చరిత్ర ప్రియుడు విరాట్


Sun,January 20, 2019 02:41 AM

KOHILI
70 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్ట్ సిరీస్ గెలవడానికి టీమిండియా అలుపెరుగకుండా పోరాడింది. ఆ కలను, ఆ పోరాటాన్ని తీరానికి చేర్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. బ్యాట్ పట్టి క్రీజులో ఉంటే ఆ క్రేజే వేరు. మెరుపులా గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేస్తే ఆకాశంలో మెరుపులు వచ్చి విరాట్ ఫీల్డింగ్‌ని చూసి మురిసిపోతాయి. జట్టుకు నాయకత్వం వహిస్తే విజయం వాకిట్లో వచ్చి వాలాల్సిందే. అలాంటి విరాట్ కోహ్లీలోని మరోకోణం మీకోసం..

ప్రవీణ్‌కుమార్ సుంకరి
9701557412

స్మైల్ ఫౌండేషన్ పేరుతో విరాట్ ఒక సంస్థను నడిపిస్తున్నాడు. అందులో అనాధలైన పిల్లలకు ఆశ్రయం కల్పిస్తాడు. ఇండియాలో సకల హంగులతో అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న అతిపెద్ద చారిటబుల్ సంస్థ అదే. షేన్ వాట్సన్, డివిలియర్స్‌తో పాటు ఎంతో మంది క్రికెటర్లు, సెలబ్రిటీలు ఆ పిల్లలతో గడపడానికి భారీ మొత్తంలో విరాళం ఇస్తారు. ఆ డబ్బు మొత్తాన్ని కోహ్లీ చారిటీ కోసం ఖర్చు చేస్తున్నాడు. విరాట్‌ది ఎంత పెద్ద మనసో కదా!
KOHILI1
కోహ్లీ ముద్దుపేరు చిక్కూ. ఈ పేరును విరాట్‌కి ఆయన ఢిల్లీ రంజీ టీమ్‌లో చేరిన కొత్తలో ఆ టీమ్ కోచ్ అయిన అజిత్ చౌదరి పెట్టారు. ఇంతకీ ఆ పేరు పెట్టిన సందర్భం ఏంటో తెలుసా? విరాట్ గ్రౌండ్‌కి వచ్చేటప్పుడు హెయిర్ కట్ చిన్నగా చేయించుకొని అలాగే వచ్చాడు. విరాట్ అవతారం చూసిన కోచ్ అజిత్ చౌదరికి చిన్న కుందేలు పిల్ల గుర్తొచ్చిందట. వెంటనే.. విరాట్‌ని హేయ్ చిక్కూ అని పిలిచాడు. దీంతో ఆ పేరే విరాట్ ముద్దుపేరు అయింది. విరాట్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? కరిష్మా కపూర్. చిన్నప్పటి నుంచి కోహ్లీకి కరిష్మా అంటే చాలా ఇష్టం. అంతేకాదు.. టాటూ అంటే విరాట్‌కి చాలా ఇష్టం. విరాట్ ఒంటిమీద సమురాయ్ వారియర్ టాటూ అందరూ చూసే ఉంటారు కదా! ఆ టాటూ తన ఒంటి మీద ఉంటే అదృష్టం తన వెంటే ఉంటుందని నమ్ముతాడు కోహ్లీ. అంతేకాదు గోల్డెన్ డ్రాగన్ టాటూ అంటే కూడా విరాట్‌కి చాలా ఇష్టం. కోహ్లీ ఒంటి మీద మొత్తం నాలుగు టాటూలున్నాయి. ఒకటి వృశ్చికరాశిని తెలిపే టాటూ, జపనీస్ సమురాయ్, గిరిజన తెగకు సంబంధించిన డిజైన్, నిజం గుర్తును తెలిపే చైనీస్ డిజైన్ ఇలా నాలుగు టాటూలు తన ఒంటి మీద వేయించుకున్నాడు కోహ్లీ. ధోని తర్వాత ఇండియా క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడంలోనే కాదు.. బ్రాండ్ వాల్యూలో విరాట్ ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉన్నాడు.

విరాట్‌కి అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. ఇంట్లో మటన్ బిర్యానీ వండితే చాలు ఆ రోజు ఫుల్లుగా లాగించేస్తాడు కోహ్లీ. ఖీర్ అయితే చుక్క కూడా మిగల్చకుండా తాగేస్తాడు. ఇంత ఫుడ్ లవర్ అయినప్పటికీ డైట్ విషయంలో మాత్రం కచ్చితమైన నియమాలను పాటిస్తాడు. అంతేకాదు.. అప్పుడప్పుడు వంటింట్లో గరిటె కూడా తిప్పుతాడు. ప్రపంచంలో వెల్ డ్రెస్డ్ పర్సనాలిటీ లిస్టులో బరాక్ ఒబామా పేరుతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఉంటుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు ధోని, విరాట్ కలిసి చేసిన ఇన్నింగ్స్‌ని మనం మరిచిపోలేం. ఆటలోనే కాదు.. స్నేహంలో కూడా వీరిద్దరిదీ మంచి జోడీ. ఇద్దరూ కలిసినప్పుడు సరదాగా పంచులేసుకుంటూ నవ్వులు పూయిస్తారు. విరాట్ లక్కీ నంబర్ 18. తను అండర్ 19 టీమ్‌లో చేరినప్పుడు ఇచ్చిన జెర్సీ నంబర్ 18. ఆ నంబర్ వల్లే తను సక్సెస్ అయ్యానని విరాట్ నమ్ముతాడు. ఇప్పటికీ తన జెర్సీ మీద అదే నంబర్ కంటిన్యూ చేస్తున్నాడు. విరాట్‌కి టెన్నీస్ అంటే చాలా ఇష్టం. రోజర్ ఫెదరర్ విరాట్ ఫేవరెట్ టెన్నీస్ ప్లేయర్, మ్యాచ్‌లు ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తాడు. క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ వల్ల ఏదైనా మ్యాచ్ మిస్సైతే యూట్యూబ్‌లో చూసి ఎంజాయ్ చేస్తాడు. అంత ఇష్టం విరాట్‌కి టెన్నీస్ అంటే. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకమైన తొలి వ్యక్తి విరాట్. రెండున్నర లక్షల పటిష్టమైన, సుశిక్షిత సైనికులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడమంటే మామూలు విషయం కాదు. ఆ గౌరవాన్ని తాను అందుకున్నాడు.

ఏ మాత్రం వీలు చిక్కినా విరాట్ తల్లితో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి వెళ్తాడు. విరాట్‌కి చరిత్ర అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో చదువుకునే సమయంలో చరిత్ర పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. ధోనీలాగే విరాట్‌కి కూడా కార్లంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కోహ్లీ వాళ్ల నాన్న కొనిచ్చిన బొమ్మతుపాకీతో ఆడుకుంటూ బుల్లెట్ల వర్షం కురిపించేవాడు. ఇప్పుడు బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. అనుష్క శర్మ కంటే ముందు విరాట్‌కు నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు. వారు సారా జానే డియాస్, సంజన, ఇజబెల్లే, తమన్నా భాటియా. ఇంతపెద్ద క్రికెటర్ అయినప్పటికీ విరాట్ ఇప్పటికీ టీవీ షోలు చూస్తాడు. చాలా తక్కువమందికి తెలిసిన విషయమేంటంటే.. ఏ ఆర్ రెహమాన్‌తో కలిసి విరాట్ ఒక ర్యాప్ సాంగ్‌లో గొంతు కలిపాడు. విరాట్ జంతు ప్రేమికుడు. తన దగ్గర 15 కుక్కలున్నాయి. సకల సౌకర్యాలతో వాటికి ఆశ్రయం కల్పించి ప్రేమగా పెంచుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు వాటి బాగోగులు స్వయంగా చూసుకుంటాడు.

అమీర్‌ఖాన్ సినిమాలకు ఇతరులెవ్వరూ క్లాప్ కొట్టలేదు. విరాట్‌తో తన దంగల్ సినిమాకు అడిగి మరీ క్లాప్ కొట్టించుకున్నాడు. బదులుగా కోహ్లీ తన టీమిండియా జెర్సీని అమీర్‌ఖాన్‌కి గిఫ్టుగా ఇచ్చాడు.
KOHILI2

850
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles