అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి భారతీయ అమెరికన్ కమల హ్యారీస్


Sun,March 3, 2019 03:13 AM

భారతీయ మూలాలున్న తొలి సెనెటర్ కమల హ్యారీస్. ఆమె ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. ఆమె ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ క్యాలిఫోర్నియా సెనెటర్‌గా ఉన్నారు. మాజీ అటార్నీ జనరల్ కూడా. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దక్కి తే, ఒక ప్రధాన పార్టీ తరఫున పోటీపడే తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ, తొలి భారతీయ అమెరికన్ మహిళ కమలనే అవుతారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికా తొలి మహిళ అధ్యక్షురాలు ఆమే అవుతారు.
Kamala-Harris
కమల తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ చెన్నైకి చెందిన వారు.1960లో ఆమె ఇండో అమెరికా క్రోనాలజీ చదివేందుకు అమెరికాకు వెళ్లారు. బెర్కిలా యూనివర్సిటీలో రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి పరిశోదన కూడా చేశారు. అక్కడే శ్యామల జెమైకాకు చెందిన డొనాల్ హారీస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో మొదటి నల్లజాతికి చెందిన ఎకనామిక్స్ ప్రొఫెసర్. వారికి క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్‌లో కమల జన్మించారు. ఆమె కు ఐదేళ్ల వయస్సులోనే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఫర్ ద పీపుల్..

కమలా హ్యారిస్ ఫర్ ద పీపుల్ అనే నినాదంతో బరిలోకి దిగుతున్నారు. మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, ఇమ్మిగ్రేషన్ పాలసీ, హెల్త్‌కేర్ సిస్టమ్, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె ప్రముఖంగా చర్చించనున్నారు. మన భవిష్యత్తును నిర్మించుకుందాం. మన కోసం, మన పిల్లలకోసం, మనదేశం కోసం అంటూ క్యాంపెయిన్ వీడియోను విడుదల చేశారు. కమలా హ్యారిస్ ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీలో కీలక నేత. డెమొక్రటిక్ పార్టీ తరఫున తులసీ గబ్బార్డ్ కూడా అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్టు ఇప్పటికే ప్రకటించా రు. మొత్తం 12 మంది అభ్యర్థులు డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతారని అంచనా. హ్యారిస్ 11 మందిని దాటితే అధ్యక్ష బరిలో దిగుతారు.

ప్రచారంలో దూసుకెళ్తూ...

ఇప్పటికే కమలా వాషింగ్టన్‌లోని ఒక ఆఫ్రికన్-అమెరికన్ విశ్వవిద్యాలయంలో తన తొలి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె 2016లో సెనెట్‌కు ఎన్నికయ్యారు. అంతకుముందు 2011 నుంచి 2017 వర కు ఆమె క్యాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా వున్నారు. గతేడాది మేరీలాండ్ గవర్నర్‌గా పోటీ చేసి ఓడిపోయిన బెన్ జెలసును కమ లా హారిస్ బలపరిచారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ప్రకటన చేయడానికి కమల మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే (ఎంఎల్‌కే డే)ను ఎంచుకున్నారు. అమెరికాలో జాతివివక్షపై ఉద్యమించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గౌరవార్థం ఏటా జనవరిలో మూడో సోమవారం ఎంఎల్‌కే డేను జరుపుకుంటారు. ఆయన ఆశయమే తనకు స్ఫూర్తినిస్తుందని, ఈ రోజు అమెరికన్లు అందరికీ చాలా ప్రత్యేకమైందని, ఈ రోజు ఈ ప్రకటన చేస్తుండటం తనకు గర్వంగా ఉందని కమల వ్యాఖ్యానించారు. మన అమెరికా విలువల పరిరక్షణ కోసం గళం విప్పే మీరు, మీ లాంటి కోట్ల మంది ప్రజలపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే అమెరికా అధ్యక్ష స్థానానికి నేను పోటీచేస్తున్నా అని కమల ట్విటర్ వీడియోలో చెప్పారు.

ట్రంప్‌పై విమర్శలు

ట్రంప్ వలస విధానాలను, ఇష్టానుసారంగా పదవుల్లో నియామకాల తీరును ఎండగడుతూ ఆమె తనకంటూ ఓ ప్రత్యేకతను చా టుకున్నారు. ప్రస్తుతం కమల పౌరహక్కుల కోసం పోరాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీలో కీలకనేతగా ఎదిగారు. డొనాల్డ్ ట్రం ప్ పాలనలో వలసపౌరుల హక్కులు పరిరక్షించే వ్యక్తిగా కమలా హ్యారిస్ గుర్తింపు పొం దారు. అమెరికా సరిహద్దుల్లో జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయడాన్ని మానవత్వంపై దాడి అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యకలాపాల పాక్షి క ప్రతిష్టంభన(షట్‌డౌన్)ను పరిష్కరించకుండా అమెరికన్లను అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తున్నారని ఆమె విమర్శించారు. 20 16 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై, విచారణ అంశాలపై అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్ బ్రెట్ కావనా అభిప్రాయాలపై ఆయన్ను కమల బలంగా ప్రశ్నించారు. ఇది డెమొక్రాట్ల దృష్టిని ఆకర్షించింది.

మహిళా ఒబామా

తొలి ఆఫ్రికన్-అమెరికన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కమలను మహిళా ఒబామాగా అభివర్ణించేవారు. 2016 సెనేట్ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికల్లో కమల ఒబామాకు మద్దతు పలికారు. ఆమెను ఒబామాకు సన్నిహితురాలిగా చెబుతారు. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నట్లు ఇప్పటికే ఏడుగురు నేతలు ప్రకటించారు. ఈ పోటీలోకి వచ్చిన ఎనిమిదో నేత కమల. పోటీదారుల్లో ఎలిజబెత్ వారెన్, కిర్బెటన్ గిలిబ్రాండ్, తులసి గబార్డ్, జాన్ డెలనీ, జూలియన్ క్యాస్ట్రో తదితరులు ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఒకరి కన్నా ఎక్కువ మంది మహిళలు పోటీపడుతుండటం ఇదే తొలిసారి.

వివర్శలూ ఎదుర్కొని..

తన సహాయకుల్లో ఒకరిపై వచ్చిన లైం గిక ఆరోపణల గురించి తనకు తెలియదని చెప్పి కమల తీవ్ర విమర్శలు ఎదు ర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2016 లో
రాజీనామా చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ట్రంపును హ్యారిస్ సులువుగా ఓడిస్తారని
ఓ సర్వేలో తేలడం విశేషం.
-మధుకర్ వైద్యుల, సెల్: 91827 77409

995
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles