ఇక్కడ ఇలా.. అక్కడ అలా..


Sun,March 31, 2019 02:59 AM

వస్తువుల ధరల్లో ఖరీదైనవి, చౌకైనవీ అంటూ తేడాలుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ సంస్థ మనిషి బతుకడానికి అయ్యే ఖర్చుల లెక్కల ఆధారంగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు, చౌక
నగరాల జాబితాను వెల్లడించింది. బతుకడానికి ఎక్కువ ఖర్చయ్యే నగరాలు ఏవి? తక్కువ ఖర్చుతో బతుకు బండిని లాగించేయగల నగరాలు ఏవి? అలాంటి నగరాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? వంటి ఆసక్తికర అంశాల ఆధారంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. లండన్‌కు చెందిన ఈ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం ప్రపంచంలోని 133 నగరాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ సర్వేలో విశేషమేంటంటే.. మొదటి స్థానంలో ఏదో ఒక నగరమే నిలుస్తుంది. కానీ.. ఈసారి ఏకంగా మూడు నగరాలు ఆ స్థానంలో నిలిచాయి. 30 యేండ్ల సర్వే చరిత్రలో ఇలా మూడు నగరాలు ఒకటో స్థానంలో నిలువడం ఇదే తొలిసారి. గతేడాది రెండో స్థానంలో నిలిచిన పారిస్ ఈసారి మొదటిస్థానంలో నిలిచిన నగరాల జాబితాలో స్థానం సంపాదించింది. ఇక్కడ ప్రస్తావించదగ్గ మరో విషయం ఏంటంటే.. టాప్ 10 దేశాల్లో చోటు సంపాదించిన యూరోలు కరెన్సీగా కలిగిన దేశాల్లో పారిస్ మాత్రమే స్థానం సంపాదించింది.
singapoor

ఆహార పదార్థాలు, రోజూవారి వస్తువుల ధరలు సేకరించి ఒక్కో దేశం ధరను ఇంకో దేశం ధరతో పోల్చి చూశారు. ఈ ధరలను పోల్చే క్రమంలో న్యూయార్క్ ధరలను ప్రామాణికంగా తీసుకున్నారు. కొన్ని దేశాల్లో మహిళల హెయిర్ ైస్టెలింగ్ ధరలను పరిశీలిస్తే.. పారిస్‌లో హెయిర్ కట్ చేయించుకోవాలంటే రూ. 8,178, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ అనే నగరంలో రూ. 5081, జపాన్‌లోని ఒసాకా నగరంలో రూ.3,672గా ఉంది. ఇదే చౌకధరల నగరాల్లో అయితే.. కేవలం వందల్లో మాత్రమే ఖర్చవుతుంది. పారిస్‌లో పర్యాటక రంగం నుంచి ఆదాయం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ధరలు ఆ స్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు.. అక్కడి ప్రజల ఆదాయం కూడా ఎక్కువే. వినోదం, విహారం, వ్యక్తిగత అందం, గృహావసరాల విషయంలో అక్కడి ప్రజలు విరివిగా ఖర్చు చేస్తారు. విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల ఈ నగరాలు ప్రపంచ ఖరీదైన నగరాల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.

ఆయా దేశాల జాతీయ ఆదాయం, ద్రవ్యోల్బణ స్థాయి, స్థిరంగా లేని ద్రవ్యవిలువల కారణంగా కొన్ని నగరాలు చౌక నగరాల జాబితాలోకి చేరుకున్నాయి. రోజూవారీ జీవితానికి ఎక్కువగా ఖర్చు చేసే బ్రెజిల్, టర్కీ, వెనిజులా వంటి నగరాలు ఖరీదైన నగరాల జాబితాలో చేరితే, తక్కువ జీవన వ్యయంతో గడిపే డమాస్కస్, చెన్నై, కరాచి వంటి నగరాలు చౌక నగరాలుగా మిగిలాయి. వెనిజులా, ఇండియా వంటి దేశాల్లో కరెన్సీ మార్పు, కొత్త కరెన్సీ ప్రవేశపెట్టడం వల్ల ఈ జాబితాల మార్పు సంభవించింది. ప్రపంచంలో అత్యంత చవకైన నగరంగా సిరియాలోని డమాస్కస్ నగరం నిలిచింది. జీవన వ్యయం, రోజూవారి జీవితానికి తక్కువ ఖర్చు పెడుతున్న నగరాల జాబితాలో కరాచి, ముంబై వంటి నగరాలు చేరాయి. ఖరీదైన నగరాలతో పోలిస్తే చౌక నగరాల్లో క్షవరం ఖర్చు వంద రూపాయల్లో అయిపోతుంది. ఒక్కపూట భోజనం రూ. 500 కంటే మించి ఉండదు. అదే.. ఖరీదైన నగరాల్లో అయితే.. కనీసం రూ. 5వేల వరకు ఉంటుంది. నిత్యం తాగే టీ, ఇతర చిరుతిళ్లకు కూడా తక్కువ ధర ఉండే నగరాలకు, ఖరీదైన నగరాలకు చాలా తేడా ఉంది. ప్రజల జీవన వ్యయం, ఆదాయంలో హెచ్చుతగ్గులు, ఆర్థిక, రాజకీయ రంగాల్లో నిత్యం పలు మార్పులు జరుగడమే ఇందుకు గల ప్రధాన కారణమని ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ పేర్కొంది.

ఖరీదైన టాప్‌టెన్ నగరాలు
1. సింగపూర్ (సింగపూర్)
2. పారిస్ (ఫ్రాన్స్)
3. హాంగ్‌కాంగ్ (చైనా)
4. జ్యూరిక్ (స్విట్జర్లాండ్)
5. జెనీవా (స్విట్జర్లాండ్)
6. ఒసాకా (జపాన్)
7. సియోల్ (దక్షిణ కొరియా)
8. కోపెన్‌హాగెన్ (డెన్మార్క్)
9. న్యూయార్క్ (అమెరికా)
10. టెల్ అవీవ్ (ఇజ్రాయెల్)లాస్ ఏంజిల్స్ (అమెరికా)

టాప్‌టెన్ చౌక నగరాలు
1. కరాకస్ (వెనిజులా)
2. డమాస్కస్ ( సిరియా)
3. తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)
4. అల్మాటా (కజికిస్తాన్)
5. బెంగళూరు (ఇండియా)
6. కరాచి (పాకిస్తాన్ )
7. లాగుష్ (నైజీరియా)
8. బ్వైనోస్ ఐరిజ్ (అర్జెంటీనా)
9. చెన్నై (ఇండియా)
10. న్యూఢిల్లీ (ఇండియా)

630
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles