ఎడారి జీవితంలో చిగురించిన ప్రేమ..


Sun,February 3, 2019 02:35 AM

LOVE
తన ప్రేమ నా జీవితానికి వెలుగునిచ్చింది. తోడుగా, నీడగా ఉంటానని మాటిచ్చిన వ్యక్తి చెయ్యిచ్చి వెళ్తే.. నా చేతిని తన చేతిలోకి తీసుకొని బాధ్యతగా తీసుకున్నాడు. అతను నా ఎడారి జీవితంలో ప్రేమను చిగురింపజేశాడు.

నాతో పాటు నా బాబుని కూడా ప్రేమించే పెద్ద మనసున్నవాడు. నా కొడుకును కూడా తన సొంత కొడుకులా చూస్తాడు. తను అన్న ప్రతి మాటా నాకు గుర్తుంటుంది. నిన్ను పెండ్లి చేసుకున్నాక, మన పిల్లలతో పాటు, నీ కొడుకుని కూడా అంతే సమానంగా చూసుకుంటాను. వాడికి ఏ లోటూ రానివ్వను అని మాటిచ్చాడు.

2017 జూలై మాసంలో నా జీవితంలోకి ఉపేందర్ వచ్చిన రోజు. తనూ అందరిలానే స్నేహం చేసి, కొన్ని రోజులు మాట్లాడి వెళ్లిపోతాడేమో అనుకున్నా. ఉపేందర్ అలా కాదని తెలిసింది. అతని మాట తీరు, ప్రవర్తన అన్నిటికంటే నన్ను అర్థం చేసుకునే గుణం నాకు బాగా నచ్చాయి. అవే ఆలోచనలు తనపై ఇష్టాన్ని కలుగజేశాయి. అప్పటికే నాకు పెండ్లయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. నా భర్తతో విడిపోయి జీవితం ఇక ఇంతే అనుకునే సమయంలో అయినా తన పరిచయం ప్రేమగా మారింది. భర్త చేతిలో మోసపోయి ఒంటరిగా ఉన్న నాకు ఉపేందర్‌ను నమ్మొచ్చా లేదా అని ఆందోళన ఉండేది. కానీ తర్వాత ఉపేందర్ ప్రవర్తన, తీరు పూర్తి నమ్మకం కలిగించాయి. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా ఉపేందర్ నాకు స్పెషల్. ఎందుకుంటే నన్ను నన్నుగా అర్థం చేసుకుని, నా నుంచి ఏమీ అశించని నిజమైన ప్రేమ తనది. చాలాసార్లు నేను ఒంటరితనంతో కాలం వెళ్లదీసేదాన్ని. ఉపేందర్ వచ్చాక నా జీవితానికి ఒక కొత్త మజిలీ ఏర్పడింది.

అందరిలా ఆలోచించే మనస్తత్వం కాదు అతనిది. నిజమైన ప్రేమ ఉంది అనడానికి ఉపేందర్‌ను చూస్తే తెలుస్తుంది. తన ప్రేమలో నాకు ఎలాంటి అనుమానాలు లేవు. నేను తన జీవితంలో భాగమై, ఇద్దరమూ ఒక్కటైతే ఇంకాఎంత బాగా చూసుకుంటాడో అనిపిస్తుంది. అందరు ప్రేమికులలాగా మా ప్రేమలో గొడవలు, అలకలు లేవు. కానీ అప్పుడప్పుడూ నేనే కావాలని గొడవలు పడేదాన్ని. ఎంత తిట్టినా నన్ను అర్థం చేసుకుని మళ్లీ తనే నన్ను మాట్లాడిస్తాడు. ఈ మాత్రం చాలు కదా అసలైన ప్రేమలో అలకలు ఉండాలి కానీ వాటినే పట్టుకుని కూర్చోవద్దు అనడానికి. అందమైన తన మనసులో నాకు మాత్రమే చోటిచ్చాడు ఉపేందర్. ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకుని మధ్యలోనే ప్రేమను వదిలేస్తున్నారు. కానీ తను నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. నా పరిస్థితి అంతా తెలిసినా కూడా నా భవిష్యత్తుకు భరోసా ఇస్తాడు. తను నన్ను మాత్రమే కోరుకుంటున్నా అంటాడు. ఇప్పటి వరకైతే నన్ను నన్నుగా అర్థం చేసుకునే ఒకే ఒక వ్యక్తి ఉపేందర్. తన ప్రేమ నా జీవితానికి వెలుగునిచ్చింది. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. నాతో పాటు నా బాబుని కూడా ప్రేమించే పెద్ద మనసున్నవాడు. నా కొడుకును కూడా తన సొంత కొడుకులా చూస్తాడు. తను అన్న ప్రతి మాటా నాకు గుర్తుంటుంది. నిన్ను పెండ్లి చేసుకున్నాక, మన పిల్లలతో పాటు, నీ కొడుకుని కూడా అంతే సమానంగా చూసుకుంటాను. వాడికి ఏ లోటూ రానివ్వను అని నా నమ్మకాన్ని పెంచాడు.
LOVE1
నా జీవితం అయిపోయింది అనుకుంటున్న సమయంలో నాకు మరో కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ప్రేమకు , జీవితానికి అర్థం తెలిసినవాడు, కన్న తల్లి మనసును అర్థం చేసుకున్నవాడు, ప్రేమించిన అమ్మాయినీ, భార్య మనసునూ అర్థం చేసుకుంటాడు. ఉపేందర్‌లో ఈ మంచి లక్షణం నాకు కనిపిస్తుంది. కష్టాలు మళ్లీ నా జీవితంలోకి రావనుకున్న సమయంలో ఇంకో కష్టం వచ్చి పడింది. నా వాడు అనుకున్న తను కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే కలవదు. సోషల్‌మీడియాలో ఉన్న అకౌంట్‌లన్నీ బ్లాక్ చేసుకున్నాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఎలా ఉన్నాడో తెలియదు. అంత మంచివాడు.. ఇంతగా ఎందుకు కఠినంగా మారాడని ఆలోచనలో ఉండిపోయాను. రోజులు గడిచాయి. నెలలు పూర్తవుతున్నాయి. ఇంకా అతని జాడ లేదు. ఉపేందర్! నేను నీకు చెప్పదలచుకున్నది ఒకటే. నన్ను అన్ని విషయాల్లో అర్థం చేసుకున్నావు. నీ కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు. ఇప్పుడు నా జీవితం మొత్తం నువ్వే.. మన ఈ ప్రేమ మనం జీవించి ఉన్నంత కాలం ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నాతో ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుతున్నాను. నీ జీవితంలో నేను తోడుంటాను. ఐ లవ్ యూ ఉపేందర్.

ఈ మన ప్రేమ కలకాలం ఇలానే ఉండాలని..
- నీ సంధ్య

2367
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles