కష్టాలను గట్టెక్కించే గట్టు మల్లన్నదొణలో దేవుడు.. వేలాల మల్లికార్జునుడు


Sun,March 3, 2019 02:15 AM

భూమికి పచ్చని చీర చుట్టినట్లు పొలాలు.. సరిగమలు పలుకుతున్నట్లు గోదారమ్మ గలగలలు.. సమీపంలోనే ఎత్తయిన గుట్ట.. గుట్ట చివరన దొణ.. అందులో శివలింగం.. అభిషేక ప్రియుడి చెంతనే నీటి చెలిమె.. చెలిమె నీళ్లే భక్తులకు తీర్థం.. పట్నాలేసే ఒగ్గు పూజారుల కోలాహలం.. కమనీయం మల్లిఖార్జునుడి కల్యాణం.. శివరాత్రికి ఊరంతా జాగరణం.. ఇసుకేస్తే రాలనంత జనం.. నమ్మిన భక్తులకు కొంగు బంగారం.. పదండి, ఈ శివరాత్రికి వేలాల జాతరకు వెళ్లొద్దాం..

Mallikarjunudu
ఎక్కడుంది?: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్నది.
ఎలా వెళ్లాలి?: రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రో డ్డు, రైలు మార్గంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. మంచిర్యాల నుంచి జైపూర్ మీదుగా వేలాలకు చేరుకోవచ్చు. లే దా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుంచి ఇందా రం మీదుగా వేలాలకు చేరుకోవచ్చు. ఏ మా ర్గం నుంచైనా వేలాలకు చేరుకోవాలంటే 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పా టు చేస్తున్నది. అదే విధంగా ప్రయివేటు వాహ నాలు కూడా జాతర సమయంలో అన్ని వేళలా అందుబాటులో ఉంటాయి.

స్థల పురాణం: సుమారు 200 ఏండ్ల క్రితం వేలాల గ్రామంలో నరహరి పోగుల పుల్లయ్య అనే పశువుల కాపరి ఉండేవాడు. అతడు ఎం తో సత్యవంతుడిగా పేరు పొందాడు. అతడు రోజూ పశువులను మేపడానికి గ్రామ సమీపంలోని గుట్టపైకి వెళ్లేవాడు. అక్కడ దొణలో నుంచి వచ్చే గట్టు మల్లన్నతో పు ల్లయ్య పాచికలు, కైలాసపటం ఆడేవాడు. ఆ సమయంలో అతడు తోలుకుని వచ్చిన పశువులు మాత్రం ఎక్కడికీ పోకుండా అక్కడే గుట్టపైన ఉండేవి. కాలక్రమంలో పుల్లయ్య మాయమైపోయాడు. పుల్లయ్య తన దగ్గరే భద్రంగా ఉన్నాడని గ్రామంలోని ఒక పెద్దమనిషికి కలలోకి వచ్చి గట్టు మల్లన్న చెప్పాడు. ఎవరు పిలిచినా పలుకుతామని చెప్పాడు.

అప్పటి నుంచి గ్రా మానికి చెందిన రైతులు తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా దొణవద్దకు వెళ్లి చెప్పుకునేవారు. అలా ఏ బాధలున్నా.. ఏ సమ స్య వచ్చినా దొణలోంచే గట్టుమల్లన్న స మాధానం చెప్పేవాడు. తమ పశువులు తప్పిపోతే ఎక్కడున్నాయో చెప్పేవాడు. అలా ప్రసిద్ధిగాంచిన దొణకు సమస్యలు చెప్పుకునేందుకు జనం పెరిగారు. ఆ త ర్వాత కొన్ని రోజులకు దొణ నుంచి సమాధానం రావడం మానేసిందనే కథ ప్రచారంలో ఉన్నది. అప్పటికే దొణలో ఒక చెలి మె ఉండేది. ఆ చెలిమె నీటిని గంగమ్మగా భావించిన భక్తు లు పక్కనే శివలింగాన్ని ప్రతిష్టించారు. గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయాన్ని నిర్మించారు. చెలిమె నీరు వేసవికాలంలోనూ ఎండిపోదు. శివరాత్రికి ఇక్కడ జాతర నిర్వహిస్తారు.
Mallikarjunudu1
శివలింగం చెంత నీటి చెలిమె: ఎండాకాలం.. వాన కాలం.. ఇలా కాలంతో సంబంధం లేకుండా గుట్టపై ఉన్న దొణలోని నీటి చెలిమెలో ఎల్లప్పుడూ నీళ్లుంటాయి. ఎండా కాలంలో గోదావరి ఎండిపోయినా ఇక్కడి గుట్టపై చెలిమెలో నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఈ ఊట చెలిమె నీటిని తీర్థంగా స్వీకరిస్తే వ్యాధులు తగ్గిపోతాయని భక్తులు నమ్ముతారు.

ఇసుకేస్తే రాలనంత జనం: యాదవుల ఆరాధ్య దైవమైన మల్లన్న దేవుడికి ఒగ్గు పూజారులు పూజలు చేస్తారు. వారి సం ప్రదా యం ప్రకారం పట్నాలు వేసి, బోనాలు పోస్తూ సనాతనంగా పూజలు నిర్వహిస్తారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ మూడు రోజులు పెద్ద ఎత్తున జాత ర జరుగుతుంది. సమీపంలోని గోదావరి నదిలో స్నానం ఆచరించి గుట్టపై దొణలోని శివలింగాన్ని దర్శించుకుంటారు. దొణలో ఉన్న చెలిమె నీటిని తీర్థంగా సేకరిస్తారు. అనంతరం గుట్ట కింద మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. జాతర సందర్భంగా దుకాణాలు, రంగుల రాట్నాలు వెలుస్తాయి. ఇతర రాష్ర్టాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు. ఒగ్గు పూజారులు పెద్ద పట్నం వేసి మల్లికార్జున స్వామికి కల్యా ణం, నాగవెల్లి జరిపిస్తారు.

ఎంతో ప్రసిద్ధి చెందింది

వేలాల మల్లన్న దర్శనం కోసం ఇతర రాష్ర్టాల నుంచికూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతీ ఏటా శివరాత్రికి జరిగే జాతరలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటుంటారు. ఇక్కడ ఒగ్గు పూజారులతో పట్నాలు వేస్తారు. మల్లన్నకు బోనాలు పోస్తుంటారు. గుట్టపై దొణలో చాలా ఏండ్ల క్రితం పశువుల కాపరి తపస్సు చేశాడని మా పూర్వీకులు చెప్పారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. ఇప్పటికీ ఆ దొణలోని ఊట చెలిమె ఎండిపోలేదు. అంత పెద్ద గుట్టపై నీళ్లు ఎలా ఊరుతాయి, చెలిమె ఎందుకు ఎండిపోదు అనేది ఇప్పటికీ నమ్మలేని నిజం.
- అప్పాల ప్రదీప్,
ఆలయ పూజారి, వేలాల

PRADEEP-APPALA

297
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles