నెట్టిల్లు


Sun,March 31, 2019 01:54 AM

టైమ్‌పాస్ కోసం చూసేవారికి యూట్యూబ్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వేడుక. టాలెంట్ నిరూపించుకోవాలని పరితపించేవారికి ఇది అవకాశాలు కల్పించే వేదిక. సినిమా లోకంలోకి అడుగుపెట్టాలన్న ఆలోచనతో చిన్న సినిమాలైన షార్ట్‌ఫిలింస్ తీసి,యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవారిని ప్రోత్సహిస్తున్నది నెట్టిల్లు. అలాంటి ప్రయత్నంలో తీసిన కొన్ని షార్ట్‌ఫిలింస్ ఈ వారం నెట్టిల్లులో..

కార్తీక్

దర్శకత్వం: వెంకీ కన్నాస్ బండిపల్లి
నటీనటులు : విజ్జు విజయ్, ఎస్. గాయత్రి, ప్రకాష్, రాజా కారెల్ల, వైడీఎన్ మణికుమార్
Total views42,116+(మార్చి 22 నాటికి) Premiered Mar 15, 2019
karthik

నువ్విక మారవ్.. అంటూ ఓ అమ్మాయి తనను ఇష్టపడే అబ్బాయిని తిట్టేసి వెళ్లిపోతుంది. లవ్ బ్రేకప్‌తోనే ఈ కథ మొదలవుతుంది. ఫైనాన్స్ రికవరీ మేనేజర్ కార్తీక్‌కి కాల్ చేస్తాడు. కొన్ని పేమెంట్స్ వసూలు చేయాలి. నీకో లిస్టు పంపిస్తాను. పదిరోజుల్లో ఈ లిస్టు క్లియర్ చేయాలి అని కార్తీక్‌కి చెప్తాడు మేనేజర్. ఆ మరుసటి రోజు నుంచి కార్తీక్ మేనేజర్ చెప్పిన టాస్క్ పూర్తి చేయడంలో మునిగిపోతాడు. ఓ కస్టమర్ దగ్గర ఫైనాన్స్ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఓ అమ్మాయిని చూస్తాడు. ఆమెను ఎలా పరిచయం చేసుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా.. తొలిప్రేమ సీన్‌లో పవన్ కల్యాణ్, కీర్తిరెడ్డిల సీన్ గుర్తొచ్చి అదే ఫాలో అవుతాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి దివ్య గారూ.. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అని చెప్తాడు కార్తీక్. దానికి ఆ అమ్మాయి.. నా పేరు దివ్య కాదు.. శృతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కార్తీక్ ఆ అమ్మాయిని పిలుస్తూ.. ఇప్పటి నుంచే నువ్వే నా శ్రీమతి.. ఐ లవ్యూ అని చెప్తాడు. ఆ తర్వాత ప్రతిరోజూ ఆ అమ్మాయిని వెతుకుతూ, ఆమెనే ప్రేమిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ షార్ట్‌ఫిలిం చూడాల్సిందే!

కల వరమాయె

దర్శకత్వం: రాయల్ వెంకట్
నటీనటులు : రాయల్ వెంకట్, హరి కీర్తన, ప్రైట్ ప్రీతి, సుభాష్ క్రిష్ణ
Total views11,254+(మార్చి 22 నాటికి) Published on Mar 21, 2019
kala-varamaye

అశ్విన్‌కి ముఖ్యమైన విషయం చెప్పాలని దీపూ అశ్విన్‌ని కలుస్తుంది. రేపు తను ప్రజెంట్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి అశ్విన్‌కి చెప్పానేది దీపూ ఆలోచన. అశ్విన్ దీపూని ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. అదే రోజు అశ్విన్ తన మనసులోని మాటను దీపూ మంచి మూడ్‌లో ఉన్నప్పుడే చెప్పేద్దామనుకుంటాడు. వెంటనే వెళ్లి ఇసుకలో తన మనసులోని మాటను రాసి, గులాబీలతో డెకరేట్ చేస్తాడ. దీపు కండ్లు మూసి అక్కడికి తీసుకెళ్లి తను రాసిన ఐలవ్యూ అనే అక్షరాలను చూపిస్తూ ఐలవ్యూ చెప్తాడు. కానీ దీపూ మనసులో మాత్రం ఒప్పుకోదు. అదే విషయాన్ని అశ్విన్‌కి చెప్తుంది. కానీ అశ్విన్ దీపు తనని ప్రేమిస్తుందనే నమ్ముతాడు. కాకపోతే బయట పడడం లేదని అనుకుంటాడు. ఇద్దరూ కొద్దిసేపు చర్చించుకుంటారు. అశ్విన్‌ని కసురుకొని దీపూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దీపూ, అశ్విన్ మళ్లీ కలుసుకున్నారా? దీపూ అశ్విన్ ప్రేమను ఒప్పుకుందా? తెలియాలంటే ఈ షార్ట్‌ఫిలిం పూర్తిగా చూడాల్సిందే!

లిపి

దర్శకత్వం: హరికాంత్ గునమగారి
నటీనటులు : రవివర్మ, శ్రీ సుధ, బోసు కంచర్ల, హారిక, శృతి నాయుడు, బన్నీ అభిరాం
Total views41,098+(మార్చి 22 నాటికి) Premiered Mar 19, 2019
lipi

పోస్టాఫీసులో కొత్తగా ఉద్యోగంలోకి చేరుతాడు ఓ వ్యక్తి. టెలిగ్రామ్ మీద పనిచేసే ఆయనకు పెద్దగా పనేం ఉండదు. ఖాళీగా కూర్చోలేక దిక్కులు చూస్తూ ఉంటాడు. మిగతా వారంతా కంప్యూటర్లు, ఫైల్స్ చూస్తూ ఉంటారు. ఇంతలో టెలిగ్రామ్‌లో ఆయనకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత వరుసగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఏం ప్రశ్న వస్తుందా? అని టెన్షన్ పడుతూ సమాధానం ఇస్తుంటాడాయన. ఆ తర్వాత రోజు నుంచి టెలిగ్రామ్ మెసేజ్‌లతో ఆ ఉద్యోగి బిజీ అయిపోతాడు. సడెన్‌గా ఆఫీస్‌బాయ్ వచ్చి.. సర్.. మీ లంచ్‌బాక్స్ ఇయ్యాల పక్కన పెట్టేయండి. ఇయ్యాల మెసేజ్‌లు బాగొస్తున్నట్టున్నయ్ సార్ అని అడుగుతాడు. దానికా ఉద్యోగి నీ యూనిఫాం ఏది రా అని అడుగుతాడు. ఇయ్యాల నా బర్త్‌డే సార్.. మీ లంచ్‌బాక్స్ పక్కన పెట్టేయండి. మీకు పార్టీ ఇస్తున్న అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వరుసగా టెలిగ్రామ్ నుంచి ఆయనకు మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. ఇంతకీ ఆ మెసేజ్‌లు పంపేది ఎవరు? ఆ ఉద్యోగిని గమనిస్తూ ఎవరైనా ఆట పట్టించడానికి పంపారా? లేదంటే ఇంకేదైనా ఉందా? ఆసక్తిగా, సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సాగిపోయే ఈ షార్ట్‌ఫిలిం చూడండి. బాగుంది.

సృజన

దర్శకత్వం: శ్రవణ్ డైమండ్
నటీనటులు : చింటు, సునిల్, కిరణ్ జినిక్స్, శ్రవణ్ డైమండ్
Total views 6,679+(మార్చి 22 నాటికి) Published on Mar 20, 2019
srujana

ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకరికి ఫోన్‌కాల్ వస్తుంది. పరుగున వెళ్లి తన ఫ్రెండ్‌ని కలిసి అరేయ్.. నువ్వు, సృజన మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో పెట్టారు రా అని చెప్తాడు. వెంటనే ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి తన సృజనకు కాల్ చేస్తాడు. ఆ అమ్మాయి ఎత్తదు. ఆ అమ్మాయి తనను వదిలేసిందని అప్పటికే అర్థమైపోతుంది. ఆలోచిస్తాడు. ఏడుస్తాడు. ఆరోజు రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి బాగా మందు తాగుతాడు. సృజననే తలుచుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఆ అబ్బాయిని ఊరడిస్తూ.. అరేయ్.. అమ్మాయిలంతా ఇంతేరా.. ఊకె సృజన.. సృజన అని ఏం ఒర్లుతున్నవ్ రా అంటారు. నిద్రలో కూడా ఆ అబ్బాయి సృజననే తలుచుకుంటూ ఉంటాడు. సృజన తనను మోసం చేసిందని తెలిసి, యూట్యూబ్‌లో వాళ్ల కాల్ రికార్డింగులు చూసి ఆ అబ్బాయి తట్టుకోలేకపో కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సృజన ఏం చేసిందో, ఆ అబ్బాయి ఏం చేశాడో తెలియాలంటే.. ఈ షార్ట్‌ఫిలిం చూడండి.

-ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

306
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles