వాస్తు


Sat,March 23, 2019 10:58 PM

మా ఇంటికి పడమర ఇంటి వాళ్లకి స్మిమ్మింగ్ పూల్ ఉంది. అది మాకు దోషమా? కె.ప్రభాకర్, పటాన్‌చెరువు


ఇల్లు ఎవరి ఇష్టానుసారం వారు కట్టుకుంటారు. వారి వారి అభిరుచులు అభిప్రాయాలు ప్రతిబింబించేదే గృహం. అందుకే గృహం స్వర్గధామం అని ఊరికే అనలేదు కదా. మీ ఇంటిని మీరు స్వతంత్రంగా కట్టుకున్నా పిదప పక్కవారి స్థలంలో వారి ఇల్లు ఉంటుంది. అది పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు. మీ ఇంటికి పడమర స్మిమ్మింగ్ ఫూల్ దోషమని మీకు అనిపించినంత మాత్రాన శాస్త్రం అంగీకరించదు. దానిని ఇతరులు అనుభవిస్తున్నారు మీరు కాదు. పైగా మీకు వారికి మధ్య ఎవరి కాంపౌండ్స్ వారికి ఉన్నాయి కదా. వాస్తులోని అద్భుతం అదే. మీ క్షేత్రం భూమి తెంఫుతో వేరైనాక పక్కవారి నిర్మాణ ప్రభావాలు మన ఇంటిపైన ఉండవు. మీరు ఉపవాసం ఉంటే పక్క ఇంటివాళ్లు ఉండాలని లేదు కదా!
symphonysummer

ఆగ్నేయంలో సెల్లారులో కిచెన్ పెట్టుకోవచ్చా? స్థలం ఆగ్నేయంలో డౌను ఉంది.గీతామాధురి, రాయిగిరి


ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఎత్తుపల్లాలను సమతుల్యం చేసుకోవాలి. స్థలాలు అనేక వంపులతో రాళ్లు, గుట్టలతో ఉంటాయి. చాలామంది గొయ్యి కలిసివస్తుందని దానిని మట్టితో నింపకుండా దానినే సెల్లారు పార్కింగ్ చేయడం ఆ లోతులో ఒక గది కట్టడం చేస్తారు. ఎక్కడ లోతు ఉండాలి అనేది పరిశీలించుకోకపోతే ఆ గోతిలోనే జీవితాలు కూరుకుపోతాయి. మీరు ముందు ఆగ్నేయం దిశ సెల్లారు నింపండి. దానిలో కిచెన్ పెట్టడం అంటే గొయ్యిలో పొయ్యి ఆగ్నేయం రావడం చాలా ప్రమాదం. ఆగ్నేయం దిశ పొయ్యికి మంచిదే. కానీ దానిని గొయ్యి చేసి పొయ్యి పెట్టడం ప్రమాదాలను తెచ్చుకోవడం అవుతుంది. స్థలాన్ని నలుమూలలు చదును చేసి పీఠంలాగా మార్చి దానిపై గృహం కట్టాలి.

చేసేదీ, చేయించేదీ అన్నీ భగవంతుడే అని నమ్మినప్పుడు వాస్తుతో పనేముంటదండి?ప్రణీత్ వర్మ, మేడ్చల్


మనిషి సాధారణంగా ఆలోచించినంతకాలం ఏవీ అర్థం కావు. అన్నీ చేసే భగవంతుడే శాస్త్ర ప్రమాణాల్నీ, విధివిధానాలనీ అందించాడు. ఈ ప్రకృతినీ, ఋతువులనీ, రాత్రింభవళ్లన్లూ ఏర్పాటు చేశాడు. మీ అమ్మను, నిన్ను కంటికి రెప్పలా చూసుకునే వాణ్ణి నేనురా అని తండ్రి కొడుకుతో అంటాడు. కానీ ఆ కొడుక్కు పాలు ఇచ్చింది, ప్రాణం పోసింది ఎవరు అంటే మీ అమ్మరా అంటాడు. ఎందుకు ఇతడు పాలు ఇవ్వొచ్చు కదా. లేదు ఆ ఏర్పాటు అతనిలో లేదు. ఆ తల్లికి ఆహారం, ఆరోగ్యం మంచి చెడులు చూస్తేనే ఆ తల్లి శరీరంలో పాలు వచ్చాయి. కానీ అది తాను చేయలేడు. ప్రకృతిలో ఉండే గుణాలు మనిషి మీద ప్రభావం చూపుతాయి. పరిసరాల్లో సాధు భావన, అహంకార భావన, మొద్దు భావనలు ఉంటాయి. అవే సత్వరజోస్థమో గుణాలు ఇవి మనిషిలో హెచ్చు తగ్గులలో ఉంటాయి. వాటిని సమతుల్యం చేసే అద్భుత శాస్త్ర నిర్మాణ శక్తి కేంద్రం గృహం.ఒక్కొక్కరిలో ఒక్కో గుణం హెచ్చు స్థాయిలో ఉంటుంది. తద్వారా వారి బుద్ధులు విపరీతంగా ఉంటాయి. అవి జన్మతహా కలుగజేస్తాయి. వేడెక్కిన శరీరాన్ని చన్నీటితో తుడిచి చల్లబరుస్తాయి. అలాగే మానవుడిలోని ప్రకోపాలు తీవ్ర నిర్ణయాలు తీసుకునే విధంగా వారి జీవితం అదుపు తప్పకుండా ఇల్లు గణిత బద్ధంగా సూర్యగమన బద్ధంగా, ఋతువుల భూభ్రమణ దిశలబద్ధంగా స్థలాన్ని ఎంచుకొని, గృహం నిర్మించడం అందరికీ అవసరం. అందుకు వాస్తు పుట్టింది. గీతలో కృష్ణుడు పలికిన సందర్భం వేరు. దాని లోతుపాతులు వేరు. ఋషులు ఏది చెప్పినా మానవుల మంచికే అన్న విచక్షణ మనకు ఉంటే చాలు. అంతా శుభమే.

దక్షిణం ఇంటి కప్పును మా ఇంటికి లాన్‌గా చేసుకోవచ్చా? ఆ ఇల్లు మాదే?బి.అరవిందరావు, కొత్తగూడెం


మీ ఇంటి ప్లాన్ చూశాను. మీది దక్షిణం, తూర్పు రోడ్లు కలిగిన ఇండ్లు. అందులో దక్షిణంలో కట్టిన ఇల్లు ఒక అంతస్తు కట్టారు. ఉత్తరం ఇల్లు రెండు అంతస్తులు కట్టినట్లు తెలిపారు. పైగా మీ దక్షిణ గృహం స్థలం ఉత్తర గృహం కన్నా పది ఫీట్లు డౌనులో ఉంది అని రాశారు. మీరు దోషపూరితమైన విధానంలో నిర్మించారు. ఆ దక్షిణ స్థలం గృహం మీరు అసలు వినియోగించవద్దు. సహజసిద్ధంగా ఆ స్థలమే నిరుపయోగమైనది. దాంతోపాటు మీ గ్రౌండ్ లెవెల్‌లో దక్షిణం ఇల్లు స్లాబు భాగాన్ని లాన్ (గ్రీనరీ) చేసుకొని వాడాలనుకోవడం అసలు మంచిది కాదు. మళ్లీ ఆ ఇల్లు కూడా మీరే వాడుతున్నారు. ముందు ఆ గృహం పరాధీనం చేయండి. ఉత్తరంలోని గృహంలో వాస్తు దోషాలు సరిచేసుకొని వాడుకోండి.

242
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles