కవయిత్రి, సింగర్ రాశీఖన్నా..


Sun,February 3, 2019 02:23 AM

rashi-khanna
సినిమాల్లో క్యూట్ క్యూట్‌గా అలరించే రాశీ ఖన్నా అందరికీ నటిగా మాత్రమే పరిచయం. కానీ బయటకు కనిపించని, చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ప్రతీ ఒక్కరిలో మరో కోణం ఉన్నట్టే.. రాశీలో కూడా మనకు తెలియని చాలా విషయాలున్నాయి. ఆ ముచ్చట్లు ఈ వారం మరో కోణంలో..

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2017 మార్చి 7న రాశీఖన్నా రాసిన బిలీవ్ ఇన్ యు అనే కవితకు తెలుగు అనువాదం

నిన్ను నువ్వు నమ్ముకో.. నా జీన్స్ నా పరిమాణం కాదు, నా నవ్వు నా పరిమాణం. నేను బరువులు తూచే యంత్రం మీద ఒక సంఖ్య కాదు, నాతో పాటు ఉండే బలం, ఆత్మవిశ్వాసం నేను.నేను పుట్టిన రంగుతో కాదు, నా చెంప మీద కనిపించే సిగ్గును నేను.నా చర్మం మీద రంగు మారిన మచ్చలు కాదు నేను,నేనంటే భరించిన మచ్చలు నేను.నేనంటే నా దుస్తుల సైజు కాదు, నాలో రగిలే నిప్పులే నేను.మీకు నచ్చినట్టుగా ఉండే వ్యక్తిని కాను, మీ ఊహను మించిన శక్తిని నేను.నేను ఒక శక్తిని, నేను నిప్పును, రగులుతున్న ఓ ఆశయాన్ని నేను.మీరు కావాలనుకుంటున్న వ్యక్తిని కాను నేను, నేను నేనే.
rashi-khanna2
రాశీ ఖన్నా ముద్దుపేరు రాశి. చిన్నప్పుడు రాశీ బొద్దుగా ఉండేది. ఇంట్లోవాళ్లు, ఫ్రెండ్స్ అందరూ రాశి అనే పిలుస్తారు. ఢిల్లీలో పుట్టింది. తండ్రి ఢిల్లీలో మెట్రో సెల్స్ కార్పొరేషన్ ఉద్యోగి. చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా ఈవెంట్ జరిగితే అందులో తప్పకుండా గొంతు విప్పేది. ఇప్పటికీ రాశీ అప్పుడప్పుడు పాటలు పాడుతుంది. తన గొంతు చాలా స్వీట్‌గా ఉంటుంది. అంతేకాదు.. చాలా క్రమశిక్షణ కలిగిన పిల్ల. రాశీ ప్రవర్తనను గమనించిన స్కూల్ ప్రిన్సిపాల్ స్కూల్ డిసిప్లెన్ కమిటీ ఇంచార్జ్‌గా నియమించారు. ఇది ఆమెలో ఒక కోణం అయితే.. రాశీ ఫ్రెండ్స్ గ్యాంగ్ చాలా పెద్దది. అబ్బాయిలు, అమ్మాయిలందరినీ గుంపులుగా వేసుకొని తిరిగేది. టామ్‌బాయ్‌లా, బొద్దుగా ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వర్కవుట్లు చేసి స్లిమ్‌గా మారింది. అంత స్లిమ్‌గా ఉన్నప్పటికీ డైట్ అస్సలు ఫాలో కాదు. ఏం కావాలంటే అది తినేస్తుంది. టైమ్ దొరికితే వంటింట్లోకెళ్లి పప్పు, చపాతీలు చేస్తుంది. ఢిల్లీలో పుట్టి పెరిగినప్పటికీ రాశీ తెలుగు బాగా మాట్లాడుతుంది. స్కూల్లో ఉన్నప్పుడు రాశీఖన్నా తన సీనియర్ అబ్బాయిని ప్రేమించిందట. రోజా పువ్వు ఇచ్చి రాశీకి ఆ అబ్బాయి ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకుంది.

కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమకథ మధ్యలోనే ఆగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ వీధులు కలియ తిరుగుతూ పెరిగింది రాశీ. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే రాశీకి చాలా ఇష్టం. అందుకే బీఏ ఇంగ్లీష్ చదివింది. ఖాళీ సమయం దొరికితే పాటలు పాడడం, ప్రయాణాలు చేయడం రాశీకి చాలా ఇష్టం. షారుఖ్ ఖాన్, మహేష్ బాబుల సినిమా ఇప్పుడు రిలీజైనా ఫస్ట్‌రోజు మార్నింగ్ షో చూడాల్సిందే. ఏ మాత్రం టైమ్ దొరికినా ఫ్రెండ్స్, అమ్మానాన్నలతో కలిసి లూడో గేమ్ ఆడుతుంది. పార్టీలు అరేంజ్ చేయడంలో రాశీ దిట్ట. తన ప్రతీ బర్త్‌డేకి ఫ్రెండ్స్, తనతో పాటు నటించిన, నటిస్తున్న తారలకు ప్రత్యేకంగా పార్టీ ఇస్తుంది. హీరోయిన్ కాకపోతే రాశీ ఐఏఎస్ అయ్యేదట. చదువులో ఖన్నా టాప్ ర్యాంక్. కిక్ బాక్సింగ్ అంటే రాశీకి చాలా ఇష్టం. ఇప్పటికీ ప్రతిరోజూ జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుంది. ఎవరికీ చెప్పకుండా ఒకసారి హిమాలయాలకు వెళ్లి వచ్చింది. ఏ మాత్రం చాన్స్ దొరికినా రాశీ స్కైజంప్ చేస్తుంది. చికాగోకి ఓ షూటింగ్ నిమిత్తం వెళ్లినప్పుడు 1400 మీటర్ల ఎత్తున్న పర్వతం నుంచి కిందకి జంప్ చేసిందట. మసాలా ఛాయ్ అంటే రాశీకి చాలా ఇష్టం. ఒంటరిగా ఉన్నప్పుడు, వీలు దొరికినప్పుడు పుస్తకాలు చదవడంలో మునిగిపోతుంది.
rashi-khanna1
జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసి టీవీ చానల్‌లో ఉద్యోగం చేద్దామనుకుంటున్న రాశీఖన్నాకు మోడలింగ్ అవకాశం వచ్చింది. అ తర్వాత ఓ మ్యాగజైన్ కవర్ పేజీ మీద రాశీఖన్నా ఫొటో రావడం, సినిమాల్లో ప్రవేశించడం జరిగిపోయింది. ఎవరైనా సినిమాల్లో మీ ప్రవేశం ఎలా జరిగింది? అని అడిగితే.. అదేదో ప్రమాదవశాత్తుగా సంభవించింది అని సమాధానమిస్తుంది. టాటాస్కై డిష్ వారికి ఒక యాడ్ చేసే సమయంలో కాస్టింగ్ డైరెక్టర్ రాశీ నటనను గమనించారు. సరిగ్గా అప్పుడే బాలీవుడ్‌లో మద్రాస్ కేఫ్ సినిమాలో ఒక పాత్ర కోసం అమ్మాయిని వెతుకుతున్నారు. ఆ పాత్రకు రాశీఖన్నా పేరు ప్రస్తావనకు వచ్చింది. వెంటనే రాశీని తీసుకొచ్చి యాక్టింగ్ నేర్పించి మరీ ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రవేశించింది. తర్వాత రాశీ నటించిన సినిమాలు, వాటి సక్సెస్ గురించి మీకు తెలిసిందే. రాశీకి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. కవితలు రాస్తుంది. పాటలు కూడా పాడుతుంది. తాను మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా.. నీ శక్తిని నువ్వు గుర్తించు అంటూ రాసిన ఉత్తేజపూరితమైన కవితను వీడియో రూపంలోకి మార్చింది. ఆ వీడియోకు తానే సొంతంగా ప్రొడక్షన్ చేసింది. వాయిస్ ఓవర్ కూడా తానే ఇచ్చింది. తెలుగు సంప్రదాయం ప్రకారం పెండ్లి చేసుకోవాలని రాశీ ఖన్నా ఆశ. చూద్దాం.. ఆమె పెండ్లి మన సంప్రదాయం ప్రకారమే జరుగుతుందా? వాళ్ల సంప్రదాయం ప్రకారం జరుగుతుందా?

- ప్రవీణ్‌కుమార్ సుంకరి

1782
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles