ప్రేమ ఒక వేడుక.. నువ్వొక కానుక


Sun,March 3, 2019 01:23 AM

ప్రేమ నిత్యం జరిగే ఒక వేడుక.కొందరికే అందే కానుక.అర్థం కాని పదం.. ఎవరైనా వేసే పాదం. ప్రేమ రెండు అక్షరాలైనా, కలిపేది మాత్రం రెండు జీవితాలను.
నాకు తెలిసినంత వరకు టూ సైడ్ లవ్ కొందరికే దక్కుతుంది. కానీ వన్‌సైడ్ లవ్ ప్రతి అబ్బాయి లైఫ్‌లో లభిస్తుంది. నా లైఫ్‌లో కూడా వన్‌సైడ్ లవ్ ఉన్నది.

Love-heart
ఆక్షణం వరకు నా లైఫ్‌లో నా ఆశయమే గొప్పదనుకున్నా కానీ ఒక్క సెకన్ ఆశయం కన్నా గొప్ప దాన్ని చూపిస్తుందని అనుకోలేదు. అలాంటి ఆలోచన ఊహకు కూడా అందలేదు. ఎప్పటిలాగే కాలేజీకి పోవాలని బస్ కోసం ఎదురు చూస్తున్న.. ఎంత సేపయినా బస్సు రాకపోవడంతో చిరాకేస్తుంది. అంతలో వేరే బస్ రావడంతో ఎక్కాను. బస్ మొత్తం నిండి ఉంది. ఫుట్‌బోర్డు మీద నిల్చొని కండక్టర్ కోసం ఎదురు చూస్తున్న. అప్పుడే నా కండ్లు ఓ అద్భుతాన్ని చూశాయి. దట్టమైన పొగ మంచులో ఆమె ఓ దేవతలా కనిపించింది. తను నా కోసమే పుట్టినట్లు అనిపించింది. అంతవరకూ తెలియని ప్రేమకు తనను చూశాకే అర్థం తెలిసింది. తనతో మాట్లాడాలనీ, తన పేరు అడగాలనీ నా గుండె తన దగ్గరకు వెళ్లింది. ఎలా మాట్లాడాలి అనుకుంటుండగానే ఓ ఐడియా తట్టింది. తన ఫ్రెండ్ అనుకుంటాను పువ్వు చేతిలో పట్టుకొని వస్తుంది అప్పుడు తనతో నేను ఇలా అన్నాను. హలో నీకు ఒక్కటి చెప్పొచ్చా? అని తను చెప్పు అంది
పువ్వు ఎప్పుడు కోశావు అడిగాను. పొద్దున అని బదులిచ్చింది. ఎంతసేపు అలా చేతిలోనే పట్టుకుంటావు తలలో పెట్టుకోవచ్చు కదా పువ్వు నవ్వుతుందేమో చూద్దాం అన్నాను. అనగానే తను పెట్టుకోవాలా వద్దా అని ఆలోచించింది. దీన్ని అంతా గమనించి గమనించనట్టు చూస్తోంది నా ఊహల సుందరి.

బస్సుదిగి తన గురించి వివరాలు ఆరా తీశాను. కాలేజీ ప్రథమ సంవత్సరంలో చేరింది. విజయ తన పేరు. నా లైఫ్‌లో అప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించడం కన్నా తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. నా మనసులో మాటలను తనకు ఎలా చెప్పాలి అనుకుంటూనే రోజులు గడిపాను. ఓ రోజు తెలియకుండానే వాళ్ల క్లాస్‌లోకి వెళ్లి తన నోట్‌బుక్‌లో తనకు తెలియకుండా ఓ ప్రేమకవితను రాసి వచ్చాను. దానికి తను ఎలా స్పందిస్తుందో తెలియదు. తన కోసం ప్రేమికునిగా, కవిగా మారిపోయాను ఆ క్షణం. తన నోట్ బుక్‌లో రాసిన కవిత ఇది..

నువ్వు కనులు తెరిస్తే అదంతా వెలుగుమయం, నువ్వు కనులు మూస్తే అదంతా చీకటిమయం, నీ కనులు నా కనులుగా మారితే చదివేస్తాను ప్రేమ పుస్తకాన్ని...
నీ కనులు నా కనులుగా చేరితే చూస్తాను ఈ ప్రపంచాన్ని. ఆనందంగా ఉండే నీ కనులకు నా మనసులో అలాగే గుడికట్టాను, కలవడం లేని నీ కనురెప్పల సాక్షిగా, అలసట లేని నీ కళ్ళ సాక్షిగా.. నీ కనులకు కోరుకున్న నా మనసు సాక్షిగా... నా పెదాలతో చెపుతున్నా నీ మనసుకు ఐ లవ్ యూ... నాలుగు లైన్లతో నాప్రేమ సందేశాన్ని తనకు చేరవేశాను. కానీ ఏం అనుకుందో ఏమో స్పందించ లేదు. తర్వాత కొన్ని రోజులకు నేరుగా తనను కలిసి ప్రపోస్ చేశాను. ఆ హఠాత్పరిణామానికి ఆమె షాక్‌కు గురైనట్టుంది. ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయింది. మళ్లీ ఎప్పుడైనా తన ఒపీనియన్ చెప్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. నన్ను చూసి రోజూ నవ్వేది. ఓ రోజు ధైర్యం చేసి నంబర్ అడిగాను. ఇచ్చింది. కానీ ప్రేమ సంగతే పెండింగ్‌లో ఉంచింది. అయితేనేం రోజూ మాట్లాడేది. ఇలా మాట్లాడుతున్నప్పుడు సడన్‌గా నువ్వు నాకు నచ్చలేదు అనే అబద్ధం చెప్పాను.

కానీ ఆ అబద్ధం నా ప్రేమను దూరం చేస్తుందని అనుకోలేదు. తనను అందనంత దూరం తీసుకెళ్తుందని అనుకోలేదు. ఎందుకో తెలియదు ఇంక ఆమె తర్వాత రోజు నుంచి కనిపించలేదు. ఫోన్ అందుబాటులో లేదు. కాలేజీ మానేసింది ఎందుకో అర్థం కాలేదు. ఎందుకు అబద్ధం చెప్పానురా దేవుడా అనుకున్నాను. తన కోసం ఎదురుచూస్తున్న కొద్దీ ఏడాది గడిచిపోయింది. ఒక యుగంలా అనిపించింది. కానీ తన గురించి ఆలోచించటం మాత్రం మానలేదు. ఓ రోజు ఇంటికి వెళ్లడానికి అని ట్రెయిన్ ఎక్కాను. నేను అసలే ఊహించలేదు తను ఆ ట్రెయిన్‌లో ఉంటుందని. ఆ దేవుడు నా కోరికను వినిపించుకున్నాడని అనుకున్నా. కానీ, అంతలోనే మొట్టికాయలు వేస్తాడని అనుకోలేదు. తనను చూసిన ఆనందంలో తనతో మాట్లాడటానికి వెళ్దాం అనుకున్నా. కానీ, పక్కనే వాళ్ల అమ్మకూర్చుంది. ఆగిపోయాను. నేను దిగాల్సిన స్టాప్ దాటిపోయినా చాన్స్ దొరికితే తనతో మాట్లాడాలని ఎదురు చూస్తున్న. తన దిగాల్సిన స్టాప్ వచ్చింది. వాళ్ల అమ్మతో పాటే తనూ దిగింది. కానీ, ఎక్కడా ఆమె వాళ్ల అమ్మను విడిచి ఉండలేదు. నాకు మాట్లాడే అవకాశం రాలేదు. కానీ ట్రెయిన్‌లో మాత్రం కండ్లతో మాట్లాడాను. తనకు అర్థం అయితే బాగున్ను అనుకున్న. ట్రెయిన్ దిగి ఆమె వాళ్లమ్మతో వెళ్లిపోయింది. నేను మాత్రం మళ్లీ కనిపిస్తుందనే నమ్మకంతో వెనుదిరిగాను. ఈసారి కనిపిస్తే నా మనసులో మాటను భయం లేకుండా చెప్పుతాను. తన కోసమే ఎదురు చూస్తున్న నేను.
- కళ్యాణ్

కానీ ఆ అబద్ధం నా ప్రేమను దూరం చేస్తుందని అనుకోలేదు. తనను అందనంత దూరం తీసుకెళ్తుందని అనుకోలేదు. ఎందుకో తెలియదు ఇంక ఆమె తర్వాత రోజు నుంచి కనిపించలేదు. ఫోన్ అందుబాటులో లేదు. కాలేజీ మానేసింది ఎందుకో అర్థం కాలేదు.

ఓ రోజు తెలియకుండానే వాళ్ల క్లాస్‌లోకి వెళ్లి తన నోట్‌బుక్‌లో తనకు తెలియకుండా ఓ ప్రేమ కవితను రాసి వచ్చాను. దానికి తను ఎలా స్పందిస్తుందో తెలియదు. తన కోసం ప్రేమికునిగా,కవిగా మారిపోయాను ఆ క్షణం.
Love-heart1

తొలిప్రేమకు ఆహ్వానం!

ప్రేమ శాశ్వతం. ప్రేమ యథార్థం. ఈ ప్రపంచమంతా ప్రేమమయమైతే ఎంతో బాగుండనిపిస్తుంటుంది. అలాంటి ప్రేమలో తొలిప్రేమది మధురఘట్టం. ఒక రకంగా నిజమైన ప్రేమకు జ్ఞాపిక తొలిప్రేమ. కాలేజీ లైఫ్‌లో ప్రేమాభిమానాలను చూరగొన్న.. మీ లైఫ్‌లోకి తొంగిచూసిన.. తెరువని పేజీయై మీ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన, తడియారని తొలిప్రేమ గురించి రాసుకోవాలనుందా? మరొక్కసారి ఆ జ్ఞాపికను చూసుకోవాలనుందా? అక్షర రూపంలో అద్భుత కావ్యంగా మలుచుకునే అవకాశం మీకు మేం కల్పిస్తున్నాం. ఇదే మా ఆహ్వానం!
-ప్రేమ కథలు రాయాల్సిన చిరునామా: బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్.10,
బంజారాహిల్స్, హైదరాబాద్-500034. ఈ-మెయిల్ : sunmag@ntnews.com

421
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles