ఎన్టీఆర్ లక్ష్మీగా..


Sun,January 20, 2019 02:37 AM

lakshmiparvathi
దేశంలో పేరుమోసిన బందిపోటు, కలప, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ భార్యగా ముత్తు లక్ష్మీ నటించింది. ఇప్పుడు ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిగా కనిపించబోతున్నది. రెండూ కాంట్రవర్సీ సినిమాలే.. రెండూ రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించినవే. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీగా నటిస్తున్న ఆమె పేరు యజ్ఞ శెట్టి. ఈమె గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

- అజహర్ షేక్

2007లో కన్నడ సినిమా ఒండు ప్రీతియ కథేతో తెరంగ్రేటం చేసింది యజ్ఞ. 2009లో ఎద్దేలు మంజుత అనే సినిమాలో గౌరీగా నటించి స్పెషల్ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నది.

కన్నడ రేడియో ప్రసార భారతిలో జరిగిన వారధ అతిథి కార్యక్రమంలో లైవ్‌లో పాల్గొని తన మనసులోని మాటలను పంచుకున్నది.

యజ్ఞతో కలిపి వాళ్ల తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు. అందరూ ఈమెకన్నా చిన్నవాళ్లే.

తేజస్విని మదివాడ దర్శకత్వం వహించిన కన్నడ టీవీషో మజా టాకీస్‌కు నిర్మాణ బాధ్యతలు పంచుకున్నది యజ్ఞ.
lakshmiparvathi1
2016లో ఐదు సినిమాల్లో చేసి తన ప్రతిభ చాటుకున్నది.తన కెరీర్‌లో ఆ ఏడాది గొప్ప సంవత్సరంగా పేర్కొన్నది.

18 గంటల్లో 10 మంది దర్శకుల బృందం ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఓ చిత్రంలో పూజగా నటించింది యజ్ఞ.

కర్ణాటకలోని పనంబూర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నది. మంగళూరు ఎస్‌డీఎమ్ కళాశాలలో బీబీఎమ్ డిగ్రీ పూర్తి చేసింది. మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనాన్స్ పట్టా పొందింది.

యజ్ఞ సంప్రదాయ నృత్యకారిణి. కొన్ని వందల వేదికలపై డ్యాన్స్ చేసింది. ఓషన్ కిడ్స్ ప్రొఫెషనల్ ట్రూప్ ద్వారా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నది.

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వరుసగా రెండో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అతి తక్కువమందిలో యజ ఒకరు.

కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో ముత్తులక్ష్మీగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. బెస్ట్ సపోర్టింగ్ రోల్‌గా సైమా అవార్డుకు నామినేట్ అయింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. మార్చిలో విడుదలవనుంది.

2016లో వర్షధార అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు కూడా పరిచయం అయి సంవత్సరం పాటు కనిపించింది.

635
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles