అందమైన బార్బీకి అరవై ఏండ్లు


Sun,March 3, 2019 01:12 AM

Barbie
చూడగానే మనస్సును ఆకట్టుకునే బొమ్మ బార్బీ. విల్లులాంటి కనుబొమ్మలు, చెక్కిన పెదాలు, లేలేత బుగ్గలతో పిల్లలందికీ ఇష్టమైన ప్రపంచ సుందరి. మిలమిల మెరిసే మిల్కీ స్కిన్‌తో, టపటపామని కన్నులు మిటకరిస్తూ చిన్నారుల చేతిలో వయ్యారాలు ఒలకబోసే కుందనపు బొమ్మ. ఈ బొమ్మ మార్చి 9న 60వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నది. అంటే బార్బీ ప్రపంచానికి పరిచయమై ఆరవై యేండ్లు ఆవుతుందన్నమాట. ఈ సందర్భంగా బార్బీ గురించి మరిన్ని ఆసక్తికరమైన
విషయాలు మీకోసం...

బార్బీకి ఓ చరిత్ర ఉంది. దాని గురించి తెలుసుకోవడానికి ఓ పుస్తకం కూడా ఉంది. రాన్‌డమ్ బుక్‌హౌస్ సిరీస్, ద వరల్డ్ ఆఫ్ బార్బీ పేరుతో 1960లో పుస్తకాన్ని రిలీస్ చేశారు. దాంట్లో బార్బీ తల్లిదండ్రులు, కుటుంబం గురించి ఉంటుంది. బార్బీ పేరుకే బొమ్మ అయినా తనకూ ఓ కలల ఇళ్లు ఉంది. అందమైన కారూ ఉంది. బార్బీ ఇల్లును నిజ జీవితంలో నిర్మించాలంటే 16 మిలియన్ల యూఎస్ డాలర్ల ఖర్చు అవుతుందని ఫోర్బ్ పత్రిక అంచన.. మూడు అంతస్తులు, ఏడు రూములు,
ఒక ఎలివేటర్, గ్యారేజ్, స్మిమ్మింగ్ పూల్ కలిగి ఉంటుంది బార్మి ఇల్లు...

ఆమెరికాకు చెందిన బొమ్మల తయారీ కంపెనీ మ్యాటెల్ యజమానురాలు రుత్ హ్యాండ్లర్ బార్బీని తయారు చేశారు. 1959 మార్చి 9న న్యూయార్క్‌లో నిర్వహించిన అమెరికన్ అంతర్జాతీయ బొమ్మల వేడుకలో దీన్ని మొదటి సారి ప్రపంచానికి పరిచయం చేశారు.

బార్బీకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంగ్లాండ్‌లో ఇంగ్లీష్ ఫ్రెండ్ ఫ్రానీ తనకు మొదటి విదేశీ స్నేహితురాలు. 1966-1976 వరకూ ఫ్రాన్సీ బీభత్సంగా పాపులర్ అయింది. క్రిస్టీ అనే ఆమెరికన్ ఆఫ్రికన్ బార్బీ బొమ్మ ఈ బార్బికి బెస్ట్‌ఫ్రెండ్.

1997లో మ్యాటెల్ కంపెనీ మొదటిసారి వీల్‌చెయిర్ బార్బీని రూపొందించింది. షేర్ ఏ స్మైల్ పేరుతో ప్రచారం చేస్తూ వీల్ చెయిర్ ఫ్యాషన్ డాల్‌ను అమ్మింది. దివ్యాంగులైన పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సంతోషం నింపడానికి ఈ వీల్‌చెయిర్ బార్బీబొమ్మ ఉపయోగపడింది.

1971లో బార్బీ


Barbie1
మొదటి సారి తన కండ్లను తిప్పింది. దంతాలు కనిపించేలా నవ్వింది. అంతకు ముందు ఒకే రకమైన చూపుతో ఉండే బార్బీని మ్యాటెల్ తీర్చిదిద్ది కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది.

బార్బీకి పెంపుడు జంతువులు అంటే ఎంతో ఇష్టం. వాటిలో ముఖ్యంగా గుర్రాన్ని బార్బీ ఇష్టపడుతుంది. దాంతో పాటు 21 కుక్క పిల్లలు, 6 పిల్లులు, ఒక చింపాంజీ, పాండా, చిలుక, జిరాఫీ ఇలా ఎన్నో ఉన్నాయి.

బార్బీకి ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. వారి పేర్లు.. స్కిప్పర్, స్టేసీ, చెస్లియా, క్రిస్సీ, కెల్లి, టూటీ, టోడ్. వీళ్లందరితో కలిసిన సెట్లు కూడా మార్కెట్‌లో దొరుకుతాయి. ఒక ఒరిజినల్ బార్బీ అసలైన రేటు 2,130 రూపాయలు ఉంటుంది.

తొలి రోజుల్లో 17 ఏండ్ల అమ్మాయిల ప్యాషన్ మోడల్‌గానే బార్బీకి పేరుండేది. కాని అది మెరుగులు దిద్దుకుంటూ పలు రూపాలను సంతరించుకుంది. విద్యార్థిగా, వైద్యురాలిగా, బిజినెస్ ఉమెన్‌గా, మోడల్‌గా, డ్యాన్సర్‌గా మార్కెటింగ్ పర్సన్‌గా ఇలా కెరీర్ ఉమెన్‌గా పరిచయం అవుతూ వచ్చింది. మహిళలకు తమకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని బార్బీ తన సందేశాన్ని ఇస్తుంది. సుమారు మూడు వందలకు పైగా కెరీర్ ఉమెన్ రూపాల్లో సింబాలిక్‌గా ఉంది. ఇలా వివిధ రూపాల్లో అందమైన బొమ్మగానూ, అమ్మాయిల ఆత్మ విశ్వాసాన్ని పెంచే బొమ్మగానూ నేడు బార్బీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నది.

బార్బీ ప్రపంచానికి పరిచయమైన మొదటి ఏడాదిలోనే 350, 000 బొమ్మలు అమ్ముడుపోయాయి. నేటికీ ఈ బొమ్మలు తమ ట్రెండ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయి. మ్యాటెల్ కంపెనీ ప్రతి మూడు సెకండ్లకు ఒక బొమ్మను తయారు చేసి అమ్ముతోంది. ఎప్పుడూ అందంగా కనిపించే బొమ్మలే కాదు. అందంగా లేని బొమ్మలను కూడా తయారు చేస్తోంది ఆ కంపెనీ. నల్లటి జుట్ట్టు, నల్లటి చర్మంతో తయారు చేసిన బొమ్మలు కూడా అమ్ముడుపోవటం విశేషం.

150 దేశాల్లో బార్బీ బొమ్మలు అమ్ముడవుతున్నాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల్ల 80 లక్షలకు పైగా ఈ బొమ్మలు అమ్ముడవుతున్నాయి.
రుత్ హ్యాండ్లర్ తన కూతురు బార్బరా తరచూ పేపర్ బొమ్మలతో ఆడుకునేది. దీన్ని గమనించి రుత్ తన కూతురికి త్రీ డైమెన్షనల్ బొమ్మను తయారు చేసివ్వాలని అనుకుంది. పేపర్‌తో మొదటి సారి కొన్ని బొమ్మలను తయారు చేసి తన కూతురికి ఇచ్చింది. ఆ బొమ్మలన్నీ విద్యార్థుల్లాగా, వృత్తి మహిళల్లాగా, చీర్ లీడర్స్‌లాగా రూపొందించింది ఆమె. తర్వాత భౌతిక రూపాన్ని మారుస్తూ వచ్చింది. తన కూతురు పేరు మీదుగానే బార్బీకి బార్బరా మిల్లిసెంట్ రాబర్ట్ అని పేరు పెట్టింది. దాన్ని మనం ముద్దుగా బార్బీ అని పిలుస్తున్నాం.
-వినోద్ మామిడాల
సెల్: 07660066469

321
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles