రాశి ఫలాలు


Sun,February 17, 2019 12:30 AM

17-2-2019 నుంచి 23-2-2019 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారు భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. న్యాయవాద, వైద్య వృత్తిలోని వారికి అనుకూలిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారం, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యాపారాలలో వారికి కలిసి వస్తుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. పై అధికారులతో సమన్వయం కుదురుతుంది. మంచి పేరు సంపాదిస్తారు. శుభకార్యాల విషయాలలో చేసే ప్రయత్నాలలో ఆటంకాలుంటాయి. ప్రయాణాలు కలిసిరాకపోవచ్చు. పెద్దల సూచనలను తప్పక పాటించాలి.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కొత్త వస్తువులు, నగలు కొనే అవకాశం ఉంది. ఆఫీసులో మంచి పేరు పొందుతారు. ప్రమోషన్‌లు ఉంటాయి. రాజకీయంలో కార్యకర్తలతో అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. షేర్లు, వడ్డీ వ్యాపారాలు లాభిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి. రైతులకు పనివారితో అనుకూలత ఉంటుంది. వాహనాల వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు. ఊహించని ఖర్చులు, పనివారితో సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలుంటాయి.

కర్కాటకం

ఈ రాశి వారు ఈ వారంలో ఆర్థిక సమస్యల నుంచి విముక్తులవుతారు. ఆదాయం పెరుగుతుంది. పనివారితో సమస్యలు పరిష్కారం అవుతాయి. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడుల వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తులలోని వారికి కలిసి వస్తుంది.రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యవసాయదారులకు పనివారితో ఇబ్బందులు ఉంటాయి.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారికి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. కాబట్టి అన్ని విషయాల్లోనూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో రోజు వారీ క్రయవిక్రయాల్లో ఇబ్బందులుంటాయి. అనాలోచిత పెట్టుబడుల వల్ల నష్టాలు ఉంటాయి. ఇంజినీరింగ్, న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్యవృత్తిలో ఉన్న వారికి ఆర్థిక సమస్యలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పనివారితో కలహాలు ఉండొచ్చు. వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారు కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచిది.

కన్యఈ రాశి వారికి ఈ వారంలో ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు రంగాల్లోని వారికి, స్వయంవృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలిస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. శ్రద్ధతో పనులు చేస్తే సత్ఫలితాలను పొందుతారు. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి లాభదాయకంగా ఉంటుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఉన్నత విద్య, శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు.

తుల

ఈ రాశి వారికి ఈ వారంలో శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. దీంతో చాలా పనులు నెరవేరుతాయి. పనివారితో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా, పత్రికా రంగాల్లోని వారికి ఆదాయం పెరుగుతుంది. హోటలు, క్యాటరింగు, సుగంధ ద్రవ్యాలు, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాల్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. సభలు, విందులలో పాల్గొంటారు.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారికి పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. క్షేత్రాలు, పుణ్యనదీ స్నానాలు ఆచరిస్తారు. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాల వల్ల లాభాలుంటాయి. ఇంజినీరింగ్, వైద్యవృత్తిలో ఉన్న వారికి ఈ వారం లాభదాయకం. హోటలు, క్యాటరింగు, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పై అధికారులతో మనస్పర్థలు ఏర్పడొచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. శుభకార్యాలు, విదేశీప్రయాణాలు ఆర్థిక సమస్యల వల్ల వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారు ఆఫీసులో మంచి పేరు పొందుతారు. రాజకీయంలో ఉన్న వారికి కార్యకర్తల సహాయ సహకారాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. హోటలు, క్యాటరింగు వ్యాపారాలు కలిసి వస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారాలు, వడ్డీ, షేర్ మొదలైన వ్యాపారాల్లో ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి పనివారితో సమస్యలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. షేర్ బిజినెస్, వడ్డీ వ్యాపారం, నిత్యావసర వస్తు వ్యాపారాల్లో పెట్టుబడులు కలిసివస్తాయి. ఉపాధ్యాయ, న్యాయవాద, ఇంజినీరింగు వృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. ఉన్నతవిద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు పొందుతారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. వ్యవసాయదారులకు పనివారితో ఇబ్బందులు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఆర్థికసమస్యలు ఉంటాయి.

కుంభం

ఈ రాశి వారు ఈ వారంలో భార్యా పిల్లలతో హాయిగా గడుపుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత కుదురుతుంది. వాహనాల వల్ల పనులు పూర్తవుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి హోటలు, క్యాటరింగు, సాహిత్య, పత్రికా, వైద్య రంగాల్లో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది.

మీనం

ఈ రాశి వారు ఈ వారంలో శుభకార్యాలు చేస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరు పొందుతారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. క్షేత్రాలు, పుణ్యనదీ స్నానాలు చేస్తారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారు కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. వృథా ఖర్చులుంటాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనివారితో సమస్యలు, అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందుల వల్ల పనుల్లో ఆలస్యం కావచ్చు. వ్యాపారంలో రోజువారీ క్రయ విక్రయాల్లో ఇబ్బందులుంటాయి.

rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

1607
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles