Telangana Intermediate 1st & 2nd Year Results 2019

భీమ్ జోడీ..డైసీ ఎడ్గర్ జోన్స్


Sat,March 23, 2019 09:55 PM

daisy-edgar
డైరెక్టర్ రాజమౌళికి.. జక్కన్నగా ఇండస్ట్రీలో పేరు! బాహుబలితో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది.. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్ అనౌన్స్ చేశాడు.. అందులో కుమురం భీమ్‌గా నటిస్తున్నఎన్టీఆర్‌కు జోడీగా డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నది. జక్కన్న ఎంచుకున్నాడంటే
ఏదో విషయం ఉన్నట్టే.. మరి ఆ అమ్మడి గురించి నెటిజన్లు కూడా తెగ వెతికేస్తున్నారట.. మీరు ఇంకా చూడకపోతే ఇది చదివేయండి.

-ఈ అమ్మడు హాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్‌టగా పేరు తెచ్చుకున్నది. కోల్డ్ ఫీట్ టీవీ షోలో జోన్స్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే!
-కోల్డ్ ఫీట్ టీవీ షోలో ఒలివియా అనే సాధారణ యువతి పాత్రలో మెప్పించింది. చిన్నప్పుడే గర్భం దాల్చి కష్టాలు పడే యువతిగా నటనతో అదరగొట్టేసింది.
-ఎడ్గర్ పాండ్ లైఫ్ సినిమాలో, వార్ ఆఫ్ ది వరల్డ్స్ అనే టీవీ షోలతో పాటు, వింటర్ సాంగ్ అనే షార్ట్‌ఫిల్మ్‌తోనూ మంచి గుర్తింపు సంపాదించింది.
-ఐదేండ్ల వయసులో ఓ నాటకంలో నటించింది. ఆ ప్రదర్శన చూసి అంత మెచ్చుకోవడంతో తను నటన వైపు అడుగులు వేయాలని ఆ వయసులోనే నిర్ణయించుకుందట.
-2017లో ప్రముఖ రచయిత మెహ్సిన్ హమీద్ రచించిన ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్ నవల ఆధారంగా రూపొందిన నాటకంలో డైసీకి లీడ్‌రోల్ దక్కింది. అప్పటి నుంచి నాటకరంగంలో ఆమె పేరు మార్మోగింది.
-డైసీకి సమయం దొరికితే స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. తన ఫిటెనెస్‌కి కారణం కూడా అదే అంటున్నది.
-కొత్త ప్రదేశాలు చూడడం, షాపింగ్ చేయడం డైసీకి సరదా. చిరుతిళ్లు బాగా తింటుంది. పిజ్జా, రైస్ కేక్‌ని ఇష్టంగా లాగిస్తుందట. ఫొటోలు, సెల్ఫీలు దిగడమంటే ఎడ్గర్‌కి చెప్పలేనంత పిచ్చి. అందుకే ఆమె సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలే ఎక్కువ దర్శనమిస్తాయి.
-పద్నాలుగేండ్ల వయసులో ప్రతిష్టాత్మక నేషనల్ యూత్ థియేటర్‌లో జాయినయింది డైసీ. అందులో నటనకు సంబంధించిన పలు కోర్సులు చేసింది.
-డైసీ యావరేజ్ స్టూడెంట్. అన్నిటిలోనూ అత్తెసరు మార్కులతోనే పాసయ్యేది.
-త్రో బ్యాక్ పేరుతో అప్పుడప్పుడు పాత ఫొటోలను అంటే చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తుంటుందీ అమ్మడు.
-ఎడ్గర్ జోన్స్ అమెరికన్, ఐరిష్ యాసలో బాగా మాట్లాడుతుంది.
-డైసీ బ్రిటన్‌లో పుట్టింది. లండన్‌లో నివసిస్తున్నది.
-గిటార్ వాయించడం,పాటలు పాడడం అంటే ఈ అమ్మడికి బాగా ఇష్టమట. డ్యాన్స్ చేయడం సరదా అంటున్నది.

-సౌమ్య పలుస

393
Tags

More News

VIRAL NEWS