చల్లదనం కోసం ఆర్గానిక్ మంత్రం!


Sat,March 23, 2019 09:37 PM

మీరు పర్యావరణ ప్రేమికులా? పచ్చదనమంటే.. ప్రాణమిస్తారా? ఇప్పటివరకు ప్లాస్టిక్ నివారించమంటూ ఉద్యమాలు చేసుంటారు.. ఇప్పుడు మామూలు వస్ర్తాలను బ్యాన్ చేయాలని నినదిస్తున్నారు.. ఆర్గానిక్ క్లాతింగ్‌తో ఫ్యాషన్ బ్రాండ్‌లు.. ఇప్పుడు మార్కెట్‌లో మంచి లాభాలు సంపాదించాలి..
ఈ మండే వేసవి.. చల్లగా గడిచిపోవాలంటే.. కూల్ చేసే ఆర్గానిక్ క్లాతింగ్ ఎంచుకోవాల్సిందేనంటున్నారు ఫ్యాషనిస్టులు.. అందుకే మన దగ్గర ఉన్న ఆ బ్రాండ్‌ల లిస్ట్ ఏంటి?అది తెలిస్తే షాపింగ్ కూడా సులువైపోతుంది.. ఈ జంటకమ్మ గో గ్రీన్ అంటూ మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నది..


చుట్టూ పరిసరాలు పచ్చగా ఉన్నప్పుడే మన మనుగడ సరిగా సాగుతుంది. లేకపోతే మన భూమి అంతాన్ని మనమే చేజేతులా చేసేస్తున్నాం. ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కలిసి పోవడానికి కొన్ని యేండ్లు పడుతుంది. అలాగే కొన్ని రకాల బట్టలు కూడా భూమిలో కలిసి పోయేందుకు ప్లాస్టిక్ కంటే ఎక్కువ రోజులు కూడా పట్టవచ్చుననే విషయం మీకు తెలుసా? అందుకే వాటికి కూడా ప్రత్యామ్నాయాలు వచ్చేశాయి. ఆర్గానిక్ బట్టలతో మన జీవితాలనే కాదు.. ప్రకృతికి ఎంతో కొంత మేలు చేసినవాళ్లమవుతాం.
2018లో ఒక సర్వే జరిగింది. దాని ప్రకారం చూస్తే.. బట్టల్లో ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్ వస్ర్తాలుంటాయని తెలిసింది కేవలం 34శాతం మందికేనట. మిగతా వాళ్లంతా కేవలం బ్రాండ్ పేరు, ధరలను చూసి కొంటున్నట్లు తెలిసింది. 18 నుంచి 37 వయసు ఉన్నవాళ్లపై ఈ సర్వే చేశారు. 95శాతం మంది ఆన్‌లైన్‌లోనే బట్టలు కొనడానికి ఇష్టపడుతున్నట్లు తేలింది. 95శాతంమంది ధర చూసి కొంటే, యూనిక్‌గా ఉండాలనుకునేవాళ్ల శాతం 92గా ఉందట. కేవలం బ్రాండ్ చూసి కొనేవాళ్లు 60శాతం మంది ఉన్నారు.
Cloths

ఇద్దరికీ కలిపి..


కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా పెద్ద వాళ్ల కోసమే ఆర్గానిక్ మంత్రాన్ని వల్లె వేస్తున్నాయి. అందులో నాస్టీస్ అనే కంపెనీ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ బ్రాండ్ బట్టలు చాలా ట్రెండీగా కూడా ఉంటాయి. టీ-షర్ట్‌లు, షర్ట్‌లు, ప్యాంట్స్, టాప్స్, డ్రెస్‌లు, స్కర్టులు, స్కార్ఫ్‌లు కూడా ఆర్గానిక్‌వి లభ్యమవుతాయి. పైగా వీటి ధర కూడా 500 నుంచి 2500లోపే ఉండడం మరింత వీటిపై మొగ్గు చూపేలా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఉంది క్లోరోఫిల్. ఇది లండన్ బేస్డ్ బ్రాండ్. పైగా గ్లోబల్ ఆర్గానిక్ టెక్స్‌టైల్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన బ్రాండ్ కావడంతో అందరి దృష్టి ఈ బ్రాండ్ మీద ఉంది. ఇందులో 100శాతం ఆర్గానిక్ కాటన్, బాంబూ ఫైబర్‌ని వాడి ఈ దుస్తులను తయారు చేస్తారు. గ్రాఫిక్ టీ షర్ట్‌లు, జీన్స్, ట్రౌజర్స్, షార్ట్స్, టాప్స్, స్కర్ట్స్‌లు ఈ బ్రాండ్‌లో దొరుకుతాయి. వీటి ధర స్థాయి కూడా నాస్టీస్ అంతే ఉండడంతో పాటు అన్ని ప్రముఖ ఈ -కామర్స్ సైట్‌లలో కూడా అమ్ముతుండడం విశేషం. మరొక బ్రాండ్ పేరు యూవీ అండ్ డబ్ల్యూ. దీంట్లో ట్రాక్ సూట్స్, స్వెటర్లు కూడా లభిస్తాయి. ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రత్యేకమైన కలెక్షన్ ఉండడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. పైగా ధరలు కూడా రీజనబుల్‌గా ఉండడం ఈ ఆర్గానిక్ బట్టలపై మార్కెట్‌లో మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

పిల్లలకు ప్రత్యేకం..


సుతిమెత్తని చర్మానికి మరింత మెత్తని దుస్తులను ఎంచుకోవాలి. ముట్టుకోగానే పిల్లల్లా మెత్తగా ఉండే దుస్తులు వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకొనే కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా పిల్లలకోసమే ఆర్గానిక్ బట్టలను రూపొందిస్తున్నాయి. పైగా నాచురల్ రంగులను ఎంచుకొని మరీ ఈ బట్టలను తయారు చేయడం ప్రత్యేకం. జీజీజూ అనే కంపెనీ క్రియేటివ్‌గా, ఫంకీగా బట్టలను తయారు చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కువ మార్కులు కొట్టేసి టాప్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నది. పైగా ధరలు కూడా 500 నుంచి 3వేల రూపాయల వరకే ఉండడంతో ఈ బట్టలపై మరింత ఆసక్తి పెరిగింది. పిల్లలు త్వరగా ఎదిగిపోతారు. అలాంటి వారికోసమే చెర్రీ క్రాంబుల్ కాలిఫోర్నియా అనే బ్రాండ్ మొదలయింది. వీరు వందశాతం ఆర్గానిక్ అవుట్‌ఫిట్‌లను పిల్లల కోసం రూపొందిస్తున్నది. అన్ని రకాల బట్టలను తక్కువ ధరలో రూపొందించడం ఈ బ్రాండ్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాంటిదే మరో బ్రాండ్ లిటిల్ కంగారూస్. 1996లో మొదలైన ఈ బ్రాండ్ ఈ మధ్యకాలంలో మరింత పాపులర్ అయింది. గ్రీన్ లీఫ్ ఆర్గానిక్ అనే బ్రాండ్ దుస్తులు ఎక్కువగా నైట్‌వేర్‌కి సంబంధించినవే తయారు చేస్తుంది. పిల్లలు పడుకునేటప్పుడు సౌకర్యవంతంగా నిద్రపోవాలన్నదే వీరి ఆశ అంటున్నది కంపెనీ. పైగా వెయ్యి రూపాయల లోపే ఈ బట్టలు మనకు అన్ని వెబ్‌సైట్‌లలో దొరుకుతున్నాయి.
Cloths1

వీరి రూటే సపరేట్..


కొన్ని కంపెనీలు ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రత్యేకంగా ఆర్గానిక్ మంత్రాన్ని వల్లె వేస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో మగవాళ్లకు మాత్రమే దుస్తులు రూపొందించే కంపెనీ ఇండోఫైలీ. ఈ పేరుకు కూడా ఒక అర్థముందంటండోయ్! భారతదేశాన్ని ప్రేమించి ఈ పేరు పెట్టుకున్నారట. దేవుడి బొమ్మలతో వచ్చే టీ షర్ట్స్ ఈ కంపెనీ ప్రత్యేకంగా రూపొందిస్తున్నది. యూనిక్‌గా ఉండే ఈ బ్రాండ్ కేవలం టీ-షర్ట్‌లు మాత్రమే తయారుచేస్తున్నది. అది కూడా వెయ్యి రూపాయల లోపలే ఇవ్వడంతో ఎక్కువగా ఈ బ్రాండ్ వైపు మగవాళ్ల చూపులు పడ్డాయి. ఆర్గానిక్‌లో అమ్మాయిలు కోసం ఎక్కువగా స్కర్ట్‌లు, టాప్‌లు రూపొందించే బ్రాండ్‌లే ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా చీరలను కూడా తయారుచేస్తున్నది జీరో బ్రాండ్. సంప్రదాయానికి అద్దం పట్టే అన్ని రకాల బట్టలు ఈ బ్రాండ్‌లో దొరుకుతాయి. కాకపోతే దీన్ని ప్రైజ్ రేంజ్ రూ. 500 నుంచి 80వేల రూపాయల వరకు ఉంది. ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలకు ప్రత్యేకంగా ఒక బ్రాండ్ ఉంది. అదే మహీక్రైట్. టీ-షర్ట్స్, షర్ట్‌లు మాత్రమే వందశాతం ఆర్గానిక్ బట్టలను రూపొందిస్తున్నది.

లో దుస్తులు కూడా..


ఒంటికి అంటుకుపోయే లో దుస్తులు కూడా ఆర్గానిక్ ఉండాలన్నది అందరి వాదన. అందుకే కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా వీటిని తయారుచేసే పనిలో పడ్డాయి. ఇన్నర్ సెన్స్ అనే బ్రాండ్ కేవలం ఆడవాళ్ల లోదుస్తులను రూపొందిస్తున్నది. ఆర్గానిక్ కాటన్, బాంబూ ఫైబర్, యాంటీ మైక్రోబియల్స్‌తో ఈ లోదుస్తులను రూపొందించడం ప్రత్యేకంగా చెబుతారు. పైగా ఈ దుస్తులు బ్యాక్టీరియాను వినాశనం చేసి మీ శరీరానికి ఎలాంటి హాని కలుగకుండా కూడా చూసుకుంటాయట. అందుకే వీటిని ఎంచుకోవడం ఎంతైనా మంచిదంటున్నారు. పలు వెబ్‌సైట్లలో దొరికే ఈ దుస్తులు.. 1500 రూపాయల లోపు లభ్యమవుతున్నాయి. యూవీ అండ్ డబ్ల్యూ బ్రాండ్ కూడా లోదుస్తులను రూపొందిస్తున్నది.

-సౌమ్య పలుస

264
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles