకాశమే ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ, బయట గాలి లోపలికి రావడానికి చిన్న చిన్న రంధ్రాలుంటాయి. అవి కిటీకి అద్దాల పైన ఉంటాయి. ఎప్పుడైనా చూడండి. ప్రతి విండోగ్లాస్ కింది భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం ప్రయాణికుల ప్రాణాలు కాపాడుతుంది. క్యాబిన్‌లో పీడనాన్ని సమానం చేయడంలో ఇవి కీలకంగా ఉపయోగపడతాయి. 35,000 అడుగుల వద్ద ప్రయాణికులకు ఆక్సిజన్ అందని సమయంలో ఈ చిన్న రంధ్రాలు పనికొస్తాయి.

త్రిభుజాలు..

విమానంలోని లగేజ్ క్యాబిన్‌కి కింది భాగంలో ఇరువైపులా రెండు త్రిభుజాలు కనిపిస్తాయి. అవి ఎందుకంటే విమానం బయట ఉన్న రెక్కలను సూచిస్తాయి. అవి ఎక్కడ ఉంటే అక్కడ బయటవైపు రెక్కలు ఉన్నాయని అర్థం. పైలెట్ ఎప్పుడైనా విమానంలో నుంచి ఇంజిన్‌ను పరీశీలించాలనుకున్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి.

1572
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles