నెట్టిల్లు


Sun,March 10, 2019 02:00 AM

రౌడీ బేబీ అంటూ సాయిపల్లవి చేసిన డ్యాన్సుకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ వారం విడుదలైన షార్ట్‌ఫిలింస్‌లో కూడా ఓ అమ్మాయి రౌడీ బేబీ అంటూ డ్యాన్స్ చేసి ఇరగదీసింది. ఆ షార్ట్‌ఫిలింస్‌తో పాటు ఈ వారం విడుదలైన ఇంకొన్ని షార్ట్‌ఫిలింస్ ఈ వారం నెట్టిల్లులో..



గాయిదోడు2

Total views 87,692+ (మార్చి 2 నాటికి)
Published on Mar 1, 2019
దర్శకత్వం: ఆర్‌ఎస్ నంద
నటీనటులు : రాము మొగిలోజి, శ్రీనివాస్ ముత్యం, బ్రహ్మం ముమ్మడి, ఫణీంద్ర, గ్రాఫిక్స్ శ్రీను, అశోక్
గతవారం గాయిదోడు కథకు కొనసాగింపు పార్ట్ ఇది. రెండు భాగాలుగా తీసిన ఈ షార్ట్‌ఫిలిం కడుపుబ్బ నవ్వించడానికి తీసిందే. పనీపాట లేకుండ తిరిగే శీను చెల్కల కడుకొని కల కంటుంటాడు. ఆ కలలో ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు. కలలలోకంలో విహరిస్తున్న శీనును వాళ్లమ్మ నిద్రలోంచి లేపుతుంది. ఆ తర్వాత శీను ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్తాడు. తన ప్రేమకథ, ఫీలింగ్స్ అన్నీ ఫ్రెండ్స్‌తో పంచుకుంటాడు. ఆ అమ్మాయినే పెండ్లి చేసుకుంటున్నట్టు ఫ్రెండ్స్‌కి చెప్తాడు. మరోవైపు నిద్రలో కలలు కంటూ కలవరిస్తున్న శీనును చూసి తల్లిదండ్రులు గాభరా పడుతుంటారు. ఇంతలో శీను ఇంటి ముందు మంచం మీద పడుకొని కల కంటూ కలవరిస్తుంటాడు. అప్పుడే వాళ్ల నాన్న చెల్కల నుంచి ఇంటికొస్తాడు. తండ్రి శీనును కోప్పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. కడుపుబ్బ నవ్వించే ఈ షార్ట్‌ఫిలిం చూడండి.



ఇదేం ప్రేమే

Total views 21,576+ (మార్చి 2 నాటికి)
Published on Feb 28, 2019
దర్శకత్వం: సోమేష్ ముఠా
నటీనటులు: కేవీఎం పృథ్వీ, తనూజ మధురపంతుల, విశేఖ
ఏడాదిగా ఒకమ్మాయిని ఓ కుర్రాడు నిజాయితీగా ప్రేమిస్తుంటాడు. ఇంతలోనే ఇంకో కుర్రాడు అదే అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. మొదటి కుర్రాడు కూడా తను ఇష్టపడే అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు రెండో కుర్రాడు కొంతమంది ఫ్రెండ్స్‌తో వచ్చి బెదిరిద్దామని చూస్తాడు. ఇంతలోనే ఆ కుర్రాడి ఫ్రెండ్ వచ్చి గొడవను అడ్డుకుంటాడు. ఆ తర్వాత నిజాయితీగా ప్రేమిస్తున్న కుర్రాడు మొక్కలు కొనడానికి ఓ నర్సరీకి వెళ్తాడు. అక్కడ మొక్కలు చూస్తుండగా ఓ అందమైన అమ్మాయి వచ్చి ఆ కుర్రాడికి ఐలవ్యూ చెప్తుంది. ఆ తర్వాత ఫీల్‌గుడ్ మ్యూజిక్‌తో ఓ పాట. అక్కడే ఫ్రెండ్స్ వచ్చి నీకో అమ్మాయి ఐలవ్యూ చెప్పింది. పార్టీ ఇవ్వరా అంటారు. ఆ తర్వాత అందరూ కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తారు. నర్సరీలో ఐలవ్యూ చెప్పిన అమ్మాయి కాలేజీలో ఎదురుపడుతుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి హాయ్ చెప్తాడు ఆ కుర్రాడు. ఆ అమ్మాయేమో నువ్వెవరో నాకు తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తుంది. అసలేం జరిగింది? నిన్న ఐలవ్యూ చెప్పి.. ఈరోజు అలా ఎందుకు ప్రవర్తించింది? అసలు ఆ కుర్రాడు ఏడాదిగా ప్రేమిస్తున్న అమ్మాయి, ఈ అమ్మాయి ఒకటేనా? తెలియాలంటే యూట్యూబ్‌లో చూడండి.



మజిలీ

Total views 11,377+ (మార్చి 2 నాటికి)
Published on Feb 28, 2019
దర్శకత్వం: రాఘవశెట్టి, వెన్నెల
నటినటులు : రాఘవశెట్టి, వెన్నెల,
ఏడెనిమిది మంది కుర్రాళ్లు రోడ్డు పక్కన ఖాళీగా కూర్చొని సొల్లు కబుర్లు పెట్టుకుంటూ ఉంటారు. అటుగా వెళ్తున్న ఓ పెద్దమనిషి ఆ కుర్రాళ్లను తిడుతాడు. మీ తప్పు కాదురా.. మిమ్మల్ని కాదురా.. అనాల్సింది. మీ తల్లిదండ్రుల్ని అని కోప్పడుతాడు. ఆ గ్యాంగులో ఓ కుర్రాడు లేచి సార్.. మేం చేసే పనులకు మా తల్లిదండ్రులను ఎందుకు సార్ తిడుతారు. ఏం చేయాన్న క్లారిటీ లేక మేం ఇలా ఖాళీగా ఉన్నాం. క్లారిటీ వచ్చినరోజు మేమే హీరోలం అంటూ బదులిస్తాడు. ఆ తర్వాత ఓ ఫైట్‌సీన్. ఫైట్ చేయకుండానే ఆ కుర్రాడు ఫ్రెండ్‌ని విడిపించుకొస్తాడు. అంతలోనే ఆ కుర్రాడు ప్రేమించే అమ్మాయి ఎదురుపడుతుంది. ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి వాళ్ల నాన్న ఆ కుర్రాడి తండ్రి ఫోన్ నంబర్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కుర్రాడికి ఆ అమ్మాయి తండ్రి వార్నింగ్ ఇచ్చాడా? లేక వాళ్ల నాన్నకు ఫోన్ చేసి ఆ కుర్రాడి గురించి ఫిర్యాదు చేశాడా? కథ మజిలీ కాస్త కన్‌ఫ్యూజ్ చేసింది. చెప్పాలనుకున్న పాయింట్‌ను నేరుగా చెప్పడంలో దర్శకుడు సఫలం కాలేదు.



నేను.. తను

Total views 7,947+ (మార్చి 2 నాటికి)
Published on Feb 24, 2019
దర్శకత్వం: దేవ పొన్నకంటి
నటీనటులు: నవీన్ మానియా, భానుప్రియ
ముక్కుసూటిగా ఉండే ఓ కుర్రాడు చేజింగ్‌లో ఉండగా ఓ అమ్మాయి స్కూటీకి గుద్దుకుంటాడు. ఆ అమ్మాయి ఆ కుర్రాడిని ఎడాపెడా తిట్టేస్తుంది. ఇంతలో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి మరో కుర్రాడు వస్తాడు. ఆ అమ్మాయి స్కూటీకి గుద్దుకున్న కుర్రాడు అతడి చేతిలో గులాబీ తీసుకొని ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. త్రివిక్రమ్ సినిమాల్లోలా ఓ డైలాగ్ చెప్తాడు. ఆ తర్వాత రోజు ఆ అమ్మాయి ఓ రెస్టారెంట్‌కి వెళ్తుంది. ఆ కుర్రాడు కూడా రెస్టారెంట్‌కి వెళ్తాడు. ఆ అమ్మాయితో పరిచయం చేసుకొని, తన ప్రేమను గెలిపించుకోవాలని తపన పడుతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కుర్రాడు ఏం చేశాడు? షార్ట్‌ఫిలిం ఓపెనింగ్‌లో ఆ కుర్రాడు బీర్‌బాటిల్‌తో తను ప్రేమించిన అమ్మాయిని శని అని ఎందుకు అన్నాడు. తెలియాలంటే యూట్యూబ్‌లో చూడండి.

ప్రవీణ్‌కుమార్ సుంకరి
సెల్: 9701557412

171
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles