ఇంటెక్


Sun,February 10, 2019 03:04 AM

Personal-Ceramic-Heater

పర్సనల్ సెరామిక్ హీటర్

అసలే చలికాలం. ఫ్యాన్ వేయకున్నా చల్లగానే ఉంటుంది. ఇంట్లోంచి రావాలంటే భయపడుతుంటారు. ఉతికిన బట్టలు, సాక్సులు ఆరుతాయన్న నమ్మకం లేదు. అలానే వేసుకుంటే ఎక్కడ వాసన వస్తుందో అని భయపడుతుంటారు. వారికోసం గీక్‌హీట్ అనే కంపెనీ పర్సనల్ సెరామిక్ హీటర్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని ప్లాస్టిక్‌తో తయారు చేశారు. హీటర్‌కి చార్జింగ్ పెట్టుకునే విధంగా ప్లగ్ అమర్చారు. హీటర్‌ను ప్లాస్టిక్‌తో తయారు చేశారు. అంతేకాకుండా ఎరుపు, బ్లూ రెండు రంగుల ఎల్‌ఈడీ ఇండికేటర్ ఉంది. టచ్ బటన్‌ని నొక్కి వేడిని పెంచుకోవచ్చు. దీనిని చిన్నపిల్లలు వాడకూడదు. దీన్ని ఎక్కడికైనా సులువుగా వెంట తీసుకెళ్లొచ్చు. ఈ కామర్స్ వెబ్‌సైట్లో ఆఫర్స్‌తో కలిపి దీని ధర రూ. 2,063.

Rechargeable

లైటింగ్ గ్లౌవ్స్

ప్రతి ఒక్కరికీ జాగింగ్ చేసే అలవాటుంటుంది. ఎంత లేదనుకున్నా కనీసం ఉదయం 5 గంటలకైనా మొదలుపెడుతారు. చీకటిగా ఉంటుంది కాబట్టి చేతిలో టార్చ్‌లైట్ వెంట తీసుకెళ్తారు. ఇప్పుడు జాగింగ్ చేసేటపుడు చేతిలో బరువు పట్టుకోనవసరం లేదు. చలికి తట్టుకోలేక చేతికి వేసుకునే గ్లౌవ్స్‌కూ లైట్లు ఉండేలా తయారు చేశారు. వీటిని పాలిస్టర్‌తో తయారు చేశారు. మంగటాలైట్స్ కంపెనీ రీచార్జబుల్ లైటెడ్ గ్లౌవ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. అరచేతికి వెనుక భాగంలో లైట్స్ అమర్చారు. కేబుల్ ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని బరువు కూడా తక్కువగా ఉంటుంది. వీటిని 12 యేండ్లలోపు పిల్లలకు వాడరాదు. గ్లౌవ్స్ లోపల ఉండే ఎల్‌ఈడీ లైట్స్‌ని తీసి ఉతకాలి. ఈ కామర్స్ వెబ్‌సైట్లో ఆఫర్స్‌తో కలిపి దీని ధర రూ. 2703.

- వనజ వనిపెంట

584
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles