చేతికి చూడచక్కగా..!


Sun,February 3, 2019 02:05 AM

Bracelets
ఆడపిల్లకు నుదుట కుంకుమ.. జడలో పూలు.. చేతి నిండా గలగలలాడుతూ గాజులు.. హిందూ సంప్రదాయంలో ఇవన్నీ ముఖ్యమే! ఇందులో ఒక్కొక్కటి దాని రూపు రేఖలను మార్చుకున్నాయి.. కుంకుమ కాస్త టిక్లీగా.. పూలు కాస్త క్లిప్పులుగా మారిపోయాయి.. గాజులకు ప్రత్యామ్నాయంగా బ్రాస్‌లెట్స్ వచ్చి చేరాయి.. గాజుల్లా గలగలు వినిపించకుండా.. చేతికి నిండుగా కనిపిస్తూనే.. మగువల మనసులను దోచేస్తున్నాయి.. చేతికి చక్కగా కనిపించే ఆ బ్రాస్‌లెట్స్‌పై ప్రత్యేక కథనమే ఈ జంటకమ్మ..
Bracelets1
Bracelets4

బ్యాంగిల్ బ్రాస్‌లెట్

గాజులను వేసుకొని మురిసిపోతుంటాం. ఒక్కో గాజు ఎక్కించుకోవడం కాస్త ఇబ్బందే! కానీ ఒకేసారి ఒక గుత్తిలా ఈ గాజులను తొడిగేస్తే భలే అనిపిస్తుంది కదా! చాలా గాజులు వేసుకున్నట్టు ఈ బ్రాస్‌లెట్స్ చూడమచ్చటగా ఉంటాయి. పైగా డిఫరెంట్ థీమ్స్‌తో ఈ బ్రాస్‌లెట్స్ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అన్ని వయసుల వారికి ఇవి బాగా నప్పుతాయి. అన్ని అకేషన్లకు, అన్ని డ్రెస్‌ల మీదకి ఈ బ్రాస్‌లెట్స్‌ని ధరించొచ్చు.
Bracelets3

కఫ్ బ్రాస్‌లెట్

బ్యాంగిల్ బ్రాస్‌లెట్‌కి దీనికి కాస్త దగ్గరి సంబంధం ఉంటుంది. మన చేతికి పెట్టుకొనే రింగ్‌లాగే ఈ బ్రాస్‌లెట్ కనిపిస్తుంది. కాకపోతే.. ఒకవైపు ఓపెన్ ఉంటుంది. చేతి మణికట్టు వరకే ఈ బ్రాస్‌లెట్ వస్తుంది. కావాలనుకుంటే టైట్‌గా.. లేదా వదులు చేసుకునే సౌకర్యం కూడా దీనికి ఉంటుంది. ఎక్కువ పార్టీ డ్రెస్‌ల పైకి ఈ బ్రాస్‌లెట్ పెట్టుకోవచ్చు. పురాతన కాలంలో రాజులు వీటిని ధరించేవారని ప్రతీతి.
Bracelets5

లెదర్ బ్రాస్‌లెట్

కొందరికీ బంగారం తప్ప.. ఏ మెటీరియల్ వాడినా ఎలర్జీ వచ్చేస్తుంది. కానీ బంగారం కొనే అంత స్థోమత అందరికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు బ్రాస్‌లెట్‌లాంటివి వారికి అందని ద్రాక్షే అవ్వొచ్చు. అలా కాకుండా ఉండేందుకు.. ఇదిగో లెదర్ బ్రాస్‌లెట్ వచ్చేసింది. యూత్‌ని ఈ బ్రాస్‌లెట్స్ ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు కూడా ఈ రకం బ్రాస్‌లెట్స్‌ని ఎక్కువగా ధరిస్తున్నారు.
Bracelets6

మాగ్నటిక్ బ్రాస్‌లెట్

అయస్కాంతం మనలో ఉన్న ఎన్నో రోగాలను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు నమ్ముతారు. అయితే అదే అయస్కాంతం బ్రాస్‌లెట్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. మాగ్నటిక్ థెరపీ చేయించుకునే వారికి ఇది బాగుంటుంది. అటు నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా.. ఇటు అందంగా బ్రాస్‌లెట్‌ని అలంకరించుకోవచ్చు. వీటిని ట్రెడీషన్, వెస్ట్రన్ వేర్స్ మీదకి కూడా ధరించొచ్చు.
Bracelets7

బీడెడ్ బ్రాస్‌లెట్

చవకగా దొరికే బ్రాస్‌లెట్ రకాల్లో ఇది ఒకటి. స్టోన్, ఉడెన్, ప్లాస్టిక్‌లతో ఈ బీడ్స్‌ని తయారుచేస్తారు. వీటిని తయారుచేయడం కూడా సులువుగానే అయిపోతుంది. ఇలాగే ముత్యాలవి, ప్రత్యేకమైన బ్రాస్‌లెట్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో తక్కువ ధరవీ దొరుకుతాయి. మామూలు బీడ్స్‌వి అయితే వెస్ట్రన్ డ్రెస్‌ల మీదకి, ముత్యాల్లాంటివి ట్రెడీషనల్ వేర్ డ్రెస్, చీరల మీదకి బాగుంటాయి.
Bracelets8

ఐడెంటిఫికేషన్ బ్రాస్‌లెట్

మీ పేర్లు, మీకు నచ్చిన పేర్లను, ఇతర మెసేజ్‌లను తెలియచేయడానికి అక్షరాలతో ఉన్న బ్రాస్‌లెట్స్‌ని కొనుగోలు చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, బంధువులకు కూడా గిఫ్టింగ్‌కి కూడా బాగుంటాయి. రకరకాల మెటీరియల్స్‌తో ఈ బ్రాస్‌లెట్స్ వస్తాయి. సన్నని చైన్, చిన్న చిన్న జుంకీల్లాంటివి వీటికి పెట్టి మరింత ఆకర్షణీయంగా ఈ బ్రాస్‌లెట్స్‌ని తయారుచేయించుకోవచ్చు.
Bracelets9

టెన్నిస్ బ్రాస్‌లెట్

ఫ్లెక్సిబుల్‌గా ఉండే బ్రాస్‌లెట్స్‌ని టెన్నిస్ బ్రాస్‌లెట్స్ అని పిలుస్తారు. వీటిలో చాలా రకాలు వస్తాయి. బీడ్స్‌తో, జెమ్స్‌తో, స్టోన్స్‌తో.. ఇలా రకరకాల డిజైన్లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. కాకపోతే ఎక్కువగా డైమండ్, ప్లాటినం రకాలు అమ్ముడు పోతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి కాస్ట్‌లీ అయినా ఫర్వాలేదనుకుంటే ఈ రకమైన బ్రాస్‌లెట్స్‌ని ఎంచుకోవచ్చు. అన్ని రకాల డ్రెస్‌లకి ఇది సూటవుతుంది.
Bracelets10

టర్కవైస్ బ్రాస్‌లెట్

ఇలాంటి బ్రాస్‌లెట్‌ని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ చేతికి చూడొచ్చు. వీటిని ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇష్టంగా చేయించుకుంటున్నారు. బ్లూ, గ్రీన్, పాలే బ్లూ కలర్ టర్కవైస్‌ని మధ్యలో ఉపయోగిస్తారు. దీనికి వెండి లేదా, ప్లాటినం చైన్‌ని అటాచ్ చేస్తారు. అది కూడా మధ్యలో ఉన్న స్టోన్‌కి తగ్గట్టుగా లావుగా చేయించుకోవాలి. దీన్ని ైస్టెలిష్‌వేర్‌గా వేటి మీదకైనా మ్యాచింగ్‌గా వేసుకోవచ్చు.
Bracelets11

రిస్ట్‌వాచ్ బ్రాస్‌లెట్

ఒకప్పుడు సింగిల్ బెల్ట్‌తో గడియారాలు వచ్చేవి. ఇప్పటికీ అలాగే వస్తున్నాయి లెండీ! కానీ అలా కాకుండా బ్రాస్‌లెట్‌ని, వాచ్‌ని మిక్స్ చేస్తే వచ్చిందే ఈ రిస్ట్‌వాచ్ బ్రాస్‌లెట్. దీంట్లో కూడా కఫ్ టైప్, మల్టీ స్టాండ్ బ్రాస్‌లెట్‌లు వస్తున్నాయి. గాజు మాదిరి బ్రాస్‌లెట్స్ కూడా వాచ్ బ్రాస్‌లెట్‌లో భాగమవుతున్నాయి. చిక్‌లుక్‌తో మెరిసిపోయేందుకు వెస్ట్రన్ వేర్‌తో ఈ రిస్ట్‌వాచ్ బ్రాస్‌లెట్‌ని జతచేయండి.
Bracelets12

షంభల్లా బ్రాస్‌లెట్

మిగతా బ్రాస్‌లెట్‌కి ఇది పూర్తి భిన్నం. ఎందుకంటే.. ఈ బ్రాస్‌లెట్‌లని ధరిస్తే ప్రశాంతత చేకూరుతుందని బౌద్ధమతస్తులు నమ్ముతారు. ఫ్రాన్స్ వాళ్లు దీన్ని కమర్షియల్ మార్కెట్‌లోకి విడుదల చేశారు. రంగు రంగుల్లో, నైలాన్, లెదర్ బ్రాండ్‌లో ఈ బ్రాస్‌లెట్స్‌ని తయారుచేస్తున్నారు. ఒకటి లేదా ఏడు.. బీడ్స్ లేదా జెమ్స్‌ని వీటి మధ్యలో కూర్చి ఈ బ్రాస్‌లెట్‌ని తయారుచేస్తారు.
- సౌమ్య పలుస

754
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles