వాస్తు


Sun,February 10, 2019 02:55 AM

HOME

ఇంటిపైన (స్లాబ్‌మీద) రౌండ్‌గా రూము ఎటువైపు కట్టుకోవచ్చు?

జి.రంజిత్‌రెడ్డి, జగిత్యాల
ఇంటిమీద గది కట్టడం తప్పుకాదు కానీ అది ఎలా కట్టాలి ఎక్కడ కట్టాలి అనేది ముఖ్యం. కింది ఫ్లోర్‌లో నైరుతిలో పడకగది వేసి ఉంటారు అదే కొలతలో పైన గది వేయాల్సి ఉంటుంది. దాని ఎత్తు మనకు అవసరం ఉన్నంత వరకు కట్టవచ్చు. ఆ గదికి ఫ్లోరింగ్ తప్పనిసరిగా స్లాబ్‌లెవల్ కన్నా ఎత్తుగా ఉండాలి. ఫ్లోరింగ్ లేకుండా వదిలివేయవద్దు. గది ఆకారం ఎప్పుడైనా ఎక్కడైనా రౌండుగా వేయడం మంచిదికాదు. తద్వారా దాని శక్తి విచ్ఛిన్నం అవుతుంది. అలాంటి గదిలో నివాసం ఆమోదయోగ్యం కాదు. మనిషికే కాదు ఎలాంటి జీవులకూ మంచిదికాదు. రౌండు గది చాలామంది చాలా ప్రాంతాలలో చుట్టు ఇల్లు అని నిర్మిస్తుంటారు. కాలక్రమంలో అవన్నీ స్టోర్ రూములుగా మిగిలిపోతుంటాయి. ఒక వైజ్ఞానిక శక్తి పొందాలంటే కొలబద్దంగా సరైన దిశ, సమఎత్తులోనే ఉండాలి. మీరు స్లాబ్‌మీద గది నైరుతిలో కట్టండి కానీ గుండ్రంగా కట్టకండి.

ఇంట్లోని పూజగది తూర్పు ముఖంగా ఉంటే ఉదయం నాలుగు గంటలకే పూజ చేయాలా?

సరోజన, హుజురాబాద్
దాదాపు తూర్పు ముఖంగా ఉన్నవే మనదేశంలో దేవాలయాలు. అందులో ఎన్ని ఆలయాలు నాలుగు గంటలకు నైవేద్యార్చనలు పొందుతున్నాయి. పూజ బ్రహ్మ ముహూర్తంలో అన్నది నియమం. అది ఆలయ ముఖంబట్టి కాదు. పడమర ముఖం పూజగదిలో పగలు పన్నెండు గంటలకైనా పూజ చేయవచ్చు అనేది లేదు. మనిషి మేలుకొలుపు అన్నది ప్రధానం. మేలుకొలుపు అనేది భౌతిక శరీరం నిద్రలేవడం అనేదానిని సూచించేది కాదు భ్రమల నేత్రం మూసుకొని జ్ఞాననేత్రం తెర్చుకోవాలని సూచిస్తుంది. అద్భుత ప్రతిభ ఎక్కడో కొండకోనల్లో, పాతాళంలో పారుకొని ఉండదు. మన పాంచభౌతిక శరీరంలోనే నిక్షిప్తమై ఉంటుంది. ప్రకృతిలోని బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రసారమయ్యే నిగూఢ శక్తి విన్యాసంతో మన మేధ మహాన్నత స్థితిని అందుకొంటుంది. ఆ వేశ మనిషిని మేలుకొలుపుతుంది.

బంగళాకు (మేడమీదకు) వెళ్లే మెట్లు గేటులో పడవచ్చా?

నాగవల్లి మీణాకుమారి, కొత్తకోట
ఇల్లును స్థలాన్ని బట్టి నిర్మిస్తే గేట్లు, ద్వారాలు వేటికవి స్వతంత్రంగా నిలబడగలుగుతాయి. తక్కువ జాగలో ఎక్కువ ఇల్లు వల్ల అనేక తప్పులు జరుగుతుంటాయి. ఇంటిగేటు ఎంత వెడల్పు అవసరమో చూసుకొని ఉత్తరం అంత వెడల్పు ఏ నిర్మాణం రాకుండా చూసుకోవాలి. మీరు మీ తూర్పు ఈశాన్యం గేటుకు ఎదురుగా కాక తూర్పు ఆగ్నేయంలో మెట్లు నిర్మించుకోండి. ఇంటి పొడవు కొంత వరకు తగ్గించుకుంటే తూర్పు ఆగ్నేయం మెట్లు చక్కగా వేసుకోవచ్చు. ఇంటి స్థలం తూర్పు పడమరలలో దీర్ఘచతురస్రంగా ఉన్నప్పుడే ఉత్తరం విడిచిన ఖాళీలో ఏవీ రాకుండా చూసుకోవాలి. తద్వారా మీకు ఉత్తమ ఆరోగ్య ఫలాలు అందుతాయి. గేట్లలో మెట్లు పడకుండానే జాగ్రత్త పడడం మంచిది. తప్పనిసరి ఉత్తర వాయవ్యంలో మెట్లు వస్తే ఆ భాగం వదిలి ఇంటి ఈశాన్యం గది వెడల్పుతో గేటును జరిపి కట్టండి. అప్పుడు మీ సింహద్వారానికి ఎదురుగా గేటు వస్తుంది. అది కూడా చాలా శుభకరం. పూర్తి ఈశాన్యంలోనే గేటు ఉండాలని లేదు. ఇంటి ప్రధాన ద్వారంలో గేటు పిల్లర్స్ పడకుండా చూసుకొని సరి చేసుకోండి.

మా చిన్న బాబు ఎప్పుడూ మూడీగా ఉంటాడు. డాక్టర్స్‌కు చూపిస్తున్నాము. ఇంట్లో కూడా ఏమైనా దోషాలు సవరించాలా?

సంగిశెట్టి నిర్మల, ఆసీఫాబాద్
బాల్యంలో నివసించే గృహాలు పిల్లల భవిష్యత్తును సూచిస్తుంటాయి. కొందరు పిల్లలు ప్రతిదానికీ చిరాకు పడుతుంటారు. కోపంతో వస్తువులు విసిరికొడుతుంటారు. కొందరు మౌనంగా అన్ని సందర్భాల్లో మూడీగా ఉంటారు. కారణం పరిసరాలు ఇంట్లో బాల్యం చిగురించాలంటే కేవలం ఆగ్నేయంలో కిచెన్, ఈశాన్యంలో సంపు నైరుతిలో బెడ్‌రూము ఉంటే చాలదు. అద్భుతమైన వెంటిలేషన్ ఉండాలి. అన్ని గదుల్లో సూర్యునికి ఆతిథ్యం అందాలంటారు పెద్దలు. ముఖ్యంగా చిన్న పిల్లలు నిదురించే గదులు చీకటి సమయం తప్ప అన్ని సమయాలు వెలుగు, గాలులతో విరాజిల్లాలి. నాకు తెలిసి మీరు పంపిన ప్లాను బట్టి చూస్తే మీ ఇల్లు చాలా చీకటిగా ఉంది. దగ్గరి దగ్గరి ఇండ్లలో మీరు నివాసం ఉంటున్నారు. పక్క ఇండ్లు పక్కవాళ్ల ఇష్టానుసారం ఉంటాయి. మీ తూర్పులో ఖాళీ చాలా తక్కువగా ఉంది. పైగా ఈశాన్యం పెంచి గదివేశారు.

sudhaala
సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

743
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles