బ్రాండ్ భాజా హీట్!


Sun,March 10, 2019 02:19 AM

sunglasses
ఫారెన్‌హీట్‌ల్లో మండిపోతున్న ఎండల్ని.. కూల్‌కూల్‌గా కంప్లీట్ చేయాలనుకుంటున్నారా?మండే ఎండల్లో చల్లటి నేస్తాలే.. చలువ కళ్లద్దాలు.. ఉష్ణోగ్రతలు అధికమై.. అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా.. ఆ కిరణాలు.. కళ్లకు చిక్కులు తేకుండా ఉండాలంటే.. మంచి బ్రాండ్ ఉన్న సన్‌గ్లాసెస్‌ని వాడి తీరాల్సిందే! భారతదేశంలో ఉన్న టాప్ బ్రాండ్‌ల లిస్ట్ చాలా పెద్దదే.. అన్నీ ఇక్కడ రాయడానికి కుదరదు కాబట్టి.. టాప్ 10లో చోటు సంపాదించుకున్న సన్‌గ్లాసెస్ లిస్ట్ ఇది.. ఈ మండే హీట్‌ని దంచేయడానికి ఇక సిద్ధమైపోండి..

sunglasses1

రే బాన్

రేబాన్ అనేది ఒక ఐకానిక్ బ్రాండ్. అన్ని తరాల వారికి ప్రీతి పాత్రమైన చలువ కళ్లద్దాల్లో దీనిది మొదటి స్థానమనే చెప్పాలి. కూల్ ఫ్రేములు, లెన్స్‌లు రే బాన్‌లకు సొంతం. ఆకుపచ్చ రంగు, అతినీలలోహిత కోటింగ్, పాలీరిజైషన్‌తో ఉన్న లెన్స్‌లు మరింత అందాన్ని పెంచుతాయి. ఎలాంటి ఫ్రేములైనా అన్ని రకాల ముఖాలకు సరిగ్గా సరిపోతాయి. అవియేటర్, వేఫెరర్ సన్‌గ్లాసులను మార్కెట్‌లో పరిచయం చేసింది ఈ బ్రాండ్ సన్‌గ్లాసెస్‌లే! అందరికే కాదు.. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే రే బాన్ ఫాలోవర్, లవర్‌గా చెప్పుకొంటుంది. ఆడ, మగ, పిల్లలకు సంబంధించిన వీటి ధర 3వేల నుంచి 12వేల రూపాయల వరకు ఉంది. అవియేటర్, వెఫేర్‌తో పాటు క్లబ్‌మాస్టర్, రౌండ్, జస్టిన్, ఎరికా టైప్‌ల సన్‌గ్లాస్‌లు ఈ బ్రాండ్‌లో దొరుకుతాయి.

sunglasses2

ఐడీ

తక్కువ ధరలో మన్నికైన గ్లాసెస్ కావాలంటే ఈ బ్రాండ్‌ని ఎంచుకోవాల్సిందే! ఫ్రేముల్లో కొత్తదనం కనిపిస్తుంది. దీంట్లో వాడే అద్దాలు పాలిరైజ్‌డ్‌వి కావడం వల్ల మరింత క్లియర్‌గా ఎదుటివాళ్లను చూడవచ్చు. ప్లాస్టిక్ ఫ్రేముల కారణంగా వీటి ధర తక్కువగా నిర్ణయించబడింది. వెయ్యి నుంచి మూడు వేల రూపాయల మధ్యలోనే ఈ సన్‌గ్లాసెస్ లభ్యమవుతాయి. పిల్లలకు ఇందులో కలెక్షన్ లేదు. రౌండ్, స్పోర్ట్స్, స్క్వేర్, వేఫర్, అవియేటర్, రెక్ట్యాంగిల్, ఓవల్, ఓవర్ సైజ్, క్యాట్ ఐలాంటి మంచి కలెక్షన్ ఇందులో దొరుకుతాయి.

sunglasses3

ఫాస్ట్రాక్

అతిపెద్ద యూత్ ఫ్యాషన్ బ్రాండ్ అంటే వెంటనే గుర్తొచ్చేది ఫాస్ట్రాక్. ట్రెండీ కలెక్షన్‌లకు పెట్టింది పేరు. పైగా తక్కువ ధరలో.. కూల్‌గా కనిపించేందుకు ఇవి బాగా ఉపయోగపడుతాయి. పర్సనాలిటీకి తగ్గట్లుగా ఇందులో షేడ్స్ లభిస్తాయి. చూడడానికి కూడా ఎక్కువ ధర పెట్టినట్లుగా కనిపిస్తాయి. ఈ కళ్లద్దాలు.. కండ్ల రక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. పిల్లలకు, పెద్దలకు నచ్చే విధంగా ఈ గ్లాసెస్ దొరుకుతాయి. వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు వీటిని కొనుక్కోవచ్చు. బగ్ ఐ, క్లాసిక్, స్కేర్స్, డిజైనర్, పైలెట్స్, స్పోర్టీ రాప్, బటర్ ైఫ్లె, ఓవల్, రెక్ట్యాంగులర్, రౌండ్, ఎడ్జీ, ట్రెండీ టైప్‌ల కళ్లద్దాలు ఉంటాయి.

sunglasses4

ఓక్లే

పాలిరైజ్డ్ సన్‌గ్లాసెస్‌లో వచ్చేమంచి రకంలో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. సరికొత్త టెక్నాలజీతో చేసిన ఫ్రేములను ఇందులో గమనించవచ్చు. పాతతరంలో వాడే ఫ్రేములను వీళ్లు ట్రెండీగా తీసుకొచ్చారు. కొన్ని కళ్లద్దాలు పెట్టుకోవాలంటే చిరాకు వస్తుంది. ముక్కు నుంచి జారిపోవడం, స్కిన్ ఎలర్జీలాంటివి రాకుండా ఉండేలా ఈ ఫ్రేములన్నీ తయారవుతాయి. బాలీవుడ్ కండల వీరుడు ఎక్కువగా ఈ సన్‌గ్లాసెస్‌తో దర్శనమివ్వడం గమనించవచ్చు. 5 నుంచి 7వేల రూపాయలు ధర పలికే వీటిలో కూడా పిల్లలకు కలెక్షన్ లేకపోవడం కాస్త బాధకారమే. రాప్, వేఫేరర్, స్కేర్, అవియేటర్, స్పోర్ట్స్, రెక్ట్యాంగులర్, ఓవల్, రౌండ్ టైప్‌ల్లో ఉండే కళ్లద్దాలు లభ్యమవుతాయి.

sunglasses5

వోగ్

చిక్ కలెక్షన్‌గా చెప్పే వోగ్ అందరికీ నచ్చి తీరుతాయి. కొత్త ట్రెండ్ ఏది వచ్చినా ముందుగా అప్‌డేట్ అయింది ఈ బ్రాండేనంటారు ఫ్యాషనిస్టులు. డిఫరెంట్ కలర్స్‌తో, క్వాలిటీ లెన్స్‌తో వచ్చే ఈ గాగుల్స్ యూవీ కిరణాల నుంచి కూడా రక్షిస్తాయి. సీఆర్-13లెన్స్ వల్ల ఎలాంటి గీతలు, మరకలు పడకుండా ఉంటాయి. రూ. 1500 నుంచి 70వేల రూపాయలు పలికే ఈ గాగూల్స్ ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రత్యేక కలెక్షన్స్‌ని తీసుకొచ్చాయి. బటర్ ైఫ్లె, స్కేర్, క్యాట్ ఐట, రెక్ట్యాంగులర్, అవియేటర్, ఓవర్ సైజ్డ్, వేఫెరర్ రకాల కళ్లద్దాలు చూడముచ్చటగా కనిపిస్తాయి.

sunglasses6

గుస్సీ

ప్రపంచం మొత్తం ఈ బ్రాండ్‌కి దాసోహమే అనొచ్చు. అంతగా ఈ బ్రాండ్ పాపులర్. బ్యాగులే కాదు.. చలువ కళ్లద్దాల్లోనూ ఈ బ్రాండ్‌లు ప్రత్యేకతతో మెరుస్తాయి. ఈ ఫ్రేములు, లెన్స్‌ల్లో దొరికే కలర్స్ మరే బ్రాండ్‌లోనూ దొరుకవంటే అతిశయోక్తి కాదేమో! హాలీవుడ్‌లో ఒకప్పుడు పెట్టుకున్న పాత ఫ్రేముల్లాంటి అద్దాలను కూడా గుస్సీ బ్రాండ్‌లో కనిపిస్తాయి. స్టయిల్ ఐకాన్‌గా మిగలాలంటే మాత్రం వీటిని సొంతం చేసుకోవాల్సిందే. 7వేల రూపాయల నుంచి 55వేల రూపాయల వరకు వీటి ధర పలుకుతాయి. స్కేర్, ఓవల్, క్యాట్ ఐ, అవియేటర్, రౌండ్, ఓవర్ సైజ్డ్, బటర్ ైఫ్లె, వేఫేరర్, రెక్ట్యాంగులర్ రకాలు ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

sunglasses7

జో బ్లాక్

మనోహరమైన లుక్ కోసం ఈ బ్రాండ్ చలువ కళ్లద్దాలు ధరించాల్సిందే! చల్లని, కాస్లిక్ రిఫ్రెష్ లుక్ కోసం ఈ కళ్లద్దాలు బాగుంటాయి. అవియేటర్, ఓవల్, రెక్ట్యాంగులర్, రౌండ్, రాప్, క్లాసిక్ రెట్రో, క్యాట్ ఐ, స్కేర్, ఓవర్ సైజ్డ్, గ్రాడ్యుయేట్, వింటేజ్ టైప్‌లకు ఇది పెట్టింది పేరు. యూవీ ప్రొటెక్షన్ వల్ల స్కిన్ క్యాన్సర్, ముడుతలు రాకుండా ఉండేలా వీటి ఫ్రేములు తయారు చేశారు. వైబ్రెంట్ కలర్స్‌తో కుర్రకారును ఇవి పిచ్చెక్కిస్తాయి. పైగా తక్కువ ధర కావడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. కేవలం 500రూపాయల నుంచి 2500 రూపాయల మధ్యలోనే ఈ బ్రాండ్ కళ్లద్దాలను సొంతం చేసుకోవచ్చు.

sunglasses8

ప్రాడా

సెలెబ్రిటీ స్టయిల్‌ని ఫాలో కావాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ బ్రాండ్ మీ లిస్ట్‌లో చేర్చుకోవాల్సిందే! కాస్ట్‌లీ.. లగ్జరీ బ్రాండ్‌గా దీనికి పేరు. ప్రతీ సంవత్సరం యూనిక్ కలెక్షన్‌ని విడుదల చేస్తాయి. 99 నుంచి 100శాతం మేర యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి ఈ చలువ కళ్లద్దాలు కంటికి రక్షణనిస్తాయనడంలో సందేహం లేదు. ఆ లోగోనే మీ క్లాసీ లుక్‌ని తెలియచేస్తుంది. రూ.8వేల నుంచి 70వేల రూపాయల వరకు ఈ కళ్లద్దాల రేంజ్ ఉంటుంది. అవియేటర్, రెక్ట్యాంగులర్, ఓవర్ సైజ్డ్, ఓవల్, గ్రేడియంట్, స్కేర్, రౌండ్, క్యాట్ ఐ చలువ కళ్లద్దాలు ఇందులోని ప్రత్యేకమైనవి.

sunglasses9

ఫారెన్‌హీట్

ఎండకాలం ఆ హీట్‌ని తట్టుకోవాలంటే ఈ చలువ కళ్లద్దాలు పెట్టుకోవాల్సిందే! యూవీ కిరణాల నుంచి ఈ కళ్లద్దాలు రక్షించడమే కాదు.. కళ్లకు చల్లదనాన్ని కలిగించేలా ఉంటాయి. హై క్వాలిటీ లెన్స్‌లతో వచ్చే వీటిని 500 రూపాయల నుంచి 5వేల రూపాయల వరకు కొనవచ్చు. పిల్లలకు ఇందులో కలెక్షన్ లేకపోవడం కాస్త బాధాకరమే! స్పోర్ట్స్, స్పెక్టెబుల్, అవియేటర్, ఓవర్‌సైజ్డ్, వేఫేరర్, ఓవల్, రౌండ్, క్యాట్ ఐ, రెక్ట్యాంగులర్, రాప్ చలువ కళ్లద్దాలు ఇందులో ప్రత్యేకంగా లభిస్తాయి.

- సౌమ్య పలుస

221
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles