కొత్త పాట


Sun,February 10, 2019 02:59 AM

song

మరుగైనావా రాజన్నా

సినిమా : యాత్ర
తారాగణం : మమ్ముట్టి
దర్శకత్వం : మహి వి రాఘవ
సంగీతం : కృష్ణ కుమార్
లిరిక్స్, గానం : పెంచల్ దాస్

మరుగైనావా రాజన్నా
కనుమరుగైనావా రాజన్నా
మా ఇంటి దేవుడవే..
మా కంటి వెలుగువే
వొరిగినావా రాజన్నా..
వొరిగినావా రాజన్నా

అద్దుమానం అడివిలోన
యాలగాని యాలకాడ
పైనబోయే పచ్చులారా
యాడమ్మా మన రాజన్నా
నువ్వొచ్చే దావల్లో
పున్నాగా పూలుజల్లి
నీ కోసం వేచుంటే
చేజారి పోతివా
చల్లాని నీ నవ్వు చక్కాని నీ నడక
రచ్చబండ చేరకనే
నేలరాలి పోతివా
మాట తప్పని రాజన్నా
మడమ తిప్పని మనిషివయా
మరువజాలం నీ రూపం
నీకు సాటి ఎవరయ్యా
మా గుండెల్లో గుడిసెల్లో
కొలువుంటావు రాజన్నా
సాయంసంధ్యా దీపంలో
నిన్నే తలుచుకుంటాము
నిన్నే తలచుకుంటాము

టాప్ 10 సాంగ్స్ ఆఫ్ ది వీక్

1 ఏమయినదో- మిస్టర్ మజ్ను
2 రెచ్చిపోదాం బ్రదర్ - ఎఫ్2
3 చెలియా అడుగుదామా - దేవ్
4 కథానాయక - ఎన్టీఆర్
5 పెదవి చివరకే - పేట
6 నాలో నీకు - మిస్టర్ మజ్ను
7 హనీ ఈజ్ ద బెస్ట్ - ఎఫ్2
8 ఏక్ బార్ - వినయ విధేయ రామ
9 మిస్టర్ మజ్ను - మిస్టర్ మజ్ను
10 ఎంతో ఫన్ - ఎఫ్2

780
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles