పాలోకోయిలో ఫ్యాన్..


Sun,March 3, 2019 03:05 AM

తన నటనతో జాతీయ అవార్డు గెలుచుకోవడమే కాదు.. సామాజిక సేవా కార్యక్రమాలతో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నది. విభిన్న పాత్రల్లో వైవిధ్యమైన నటనతో ఆకట్టుకుంటున్నది విద్యాబాలన్. ఆమె గురించి మనకు తెలియని ముచ్చట్లు ఈ వారం మరోకోణంలో..

vidya-balan1
విద్యాబాలన్ నిక్‌నేమ్ విది. చాలా దగ్గరివాళ్లు మాత్రమే ఆమెను అలా పిలుస్తారు. ముంబైలోని చెంబూర్‌లో పుట్టింది. హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపించే విద్యాబాలన్ కేరళలో తమిళ కుటుంబంలో పుట్టింది. పదహారేండ్ల వయసులోనే ఏక్తా కపూర్‌తో కలిసి హమ్ పాంచ్ అనే షోలో రాధికగా నటించింది. చార్లీ చాప్లిన్ పాత్రలో నటించిన విద్యాబాలన్ ఆయనను మరిపించేలా ఆ పాత్రలో లీనమైపోయింది. మిస్టర్ ఇండియాలో శ్రీదేవి చార్లీ చాప్లిన్‌లా నటించడం చూసి విద్య కూడా చార్లీ చాప్లిన్ పాత్ర చేసింది. విద్యా బాలన్‌కు పుస్తకాలు చదవడం మీద ఆసక్తి ఎక్కువ. పాలో కోయిలో పుస్తకాలంటే విద్యకు చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే మనసుకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుందట. ముంబై యూనివర్సిటీలో సోషియాలజీలో మాస్టర్స్ చేసింది. పీజీ చేస్తున్నప్పుడే మోహన్‌లాల్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుసగా 12 సినిమాల మీద సంతకం చేసింది.

జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న విద్యా గుణంలో కూడ ఉత్తమురాలే. తన చుట్టూ ఉన్నవారితో మర్యాదగా, ప్రేమగా ప్రవర్తిస్తుంది. కొత్తవాైళ్లెనా సరే వారితో క్షణాల్లో కలగలిసిపోయే గుణం విద్యాబాలన్‌ది. పశ్చిమ బెంగాల్ అంటే చాలా ఇష్టం. బెంగాలీ భాష స్పష్టంగా మాట్లాడగలదు. విద్య శుభ్రతకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. తన చుట్టూ ఎక్కడ దుమ్ము, ధూళి, చెత్త కనిపించినా ఉపేక్షించదు. ఆడంబరాలకు, సంబరాలకు డబ్బులు ఖర్చుపెట్టడానికి అస్సలు ఆసక్తి చూపదు. ఆ డబ్బులు ఎవరైనా పేదవారికి సాయం చేస్తే వారికి దేనికైనా ఉపయోగపడుతాయి కదా అంటుంది. సినిమాల్లో అవకాశం కోసం విద్యాబాలన్‌ని 40 సార్లు స్క్రీన్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. విద్యాబాలన్ చిన్నప్పటి నుంచి హార్మోన్ల సమస్యతో బాధపడుతున్నది. అందుకే ఆమె శరీర బరువు నిత్యం మారుతూ ఉంటుంది. విద్యాబాలన్‌కి స్మోకింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. దేవుళ్లను బాగా నమ్ముతుంది.

vidya-balan
కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కథక్‌లలో విద్యా బాలన్ శిక్షణ పొందింది. విద్య త్వరలో ఇందిరాగాంధీ అవతారంలో మనకు తెర మీద దర్శనమియ్యనున్నది. ఎట్టి పరిస్థితుల్లో విద్య రోజుకు పది లీటర్ల మంచినీళ్లు తాగుతుందట. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటుంది. తొలిరోజుల్లో విద్యాబాలన్‌ను ఏ దర్శకుడు తీసుకోలేదు. కనీసం ఆదరించలేదు కూడా. ఆ తర్వాత ఇప్పటి వరకు విద్య 90 యాడ్‌ఫిల్మ్స్‌లో నటించింది. స్కూల్లో చదివే రోజుల్లో విద్యాబాలన్ తనను ఇష్టపడే కుర్రాళ్ల మీద ఓ కన్నేసి ఉంచేది. ప్రియమణి విద్యాబాలన్ రెండో కజిన్. ఈమె నటించిన కళారి విక్రమన్ అనే సినిమా ఇప్పటికీ విడుదల కాలదు. 2003లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా నిలిచిపోయింది. సినిమాల్లో ప్రవేశం ప్రశ్నార్థకమైపోయిన సందర్భంలో విద్యా 60 వీడియోల్లో నటించింది. మహిళా సాధికారత కోసం విద్య ఓ షార్ట్ వీడియోలో నటించడానికి ఆడిషన్స్ ఇచ్చింది. తన పుట్టినరోజును విద్యాబాలన్ ప్రత్యేకంగా ఆస్వాదిస్తుంది. ఇప్పటి వరకు విద్యాబాలన్ యాభైకి పైగా అవార్డులు గెలుచుకుంది. తన నటనతో జాతీయ ఉత్తమ నటి, పద్మశ్రీ గౌరవాలు అందుకున్నది ఈ అందాల తార. విద్యాబాలన్ ఇంగ్లీష్, తమిళం, మలయాళం, బెంగాళీ, హిందీ భాషలు స్పష్టంగా మాట్లాడగలదు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. బాలికా విద్య, లైంగిక హింస, మహిళలపై దాడులు వంటి అంశాల మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
-ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

1088
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles