కొత్త పాట


Sun,January 20, 2019 01:44 AM

song

నాలో నీకు

సినిమా : మిస్టర్ మజ్ను
తారాగణం : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
సంగీతం : తమన్
లిరిక్స్ : శ్రీమణి
గానం : శ్రేయా ఘోషల్, కాలభైరవ


నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే
వదులుకుంటున్నా
నీ కబురింక విననంటున్న
హృదయానా
నువ్వే నిండి ఉన్నావంది
నిజమేనా
నాకే సాధ్యమా నిన్నే మరువడం
నాదే నేరమా నిన్నే కలువడం
ప్రేమను కాదనే బదులే ఇవ్వడం
ఏదో ప్రశ్నలా నేనే మిగలడం

గాయం చేసి వెళ్తున్నా
గాయం లాగ నేనున్నా
ప్రాయం ఇంత చేదై మిగిలేనా
గమ్యం చేరువై ఉన్నా
తీరం చేరలేకున్నా
దూరం ఎంత జాలే చూపినా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే
వదులుకుంటున్నా

ఓ నవ్వే కళ్లతో బ్రతికేస్తానుగా
నవ్వుల వెనక నీరై
నువ్వని చూపక
తియ్యని ఊహల కనిపిస్తానుగా
ఊహల వెనుక భారం
ఉందని తెలుపక

నువ్వని ఎవరిని
తెలియని గుర్తుగా
పరిచయం జరగనే
లేదంటానుగా

నటనైపోదా బ్రతుకంతా
నలుపైపోదా వెలుగంతా
అలుపే లేని ఆటే చాలిక
మరిచే వీలు లేనంతా
పంచేసావు ప్రేమంతా
తెంచెయ్‌మంటే
సులువేం కాదుగా

మనసులే కలవడం
వరమా శాపమా
చివరికి విడువడం
ప్రేమా న్యాయమా

టాప్ 10 సాంగ్స్ ఆఫ్ ది వీక్

1 రౌడీ బేబీ- మారి2
2 కథానాయకా - ఎన్టీఆర్
3 తందానే - వినయ విధేయ రామ
4 రెచ్చిపోదాం బ్రదర్ - ఎఫ్2
5 మనసు మరణం - పేట
6 తస్సాదియ్యా - వినయ విధేమ రామ
7 మిస్టర్ మజ్ను - మిస్టర్ మజ్ను
8 సలాం రాఖీ భాయి - కేజీఎఫ్
9 ఎంతో ఫన్ - ఎఫ్2
10 వెళ్లిపోమాకే - హుషారు

871
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles