ఇంటెక్


Sat,January 19, 2019 11:51 PM

గ్యాస్ చెకింగ్

GAS
కొందరి ఇళ్లల్లో ఒక్క సిలిండరే ఉంటుంది. అలాంటి వాళ్లు గ్యాస్ అయిపోతుందనుకొని ముందుగానే సిలిండర్ బుక్ చేస్తారు. కొత్త సిలిండర్ వస్తుంది. పాతదింకా ఖాళీ కాలేదు. అనవసరంగా ముందుగా బుక్ చేశామని బాధపడుతుంటారు. వారికోసం గ్యాస్‌వాచ్ కంపెనీవారు బ్లూటూత్ ఎనేబుల్డ్ ప్రొపేన్ ట్యాంక్ స్కేల్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. గ్యాస్ స్కేల్‌కి బ్లూటూత్, డిస్‌ప్లే, ఎఎఎ బ్యాటరీలు అమర్చారు. పోన్‌లో గ్యాస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. గ్యాస్‌స్కేల్‌ను బ్లూటూత్‌తో మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవాలి. స్కేల్ మీద పాత సిలిండర్ పెట్టగానే అందులో ఎంత గ్యాస్ ఉందో మొబైల్‌లో చూపిస్తుంది. దీన్ని ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఈ కామర్స్ వెబ్‌సైట్లో ఆఫర్స్‌తో కలిపి దీని ధర రూ. 2,043కి అందుబాటులో ఉంది.

మసాజ్ చేస్తుంది!

Shoulder-Massager
ఎక్స్‌పైన్ కంపెనీవారు హీటెడ్ నెక్ అండ్ షోల్డర్ మసాజర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. దీనికి బ్యాటరీ, పీసీబి వైర్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ పార్ట్స్‌ని అమర్చారు. మసాజెర్‌కి యూఎస్‌బీ కేబుల్‌తో చార్జింగ్ పెట్టవచ్చు. దీన్ని మెడకి తగిలించుకొని ఏ పనైనా చేయవచ్చు. దీని రెండు రంగుల లైట్స్ ఉంటాయి. నీలంరంగు లైట్‌ను ఆన్‌చేస్తే సాఫ్ట్‌గా మసాజ్ చేస్తుంది. బ్లూరంగు లైట్‌ని ఆన్ చేస్తే హార్డ్‌గా మసాజ్ చేస్తుంది. దీనిని ఎవరైనా వాడుకోవచ్చు. చాలా తక్కువ బరువు కలిగి ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే రోజంతా పనిచేస్తుంది. వాడిన కాసేపటికే ఉపశమనం లభిస్తుంది. ఈ కామర్స్ వెబ్‌సైట్లో ఆఫర్స్‌తో కలిపి దీని ధర రూ. 8,455 వరకు అందుబాటులో ఉంటుంది.

- వనజ వనిపెంట

440
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles