ప్రముఖులు మెచ్చిన భవిష్యవాణి


Sun,March 31, 2019 02:26 AM

ఆరోగ్య జ్యోతిష్యం ఉంటుందా? అది రోగాలను నయం చేస్తుందా?ఎప్పుడు , ఏ అవయవానికి ఏ వ్యాధి వస్తుందో ముందే చెప్పగలదా? అది ఎంత కాలం ఉంటుందో జ్యోతిష్యానికి ముందే తెలిసిపోతుందా?ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే. ముందుగా బాలు మున్నంగి గురించి తెలుసుకోవాలి.

-అజహర్ షేక్, సెల్: 9963422160

సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగి రోబోలే రాజ్యమేలుతున్న కాలంలో జ్యోతిష్యబలం పనిచేస్తుందా? గ్రహాలు దాటిపోతున్నాం.. గ్రహచారాలు, గ్రహణాలు వాటిమీద ప్రభావం చూపుతాయా? ప్రపంచదేశాలతో పోటిపడుతున్నాం. అయినా మన పూర్వీకులు ఇచ్చినా నమ్మకాలను వదలలేకపోతున్నాం. ఇప్పుడు జరిగే ప్రమాదాన్ని ఆపలేని మనం.. భవిష్యత్తులో జరిగే సంఘటనలను జ్యోతిష్యం ద్వారా ఆపవచ్చా? ఆస్ట్రాలజీ, న్యూమారాలజీ, పామాలజీలు ఏం చెప్తున్నాయి. ఆ మూడింటిని అవపోసన పట్టిన బాలు మున్నంగి ఏమంటున్నాడు.

సెలబ్రిటీలు లక్షల మందిని ప్రభావం చేయగలరు. అభిమానులు వారు ఏం చెప్తే అది నమ్మేస్తారు.. అభిమానిస్తారు. అలాంటివారిని కూడా ప్రభావితం చేసే వ్యక్తులు కొందరుంటారు. వాళ్లు చెప్పినదాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు ఆస్ట్రో ఎండీ బాలు మున్నంగి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా.. పోలీస్ ఆఫీసర్ల నుంచి మొదలు బడా వ్యాపారవేత్తలు, లీడర్ల మీద కూడా ఈయన ప్రభావం ఉంటుంది. యాగాలు చేస్తానని డబ్బులు వసూలు చేయడు. చేతిరాత మార్చేస్తానని మాటిచ్చి మూటలు తీసుకోడు. మీ జాతక చక్రం ప్రకారం భవిష్యత్తులో ఇలా జరుగుతుందని సూచిస్తాడు. జరిగే దాన్ని ఆపలేనని కూడా ముందే చెప్తాడు. మనిషి జీవితంలో జరిగే సంఘటనలు ఏవీ యాదృచ్ఛికం కావు. ప్రతిదీ ముందుగానే నిర్ణయించబడుతుంది. అది మనిషి అరచేతి రేఖలో నిక్షిప్తం చేసి ఉంటుంది. వాటిని చదవడం వల్ల ఆ మనిషికి సంబంధించిన బలం, బలహీనత, అదృష్టం, దురదృష్టం, భవిష్యత్తులో జరగబోయే పరిణామల గురించి చెప్పొచ్చు అంటున్నాడు.బాలు మున్నంగి దగ్గర జాతీయ అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సినిమా వాళ్లు ఇలా అన్నీ రంగాల్లో ఉన్న సెలబ్రిటీలు జ్యోతిష్యం చెప్పించుకొని నివారణ మార్గాలు తెలుసుకుంటారు. ఆయన చెప్పినట్టు ఫాలో అయి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. అరచేతిలో ఉన్న రేఖలు, పుట్టిన సమయం, తేదీలను బట్టి ఆ వ్యక్తి జీవితంలో జరిగిన జరగబోయే సంఘటలను గురించి కచ్చితంగా చెప్పగలడు. స్పష్టంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. డిగ్రీ చదువుతున్నప్పుడు యురోపియన్ న్యూమరాలజిస్ట్ కిరో రాసిన కన్‌ఫ్యూజన్ అండ్ మెమరీస్ ఆఫ్ ఏ మోడ్రన్ సీర్ పుస్తకాన్ని చదివాడు. అది బాలుని ప్రభావితం చేసింది. అప్పటి నుంచి సీరియస్‌గా రీసెర్చి
మొదలుపెట్టాడు.
balu-munnangi

డోనాల్డ్ ట్రంప్, అజయ్ దేవగన్, కేంద్రమంత్రులు, వ్యాపారవేత్తలకు జ్యోతిష్యం చెప్పి తనేంటో నిరూపించుకున్నాడు. అందరి దగ్గర నమ్మకం సంపాదించాడు. ఆరోగ్యపరంగా ఎదురయ్యే రోగాలు, వాటిని ఎంతవరకు నయం చేయగలుతాం వంటి విషయాలు వివరిస్తాడు. ఎక్కువమంది జ్యోతిష్యులు నీ జీవితంలో కొన్ని గండాలున్నాయని చెప్పి భయపెడుతారు. వాటిని నివారించడానికి పూజలు, యాగాలు,హోమాలు చేస్తే అరికట్టవచ్చని చెప్పి మోసగిస్తారు. కానీ, బాలు అలా కాదు. అరచేతిలో ఉన్న రేఖలను మార్చడం ఎవరి వల్లా కాదు. ఆ వ్యక్తి జీవితంలో దురదృష్టకరమైన సంఘటన జరుగాలని ఉంటే జరిగి తీరుతుంది అని చెప్తున్నాడు. నేరుగా వచ్చి కలువలేని వాళ్లు విదేశాల నుంచి వాట్సాప్‌లో చేతి రేఖల చిత్రాలను పంపి తమ జ్యోతిష్యాన్ని చెప్పించుకుంటారు. ట్రంప్ రెండో భార్య మార్లా మాపల్స్, ఆమె కుమార్తె టిఫానీ ప్రతిరోజూ బాలుకి వాట్సప్‌లో టచ్‌లో ఉంటారు. న్యూయార్క్ మేయర్ నుంచి మొదలు ఐక్యరాజ్యసమితి సభ్యులు కూడా బాలు మున్నంగి వద్ద భవిష్యత్తు గురించి తెలుసుకున్నవాళ్లే. బాలీవుడ్ సినిమా శివాయ్ టైటిల్స్‌లో బాలుకి ప్రత్యేక కృతజతలు తెలిపాడు అజయ్ దేవగన్. బాలు పనితనాన్ని మెచ్చి 2018 సంవత్సరానికి గానూ సర్ సీవీ రామన్ అకాడమీ జ్యోతిష్య విశారద బిరుదునిచ్చి సత్కరించింది. ఐక్యరాజ్య సమితిలో భాగమైన నోవోస్ సంస్థకు బాలు సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. జాతక చక్రంలో పన్నెండు గడులుంటాయి. ఆ పన్నెండు గడులు శరీరంలో వివిధ భాగాల గురించి తెలియజేస్తాయి. అందులో ఆరోస్థానం రోగాన్ని, ఎనిమిదవ స్థానం ఆయుష్షు, పన్నెండో స్థానం ఖర్చు వంటివి చెప్తుంది. వీటి ద్వారా మనిషి ఆరోగ్య జ్యోతిష్యాన్ని చెప్పొచ్చు అంటున్నాడు. పుట్టుక నుంచే వచ్చే రోగాలు, పుట్టుక తర్వాత వచ్చే రోగాలు, వాటిలో శాశ్వత రోగాలు, నయం అయ్యే రోగాలు ఇలా పలు విభాగాలు విభజించి వాటి యొక్క స్థాయిని బట్టి మనిషి యొక్క ఆయుష్షు కూడా తెలుస్తుంది అని చెప్తున్నాడు. గ్రహాలు గ్రహాణాల ప్రభావం మనిషి మీద తప్పకుండా ఉంటుంది. ఏదైనా జరుగాలని రాసి ఉంటే అది ఏదో విధంగా జరిగి తీరుతుంది. ఆ ప్రక్రియకు ప్రతిదానికి లింక్ ఉంటుంది. అలా జాతక చక్రంలో రాసిపెట్టిన దానిని మార్చలేం. అలా జరుగుతుందని చెప్పడమే జ్యోతిష్యం అని చెప్తున్నాడు.

830
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles