అన్నీ ఫేక్ ఫొటోలే బాస్!


Sat,March 23, 2019 10:13 PM

చదువాలన్నా, వంట చేయాలన్నా, కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా ఈ కాలంలో ఇంటర్నెట్ కావాల్సిందే. నెట్‌కు అలవాటు పడ్డవారు అందులో కనిపించేవన్నీ ఒక్కోసారి నిజమనే నమ్ముతారు. అలా వైరల్ అవుతున్న ఫొటోలు ఫేక్ అంటే ఎవరూ నమ్మరు. ప్రతీదానికి ప్రూఫ్ కావాలి. అలాంటి వాటిలో ఈ మధ్య కొన్ని ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. తీరా చూస్తే అవి ఫేక్ అని తేలాయి. ఆ ఫేక్ ఫొటోల వెనుక ఉన్న వాస్తవాలివి.

శిల్పంలాంటి ఆకారం..

ఒక అబ్బాయి పెద్ద కడాయిలో అన్నాన్ని పైకి కిందికి తిరగేస్తున్నాడు. కడాయిలోని అన్నం అమాంతం అతని ముఖం దగ్గరగా ఉంటుంది. ఇంత దగ్గరగా ఉండి, అంత పైకి రైస్‌ని ఎగురవేసే అతని ఫొటోని ఇంటర్నెట్‌లో పెట్టారు. పెట్టిన కాసేపటికే అతని పర్ఫార్మెన్స్‌కి లక్షల్లో లైకులొచ్చాయి. అదంతా నిజమనే అనుకొని షేర్లు పెరిగాయి. కానీ తీరా విషయం బయట పడితే కానీ తెలియలేదు. అది ఫేక్ ఫొటో అని. దాన్ని ఫొటోషాప్‌లో ఎడిట్ చేసి నెట్‌లో వదిలారు. అసలు ఫొటో పక్కన ఉంది చూడండి.
rice

ఏకాకి జీవితం..

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, నెలలు నిండకుండానే రోడ్డున వదిలేసిన పిల్లలు ఎలా బతుకుతారు. వీరిని జీవితం ఎలా ఉంటుందన్న ప్రశ్నకి ఈ ఫొటో ఒక నిదర్శనం. ఇది ఎవరినీ ఫూల్ చేయడానికి కాదు. ప్రజలకి అవగాహన కల్పించడానికి మాత్రమే. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఫొటోలో కన్పిస్తున్న అమ్మాయికి అందరూ ఉన్నారు. రెండు సమాధుల మధ్య నిద్రిస్తున్న ఈ అమ్మాయి ఫొటో ఫేక్. కూర్చున్న అమ్మాయిది రియల్ ఫొటో.
yekaki

రాతి మీద కోట.. రాతి కింద నీరు..

సముద్రంలో, సరస్సులో చాలా రాళ్లుంటాయి. కొన్ని చిన్నగా, మరికొన్ని ఎత్తయిన పర్వతంలా ఉంటాయి. ఈ ఫొటో చూసి నీటిలో ఉండే రాతి మీద కోట ఎలా కట్టారా అని అందరూ ఆశ్చర్య పోయారు. ఫొటో చూస్తే నిజమే కావొచ్చనిపిస్తుంది. కానీ, ఇది అబద్ధం. నీటిలో ఉండే రాతిని చూసి దానిమీద కోట ఉంటే బాగుంటుందనుకున్నాడు ఓ వ్యక్తి. అది వీలుకాదని అర్థమైంది. కావాల్సినట్టుగా ఫొటోషాప్ చేశాడు. అది కాస్త నెట్‌లో పెట్టాడు.
rock-meeda-kota

ఈ ఫొటోకి ఓపిక ఉండాలి..

రాత్రి సమయంలో లైటింగ్‌తో వెలిగిపోయే బిల్డింగ్. పౌర్ణమినాడు వచ్చే నిండు చందమామ. రాత్రంతా తిరిగి బిల్డింగ్ మీద సేదతీరుతున్న చందమామలా భలే ఉంది అన్నట్లుంది. చూడ్డానికి బాగున్నా ఇందులో ఏ మాత్రం నిజం లేదు. రెండింటినీ విడివిడిగా తీసి ఫొటోషాప్ చేసిందే.
moon

పైలెట్ సెల్ఫీ..

ఈ విధంగా ఫొటో దిగలేరని తెలిసినా కంటి ముందు కనిపించే ఫొటోని చూసి నమ్మాల్సి వస్తుంది. ఆకాశంలోకి ఎగిరిన విమానంలోని పైలెట్ మేఘాలు పడేటట్లు సెల్ఫీ ఎక్కువే వైరల్ అయింది. నిజం ఏంటంటే భూమ్మీద ఉండే విమానంలో, పైలెట్ సెల్ఫీస్టిక్ పట్టుకున్నాడు. విమానానికి వెనుక, కింది భాగంలో మేఘాలు ఉండేలాగ ఫొటోషాప్ చేశాడు. అంతే
selfee

ఎలుగుబంటికి దొరికితే అంతే..

ఈ ఫొటో చూస్తే సైకిల్ మీద వెళ్తున్న అబ్బాయిని ఎలుగుబంటి తరుముతున్నట్టుంది. దానికి గనుక ఆ పిల్లాడు దొరికితే ఇక అంతే అన్నట్లుంది. రోడ్డు మీద చూస్తే ఎవరూ లేరు. అక్కడికి అబ్బాయి ఎందుకు వెళ్లాడు. అని ఎవరూ అనుకోరు. ఎలుగుబంటికి బలైపోయేలా ఉన్నాడే అని బాధపెట్టేలా ఉంది చిత్రం. కానీ, ఇది కూడా ఫొటోషాప్ చేసింది. రియల్ ఫొటో పక్కన ఉంది. చూడండి.
bear

మరగుజ్జు జిరాఫీ..

జిరాఫీలని ఎప్పుడు చూసినా పొడవుగా, సన్నగా చారలతో ఉంటాయనే తెలుసు. కానీ, ఈ జిరాఫీ మాత్రం భూమిని అంటుకొని మరగుజ్జులా ఉన్నది. చిన్నగా భలే ఉందే అనుకుంటారు. కానీ నిజమైన జిరాఫీ ఫొటోను ఫొటోషాప్ చేసి మరగుజ్జులా చేశారని ఎవరికీ తెలియదు.
ziraffee

ఐన్‌స్టీన్ వెనుక బాంబు పేలుడు..

ఒక పెద్ద బాంబు పేలింది. చుట్టూ జనం దాన్నే చూడసాగారు. ఐన్‌స్టీన్ మాత్రం సైకిల్ రైడ్ చేస్తున్నాడు. అది కూడా ఆనందంగా. ఐన్‌స్టీన్‌కి, బాంబ్‌కి ఎలాంటి సంబంధం లేదు. అసలు అక్కడ ఐన్‌స్టీనే లేడు. ఇదంతా కల్పితం మాత్రమే. కావాలంటే మీరే చూడండి.
einstean

అంతరిక్షం నుంచి కాదు..

టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా రాకెట్‌ను భూమ్మీద నుంచే లాంచ్ చేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసినా ఫొటోలో కనిపించేది చూసి మోసపోతుంటారు. కన్పిస్తున్న ఫొటోల్లో అంతరిక్షం నుంచి రాకెట్‌ని లాంచ్ అవుతున్నట్లు కనిపిస్తుంది.
rocket

1137
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles