రాశి ఫలాలు


Sun,February 10, 2019 02:46 AM

10-2-2019 నుంచి 16-2-2019 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి ఆఫీసులో మంచి హోదా లభించే అవకాశం ఉంది. స్వయంవృత్తి, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. రాజకీయంలో కార్యకర్తల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాలతో లాభాలుం టాయి. న్యాయవాద, వైద్యవృత్తిలోని వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొంటారు. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. శుభకార్యాలు, విదేశీ ప్రయాణ ప్రయత్నాల్లో ఆటంకాలుంటాయి. అనవస ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు ఉంటాయి. వారాంతంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యకు ఈ వారం అనుకూలం. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రీ రంగాల్లో అనుకూలత ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి అన్నదమ్ములు, బంధువులతో అనుకూలత ఉంటుంది. ప్రధాన గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో ఇబ్బందులు ఉండొచ్చు. ప్రారంభించిన పనులు ముందుకు సాగకపోవచ్చు. ఉద్యోగ విషయంలో చేసే ప్రయత్నాలు ఫలించక పోవచ్చు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. అనవసర ప్రయాణాల వల్ల అనారోగ్యం, అలసట కలుగుతుంది. పనివారితో కలహాలు ఉండొచ్చు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. పెద్దల సహాయ సహకారాలు కొరవడతాయి.

కర్కాటకం

ఈ రాశి వారు ఈ వారంలో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉన్నత విద్యకు అనుకూలమైన వారం. నలుగురిలో మంచి పేరు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. పనివారితో అనుకూలత వల్ల పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారం కలిసి వస్తుంది. రోజువారీ క్రయవిక్రయాల్లో లాభాలుంటాయి. షేర్ బిజినెస్, నిత్యావసర, వడ్డీ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. న్యాయవాద, ఉపాధ్యాయ, ఇంజినీరింగ్ వృత్తులలో ప్రమోషన్‌లు ఉంటాయి. ఆదాయం పెరగొచ్చు. కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారులతో కొంత మనస్పర్ధలు ఉంటాయి.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారు అనవసరమైన విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. ఉద్యోగులకు వారం ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు, నదీస్నానాలు ఆచరిస్తారు. పెద్దల సూచనలను పాటిస్తారు. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలలో ఉన్న వారికి కలిసి వస్తుంది. ప్రధాన గ్రహాల స్థితి అనుకూలంగా లేదు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేముందు జాగ్రత్త పాటించాలి. పనివారితో ఇబ్బందులుంటాయి. అనవసరమైన ఖర్చులుంటాయి. ప్రారంభించిన పనులు పూర్తి కాకపోవచ్చు. అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి.

కన్య

ఈ రాశి వారికి ఈ వారంలో ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రద్ధతో పని చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా, పత్రికా రంగాలలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. వారాంతంలో ఆఫీసులో అందరితోనూ అనుకూలత ఉండే అవకాశాలు ఉన్నాయి. హోటలు, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాలు, పూలు, పండ్లు, నిత్యావసర వస్తువుల వ్యాపారాలలో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆలోచన అవసరం. పెద్దల సూచనలు పాటించాలి.

తుల

ఈ రాశి వారు ఈ వారంలో ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. అన్నదమ్ములు, బంధువులతో మంచి సంబంధాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగులకు వారం మొదట్లో అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు పనివారితో అనుకూలత ఉంటుంది. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. పెద్దల మాటలకు, సూచనలకు విలువ ఇవ్వడంతో పనులు నెరవేరుతాయి. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. హోటలు, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య, నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ వ్యాపారాలలో ఉన్న వారికి కలిసి వస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మాత్రం ఆలోచన అవసరం.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారు భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. వారం ప్రారంభంలో ఉద్యోగులకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. పత్రికా, సాహిత్య రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. అనాలోచిత పెట్టుబడులు పెట్టకూడదు. న్యాయవాద, ఉపాధ్యాయ, ఇంజినీరింగ్ వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. రోజువారీ క్రయవిక్రయాల్లో లాభాలుంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్, వడ్డీ వ్యాపారం, హోటలు, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, పూలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు తదితర వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు పొందుతారు. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆర్థిక పరమైన సమస్యలు ఉండొచ్చు.

కుంభం

ఈ రాశి వారికి ఈ వారంలో బంధువులు, స్నేహితులతో సంబంధాలు పెరుగుతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు పనివారితో అనుకూలత ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట, అనారోగ్యం దూరమవుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. పనివారితో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి ఆదాయం పెరుగుతుంది.

మీనం

ఈ వారంలో ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో కొన్ని సమస్యలుంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, నదీస్నానాలు ఆచరిస్తారు. పెద్దల సలహాలకు విలువ ఇచ్చి ముందుకు వెళ్లడం మూలంగా పనుల్లో సత్ఫలితాలుంటాయి. వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాల్లో ఇబ్బందులు ఉంటాయి. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, కూరగాయలు, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యాపారాలలో ఉన్న వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

1123
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles