అందానికి 4 చుక్కలు..


Sun,March 3, 2019 03:00 AM

కేవలం నాలుగంటే నాలుగే చుక్కలు. ముఖానికి రాస్తే చాలు.. కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇది నిజమేనండోయ్. నాలుగు చుక్కలతో ముఖంపై మచ్చలన్నీ మటుమాయం అంటున్నారు దీనిని వాడిన సెలబ్రెటీలు. యూరప్ దేశాల్లో ఈ ఫేసియల్ సీరమ్‌పై మామూలుగా సాగడం లేదు ప్రచారం. పైగా దీనిని వాడిన సెలబ్రిటీలు 100 శాతం పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చేస్తున్నారు. దీంతో ఈ సీరమ్ ధర కొండెక్కి కూర్చుంది. షాపుల్లో, ఆన్‌లైన్‌లో పెట్టిన కొద్ది నిమిషాలకే హాట్‌కేక్‌లా అమ్ముడుపోతున్నది కూడా. దీన్నిబట్టి జనంలో ఎంత క్రేజ్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. స్పెయిన్ కంపెనీ సెస్ డెర్మా.. అజెలిక్ రూ లిపోజమాల్ సీరమ్ పేరుతో దీన్ని విక్రయిస్తుంది. బ్రిటన్‌లో దీన్ని ప్రారంభించగా.. ఒకరోజులోనే స్టాకంతా అమ్ముడుపోయింది. అర నిమిషానికి ఒకటి చొప్పున అమ్మేశారు. 30 మిల్లీలీటర్ల ధర దాదాపు రూ. 3800. దీనికోసం బ్రిటన్‌లో ఇప్పటికి 6 వేల మందికిపైగా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఈ సీరమ్‌ను ట్రెనెక్సామిక్ యాసిడ్ టీఆర్‌ఎక్స్ బూస్టర్ సిస్టమ్‌తో తయారు చేశారు.
ఇది నచ్చమచ్చలను పోగొట్టి, ముఖాన్ని కాంతిమంతం చేస్తోందని సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. దీంతో జనం ఎగబడుతున్నారు.

4-drops

లక్ష రూపాయల పుంజు!


Kodipunju
ఒక కోడు గుడ్డు ధర అక్షరాల వెయ్యి రూపాయలు. కోడిపుంజు ధర లక్షా 25 వేలు. పర్లజాతికి చెందిన కోడిపుంజులు మన దగ్గర ఇంత రేటు పలుకుతున్నాయి మరి. దేశ విదేశాల్లో వీటికి బాగా డిమాండ్ ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభంకు చెందిన కృష్ణమాచారి ఈ కోళ్లను పెంచుతున్నాడు. ఇవి తమిళనాడులోని పర్లజాతి కోడికి.. మనదగ్గర దొరికే కాకిడేగ పుంజుకు పుట్టినవి. వీటి ఈకలు నెమలిలా పొడవుగా ఉంటాయి. బలమైన ఈ కోడిపుంజులను పందేలకు కూడా ఉపయోగిస్తున్నారు. అందంగా, ఠీవీగా, బలంగా ఉండడమే వీటి ప్రత్యేకత. ఈ జాతి కోళ్ల ధర మార్కెట్‌లో రూ.40 వేల నుంచి రూ.లక్షా 25 వేల వరకు పలుకుతుంది. అందమైన పర్లజాతి కోళ్లను పెంచుకోవడం ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అందుకే వీటికి ఇంత డిమాండ్.

3వేల యేండ్ల వయసు!


Yarata-Plant
ఈ మొక్క వయసు 3వేల సంవత్సరాలు. దీని పేరు యరేటా. అపియేషియా కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆండీస్, బొలీవియా, చిలీ, అర్జెంటీనా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. పచ్చగడ్డిలా కనిపించే ఈ యరేటా మొక్క నాచు రకం. ఇది ఏడాదికి ఒకటిన్నర సెం.మీ మాత్రమే పెరుగుతుంది. ఒక మొక్క అంత కాలం నుంచి బతికి ఉందంటే నమ్మశక్యంగా లేదు కదా. అందుకే పర్యావరణ వేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ మొక్కలు ఉండే ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుది. అంత వేడిలోనూ ఇదిబతికేస్తుంది.

మద్యంతో డీఎన్‌ఏకి ఎఫెక్ట్


Driking
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినా మనవాళ్లు విడనం లేదు. అతిగా తాగడం వల్ల డీఎన్‌ఏకు నష్టం జరగడమే కాకుండా.. మెదడు పనితీరు దెబ్బతింటుంది. దాని వల్ల ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు, మత్తులో జోగేందుకు మళ్లీ మద్యం తాగుతారు. దీని వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని అమెరికాలోని రట్గర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతిగా, అదే పనిగా మద్యం తాగే వ్యక్తులపై నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆల్కహాల్ కారణంగా జన్యువులు ప్రభావితమవుతాయి. జీవక్రియ దెబ్బతింటుంది. ఒత్తిడిలో శరీర పనితీరు నియంత్రణ కోల్పోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

జిహ్వకో రుచి..


Soap-Eating
ఒంటికి రాసుకునే సబ్బులను రుచి చూడడం, చాలా టేస్టీగా ఉంటే ఆరగించడం ఈమె పని. అంతేకాదండోయ్.. రుచికరమైన సబ్బులకు రేటింగ్ కూడా ఇస్తుంటుంది. సబ్బులు శరీరాన్ని, పాత్రల్ని, బట్టల్ని శుభ్రపరచుకోవడానికి వాడితే.. ఇండోనేసియాలోని తూర్పు జావాకు చెందిన అసీఫా రుచి చూడ్డానికి ఉపయోగిస్తుంది. రెండేళ్ల కిందట ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనే కోరిక పుట్టిందట. వెంటనే అందుబాటులో ఉన్న సబ్బును తిన్నది. ఇక అప్పటి నుంచి సబ్బులు రుచిచూడడం మొదలెట్టింది. రుచి చూడడమంటే ఏదో నాలుక చివర అంటించుకోవడం కాదు. చక్కగా ఐస్‌క్రీం మాదిరి రుచి చూసి మరీ రేటింగ్ ఇస్తున్నది. ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేస్తున్నది. దీంతో అసీఫాకు ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లు పెరిగిపోయారు.
-డప్పు రవి

1071
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles