అగరుబత్తితో అనారోగ్యం


Sun,February 3, 2019 01:45 AM

agarbatti
హిందూ సంప్రదాయం ప్రకారం చాలామంది ఇళ్లల్లో అగరుబత్తి, దూప్‌స్టిక్స్ వెలిగిస్తూ ఉంటారు. ఓరకంగా చెప్పాలంటే భారతీయ పూజా సామగ్రిల్లో వీటికి ప్రత్యేకస్థానం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనసు ప్రశాంతంగా ఉంటుందని కూడా వీటిని ఆశ్రయిస్తుంటారు ప్రజలు. అయితే.. ప్రతి విషయంలోనూ సత్ఫలితాలు ఎన్ని ఉంటాయో.. వాటి వెనుక దుష్ఫలితాలూ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం అగరుబత్తి, దూప్ స్టిక్స్ వెలిగించడం వల్ల ఉన్నట్టుండి దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. ఆ సమస్యను మనం తేలిగ్గా తీసుకోవద్దు. దూప్‌స్టిక్స్, అగరుబత్తులు పాలీ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, కార్బన్‌డైఆక్సైడ్‌ను కలిగి ఉంటాయి. దీని వల్ల జలుబు, దగ్గు వంటి చిన్న సమస్యలే కాదు.. ఆస్తమా, క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు కూడా చుట్టుముడతాయని చెబుతున్నారు. వాటి పొగలో విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్‌ల కారణంగా చిన్నపిల్లలు, యువకుల్లో చర్మ, కంటి సంబంధిత అలర్జీలు వస్తున్నాయి. అందుకే ఉదయం, సాయంత్రం పూట ఒకట్రెండు వెలిగిస్తే చాలని అంటున్నారు.

Dimonnds

ఆ ఊరంతా వజ్రాలే!

ఇదో చిన్న పట్టణం..! పేరు నార్డ్‌లింగెన్. జర్మనీలోని బవేరియా ప్రావిన్స్‌లో ఉందీ పట్టణం. కనీసం 20 వేల మంది కూడా లేని ఈటౌన్‌లో.. ఎక్కడ చూసినా వజ్రాలే! ఇళ్లు, ఆఫీసులు చివరకు మరుగుదొడ్లు కూడా వజ్రాలతోనే కట్టారు. ఇప్పటికీ కడుతూనే ఉన్నారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 72 వేల టన్నుల డైమండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ పట్టణం టూరిస్టులకు స్వర్గధామం. వజ్రపు కాంతుల్లో ఇంధ్రభవనాల్లా మెరిసే.. నార్డ్‌లింగెన్‌ను చూసేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు.

Gulab-Jamun

గులాబ్‌జామ్ గెలిచింది!

పాకిస్తాన్‌లో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటని ట్విట్టర్ ఓ పోటీ పెడితే.. మన గులాబ్ జామ్ మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదండోయ్.. పాకిస్తాన్ జాతీయ తీపి పదార్థంగానూ అది చరిత్రకెక్కింది కూడా. గులాబ్‌జామ్‌ను పాకిస్తానీయులు చాలా ఇష్టంగా తింటున్నారు అనేందుకు ఇదే నిదర్శనం. పాకిస్తాన్ జాతీయ తీపి పదార్థాన్ని ఎంచుకునేందుకు ట్విట్టర్ ఆన్‌లైన్ పోల్‌ను నిర్వహించింది. దీంట్లో గులాబ్‌జామ్‌కు 47శాతం ఓట్లు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో జిలేబీకి 34 శాతం, బర్ఫీకి 19 శాతం ఓట్లు పడ్డాయి. అక్కడి ప్రభుత్వం అధికారికంగా ఈ పోల్ నిర్వహించడం విశేషం.

light-house

కేర్‌టేకర్ జీతం రూ.91 లక్షలు!

ఒకటి కాదు రెండు కాదు.. ఏడాది అక్షరాలా 91.6 లక్షలు సంపాదించే అవకాశం. అది కూడా ఓ అందమైన ద్వీపంలో. ఈ బంపర్ ఆఫర్ భలే ఉంది కదూ. అయితే, ఈ ఉద్యోగం లభించే అదృష్టం మనకు లేదు. ఎందుకంటే.. ఆ ద్వీపం అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలో ఉంది. పైగా అమెరికా కోస్ట్‌గార్డ్ లైసెన్స్ ఉన్నవాళ్లకే ఆ బాధ్యతలను అప్పగిస్తారు. 1874లో కాలిఫోర్నియాలోని శాన్ పాబ్లో బేలోని ఈ చిన్న ద్వీపంలో ఈస్ట్ బ్రదర్.. లైట్ హౌస్‌ను నిర్మించారు. 1960లో ఆధునీకరించారు. దీని నిర్వహణ కోసం ప్రస్తుతం ఇద్దరు కేర్‌టేకర్స్ కావాలని ప్రకటించారు. ఇద్దరికి కలిపి ఏడాదికి రూ.91.6 లక్షల జీతం ఇస్తారు. పేరుకు ఇది లైట్‌హౌస్ కేర్‌టేకర్ ఉద్యోగమే అయినా.. అక్కడ అన్నిరకాల పనులూ చేయాలి. లైట్‌హౌస్ నిర్వహణ, అతిథులు, పర్యాటకులకు రుచికరమైన భోజనం వండాలి. అతిథులను బోట్ల నుంచి ద్వీపానికి తీసుకెళ్లి, మళ్లీ తీసుకురావాలి. ఇక్కడ ప్రత్యేక వేడుకలు, పెండ్లిళ్లకు బాధ్యతలు దగ్గరుండి చూసుకోవాలి.

Barbi-doll

60 యేండ్ల బార్బీ

ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే బొమ్మ ఏదైనా ఉందా అంటే అది బార్బీ డాల్. ఈ ఏడాది మార్చితో బార్బీ డాల్‌కి 60 యేండ్లు నిండుతున్నాయి. దేశ విదేశాల్లో ఇంత ప్రఖ్యాతి పొందిన ఈ బొమ్మ కాలానికి తగ్గట్టు తన వేషం, అలంకరణ మార్చుకుంటూ ఎంతో పోటీ ఉండే ఆటబొమ్మల పరిశ్రమలో ఇంత సుదీర్ఘ కాలం మనగలిగింది. ఇప్పటికీ 150కి పైగా దేశాల్లో ఏటా 5 కోట్ల 80 లక్షలకు పైగా బార్బీ బొమ్మలు అమ్ముడవుతున్నాయి. 9 మార్చి 1959న న్యూయార్క్‌లో నిర్వహించిన అమెరికా బొమ్మల ప్రదర్శనలో మొదటిసారి దర్శనం ఇచ్చింది బార్బీ. తర్వాత ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా బార్బీ డాల్స్ అమ్ముడయ్యాయి. మటెల్ సహ వ్యవస్థాపకుడైన రూథ్ హ్యాండ్లర్ బార్బీ బొమ్మను రూపొందించాడు.

- డప్పు రవి

1503
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles