రాశి ఫలాలు


Sun,March 10, 2019 01:35 AM

10-3-2019 నుంచి 16-3-2019 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా స్వయంవృత్తిలో, ఉద్యోగంలో ఉన్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ అలసట, అశ్రద్ధ చోటు చేసుకుంటుంది. ప్రయాణాలు కలిసిరాకపోవచ్చు. ఆర్థిక సమస్యలు, వ్యవసాయదారులకు పనివారితో ఇబ్బందులుంటాయి. వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఉపాధ్యాయ, న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారికి తోటి వారితో కలహ సూచనలున్నాయి.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారం అనుకూలిస్తుంది. రోజువారీ క్రయ విక్రయాల్లో లాభాలు ఉంటాయి. పెట్టుబడులు కలిసివస్తాయి. షేర్ వ్యాపారం, వడ్డీ వ్యాపారం, నిత్యావసర వస్తు వ్యాపారాలలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నలుగురిలో మంచి పేరు పొందుతారు. శ్రద్ధతో పనులు చేయడం వల్ల చేపట్టిన కార్యాల్లో సంపూర్ణ విజయం లభించే అవకాశాలు బాగా ఉన్నాయి.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాల్లో లాభాలుంటాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. ఇంజినీరింగ్, వైద్య, న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారు న్యాయపరమైన సమస్యల నుంచి విముక్తులవుతారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయ దారులకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రయాణాలలో ఇబ్బందులుంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలుంటాయి. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ వ్యాపారం, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నదీస్నానాలను ఆచరిస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. మాసికంగా ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. న్యాయ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. హోటలు, క్యాటరింగ్ బిజినెస్‌లో ఉన్న వారికి కొత్త పనులు వచ్చినట్లుగానే వచ్చి చేజారి పోతాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలుంటాయి. శుభకార్య ప్రయత్నాలలో ఇబ్బందులు ఉంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోవడంతో ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

కన్య

ఈ రాశి వారికి ఈ వారంలో ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులలో నిమగ్నమై చేయడం వల్ల సత్ఫలితాలను పొందుతారు. అలసట, అశ్రద్ధ దూరమవుతాయి. అనారోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. కొత్త వస్తువులు, వస్త్రాలు కొంటారు. హోటలు, క్యాటరింగ్ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. రాజకీయంలో ఉన్న వారికి పనులు నెరవేరుతాయి. ఆఫీసులో మంచి పేరు సంపాదిస్తారు. తల్లిదండ్రుల అండదండలు అందుతాయి. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఉంటాయి.

తుల

ఈ రాశి వారు ఈ వారంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఉన్నత విద్య కొనసాగుతుంది. ఆర్థికసమస్యల నుండి విముక్తులవుతారు. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. నిత్యవసర, వడ్డీ, షేరు, హోటలు, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యాపారాలు లాభిస్తాయి. భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. న్యాయవాద, ఉపాధ్యాయ, ఇంజినీరింగ్, వైద్య వృత్తులలో ఉన్న వారు సంతృప్తిగా ఉంటారు.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలతో కాలయాపన చేస్తారు. హోటలు, క్యాటరింగ్ బిజినెస్ కొంత వరకు కలిసి వస్తాయి. పెద్దల సూచనలను పాటిస్తారు. వ్యాపారంలో రోజువారీ క్రయ విక్రయాల్లో ఇబ్బందులుంటాయి. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ వ్యాపారాలలో పనివారితో ఇబ్బందులు ఉంటాయి. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆస్తుల విషయంలో తగాదాలు ఏర్పడవచ్చు. వాహనాల వల్ల ఊహించని ఖర్చులు ఉంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారు భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. విందులకు, వినోదాలకు హాజరవుతారు. హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. పనుల్లో చురుకుదనం అవసరం. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. న్యాయవాద, వైద్యవృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. ఇంజినీరింగ్, ఇండస్ట్రీలో ఉన్న వారికి పనులు నెరవేరుతాయి. దీర్ఘకాలిక పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి. ప్రయాణాలు అనుకూలించక పోవచ్చు.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి శుభకార్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. మంచి పేరు పొందుతారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. కొత్త వస్తువులు కొంటారు. హోటలు, క్యాటరింగ్ బిజినెస్‌లు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. తోటి ఉద్యోగులతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు చేయల్సి వస్తుంది. కొన్ని వృథా ఖర్చులుంటాయి. వ్యాపారంలో పనివారితో ఇబ్బందులు ఉంటాయి. అనాలోచిత పెట్టుబడులు పెట్టొద్దు.

కుంభం

రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది. అన్నదమ్ములు, బంధువులతో సమన్వయం కుదురుతుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రారంభించిన పనుల్లో పురోభివృద్ధి కనబడుతుంది. సభలకు, విందులకు హాజరవుతారు. ఉద్యోగంలో తోటివారితో, పైఅధికారులతో , కింది స్థాయి వారితో ఇబ్బందులు ఉంటాయి.

మీనం

ఈ రాశి వారికి ఈ వారంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. ఆరోగ్య సమస్యల నుండి విముక్తులు అవుతారు. మంచి ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. హోటలు, క్యాటరింగు, వస్త్ర వ్యాపారాలు కలిసి వైద్య, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. నిత్యావసర, షేర్, వడ్డీ వ్యాపారం, రోజువారీ క్రయ విక్రయాలలో ఇబ్బందులు ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

603
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles