రాశి ఫలాలు


Sat,March 23, 2019 10:54 PM

24-3-2019 నుంచి 30-3-2019 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి. వైద్య, న్యాయవాద, ఇంజినీరింగ్ వృత్తి వారికి ఈ వారం లాభ దాయకం. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ, హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాలు ఇత్యాది వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రధానమైన గ్రహాలు గురు, శని, రవి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. శుభకార్యాల విషయంలో ఆటంకాలు ఉంటాయి. పెద్దల సూచనలు తప్పక పాటించాలి.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్‌లు ఉంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. పైచదువులకు అనుకూలమైన వారం. పిల్లల కోసం చేసే పనులన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. న్యాయవాద, వైద్య వృత్తులు లాభదాయకంగా ఉంటాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని మంచి పేరు వస్తుంది. అనవసర ప్రయాణాలు, ఊహించని ఖర్చులు ఉంటాయి. పనివారితో సమస్యలు ఎదురవుతాయి. బంధువులు, స్నేహితులతో వైషమ్యాలు గోచరిస్తున్నాయి.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇంటిలో భార్యాపిల్లలతో సంతోషంగా, హాయిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి ఆదాయం పెరుగుతుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. తోటి ఉద్యోగులు, పైఅధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. శుభకార్యాల విషయంలో ఆలస్యం జరగొచ్చు.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరు పొందుతారు. పనివారితో అనుకూలత ఉంటుంది. ఆత్మీయులు, స్నేహితులతో చాలా పనులు నెరవేరుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల లాభాలు పొందుతారు. వాహనాలు, వస్తువులు కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద, ఇంజినీరింగ్, వైద్య వృత్తుల్లోని వారికి కలిసొస్తుంది.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు, పై అధికారులతో వైషమ్యాలు గోచరిస్తున్నాయి. పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. శుభకార్య ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగుతాయి. పనివారితో సమస్యలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నదమ్ములు, స్నేహితులతో కలహ సూచనలున్నాయి. వాహనాల వల్ల ఖర్చులుంటాయి. పెద్దల సూచనలు పాటించాలి.

కన్య

ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్యమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. రోజువారీ క్రయవిక్రయాలలో లాభాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు, పై అధికారులతో వైషమ్యాలు గోచరిస్తున్నాయి. ఉన్న వారికి కార్యకర్తల సహాయ సహకారాలు కొరవడతాయి. ఒక శుభకార్యం విషయంలో చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. వాహనాల వల్ల ఊహించని ఖర్చులు ఉంటాయి.

తుల

ఈ రాశి వారికి ఈ వారంలో కుజుడు మినహా ఇతర గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దీంతో భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, పత్రికా రంగాల్లోని వారు గణనీయ అభివృద్ధి సాధిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల చదువు, శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి మంచి సమయం. ఆర్థిక సమస్యలు తీరుతాయి. పనివారితో ఉన్న ఇబ్బందులు పరిష్కారం అవుతాయి.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారు భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, పత్రికా, సినిమా రంగాల్లోని వారు కొత్త అవకాశాలు పొందుతారు. హోటల్, క్యాటరింగ్, కిరాణా, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధద్రవ్యాలు తదితర వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. న్యాయవాద, వైద్య వృత్తులు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాల్లో వేగం కొరవడుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారు ఇంకా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలు ఉంటాయి.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారికి వాహనాల వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. అన్ని విషయాలలో ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రధాన గ్రహాల స్థితి ప్రతికూలంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారం లాభదాయకంగా ఉన్నా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి బాగా ఆలోచించాలి. పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటి ఉద్యోగులపై అవగాహన పెరుగుతంది. పై ఆదరణ లభిస్తుంది. రాజకీయంలో కార్యకర్తల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు పొందుతారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి.

కుంభం

ఈ రాశి వారికి ఈ వారంలో కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. పనివారు అనుకూలంగా ఉంటారు. కొన్ని పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవచ్చు. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. సినిమా, సాహిత్య, పత్రికా రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. హోటల్, క్యాటరింగ్ బిజినెస్‌లు లాభదాయకంగా ఉంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్, వడ్డీ వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఒక శుభకార్యం విషయంలో చేసే ప్రయత్నాలు ఫలించక పోవచ్చు.

మీనం

ఈ రాశి వారికి ఈ వారంలో పనివారితో అనుకూలత ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్నవారు చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, స్నేహితుల సహాయ సహకారాలు సకాలానికి అందుతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నవారు లాభాలను గడిస్తారు. నలుగురిలో మంచిపేరు పొందుతారు. ఉద్యోగ, శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యకు అనుకూలంగా ఉంటుంది. పెద్దల సూచనలతో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in
rasi-phalalu

1036
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles