వాస్తు


Sun,February 17, 2019 12:35 AM

vasthu

మా ఇంటికి ఈశాన్యం గేటుకు ఎదురుగా రోడ్డు వస్తుంది. ఉత్తరంలో కొంత స్థలం ఉంది. దానిని ఇంట్లోకి కలుపొచ్చా?

ఆదిబట్ల వెంకటేష్, ఘట్‌కేసర్
తూర్పు ఉత్తర స్థలాలు కలుపుకోవడం తప్పుకాదు కానీ ఉన్న ఇంటికి వీధిచూపు వచ్చినప్పుడు చుట్టు పక్కల స్థలాలు కలుపుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. మీకు వచ్చే ఎదురురోడ్డు అది ఈశాన్యం వీధిచూపు ఎంతో గొప్పగా ఉంటుంది. మీకున్న ఉత్తరం స్థలం ఎంత వెడల్పు ఉందో రాయలేదు. ఉత్తరం ఖాళీ ఇంటి ఆవరణలో కలుపుకున్నా కూడా ఆ వీధిచూపు ఉచ్ఛమైన భాగంలోకే వస్తే ఇబ్బంది ఉండదు. కానీ ఉత్తరం స్థలం పెరిగేకొద్దీ దక్షిణం తగ్గిపోవడంతో ఎదురురోడ్డు ఇంటికి వీధిపోటు అవుతుంది. అది చాలా దోషం. కాబట్టి మీరు లెక్క చూసుకొని ఆలోచించండి. ఉన్న ఇంటికి ఉన్న వీధి మంచిదిగా ఉన్నప్పుడు ఖాళీ స్థలాన్ని కలుపుకోకపోవడమే మంచిది.

తూర్పులో టాయిలెట్ ఉన్న ఇల్లు తీసుకోవచ్చా?

ఎన్.అనిత, అల్వాల్
కొత్తగా కట్టే అనేక అపార్టుమెంట్‌లలో చాలామంది నిర్మాణదారులు ఉత్తరంలో తూర్పులో టాయిలెట్లు పెడుతున్నారు. తూర్పు ఉత్తరాలు సూర్యుని ఉషోదయ కిరణాలు గృహంలోకి వచ్చే దిశలు. వాటిని స్వీకరించే స్థలాలు మరుగు, మురుగు దొడ్లు అయినప్పుడు వాటిగుండా ప్రయాణించే సూర్యుని కిరణాలు, గాలి, మలినాలతో సూక్ష్యక్రిములతో నిండి ఇంటిని ఆక్రమిస్తుంది. కాబట్టి గొప్ప అందమైన గృహాలు అలాంటి దొడ్లతో ఆరోగ్యహీనంగా మారిపోతున్నాయి. ప్లోరింగ్, ఎలివేషన్లకు ఇచ్చిన ప్రాధాన్యం ఇంటి ఆరోగ్య వాతావరణం, వైభవాలకు ఇవ్వనప్పుడు ఇంటి గొప్పతనంతో ఏం ఉపయోగం ఉంటుంది. మీరు టాయిలెట్ మార్చండి కుదరకుంటే ఆ ఇల్లు కొనకండి.

ఇంటికి ైస్లెడింగ్ గేటు పెట్టొచ్చా. అది బయటకు పెట్టాలా, లోపలి వైపు పెట్టాలా?

పి.రఘువీర్, బాగ్‌లింగంపల్లి
మీ గృహం సింహద్వారం ఎటువైపు ఉందో చెప్పలేదు. ైస్లెడింగ్ అంటే గోడను అనుసరిస్తూ సాగే గేటు. దానిని లోపలవైపు బయటివైపు పెట్టుకోవచ్చు. ఏమీకాదు. పడమరలో ఈ గేటు పెట్టాలనుకుంటే మరీ రోడ్డులోకి పెంచి పెట్టవద్దు. మరీ రోడ్డులోకి పెంచి పెట్టవద్దు. అప్పుడు వీధిపోటు పడుతుంది. కొందరు కారు పట్టాలని వీధిలోకి గేటును బాక్సులాగ పెంచి కడతారు. అది మంచిది కాదు. ప్రహరీ (ఇంటి) లోపలికి పెట్టినప్పుడు ఏ దిశ అయినా దానితో దోషం ఉండదు. ఈ గేటు పెట్టాలంటే ఆ గేటు పట్టే స్థలం ఖాళీ ఉంచాల్సి వస్తుంది. మెట్ల నిర్మాణం ప్రహరీ గోడ ఎలివేషన్ అడ్డురాకుండా ఉండాలి. మీరు అనుకున్న విధంగా ఎటు కుదిరితే అటు పెట్టండి.

మేము డూప్లెక్స్ కడుతున్నాం. దక్షిణం మెట్లు రాకుండా ఎక్కడ పెట్టొచ్చు?

పి. వాసుదేవ్, ఆలేరు
ఇంట్లో మెట్లు కేవలం దక్షిణంలోనే కాదు పడమర వాయవ్యంలో పెట్టొచ్చు. పడమర మధ్యలో పెట్టొచ్చు. దక్షిణం స్థలం అయితే ఉత్తర వాయవ్యంలో కిచెన్‌కట్టి తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టుకోవచ్చు. డూప్లెక్స్ ఇల్లు కట్టాలంటే ప్రధానంగా ఆలోచించాల్సింది వాతావరణ సమతుల్యత (బ్యాలెన్సింగ్) దానిని మీ ఇష్టం వచ్చినట్టు కాకుండా శాస్త్ర సమ్మతంగా కట్టండి. కడుపులో ఇద్దరు పిల్లలు అముడాల (ట్విన్స్) పుట్టొచ్చు. కానీ వాళ్లు ఒకే రూపంతో ఉన్నా అంటుకొని పుట్టొద్దు. డూప్లెక్స్ అలా కవలలు స్వతంత్రను దెబ్బతిననీయకుండా శాస్త్ర జాగ్రత్తలతో కట్టాలి.

శంబువును భూమి పూజలో తప్పనిసరి ఉపయోగించాలా? ఎందుకు?

వై.నళినీ, బోయిన్‌పల్లి
కొన్ని సంప్రదాయబద్ధంగా వచ్చిన ఆచారాలు ఉంటాయి. నిజానికి ఆ పని చేయకపోయినా దానిని చేసినట్టుగా భావించి ఆ వస్తువును వాడుతారు. ఈ విధానం పూజలల్లో ఉంటుంది. మంచిదే. దిశను నిర్ధారించడానికి ఒక నిర్దిష్ట కొలతలతో భూమి మధ్య భాగం అంటే నిర్మాణ భాగంలో శంఖువు నుంచి ఉదయం సూర్యోదయవేళ మధ్యాహ్నం వేళ దాని నీడను చూసి తూర్పు, పడమరలు నిర్థారించేవారు. దానిని దిక్సాధన (దిక్కును గుర్తించడం) చేసేవారు. ఇవాళ దాని అవసరం లేకపోయినా ఆ వస్తువును శంఖం పూజలో వాడడం ఆచారం, తప్పనిసరికాదు.

sudhaala
సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

784
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles