రాశి ఫలాలు


Sun,January 20, 2019 01:26 AM

rasulu
20-1-2019 నుంచి 26-1-2019 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారైన ఉద్యోగులకు బాగా కలిసివస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు రోజువారీ క్రయవిక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్, ఇంజినీరింగ్, హోటలు, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాల్లోని వారికి ఆదాయం కలిసివస్తుంది. కానీ ఖర్చుల నియంత్రణ అవసరం. పనివారితో ఇబ్బందులు ఉండొచ్చు. పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. శుభకార్యాల ప్రయత్నాల్లో ఆటంకాలుంటాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి సమయానికి డబ్బు అందకపోవచ్చు.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. శ్రద్ధతో పనులు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో, పై అధికారులతో మనస్పర్థలు ఉండొచ్చు. వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాల్లో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారంలో కొంత అనుకూలత ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనివారితో సమస్యలుంటాయి. పెద్దల సూచనలను తప్పక పాటించాలి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు ఉంటాయి.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి వృద్ధి అవుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతా యి. సభలకు, విందులకు హాజరవుతారు. హోటలు, క్యాటరింగ్, సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి కలిసివస్తుంది. కొత్త వస్తువులు కొంటారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాల్లో ఉన్న వారు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వారమిది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో రోజు వారీ క్రయవిక్రయాల్లో ఇబ్బందులుంటాయి.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో తోటివారితో, పై అధికారులతో అనుకూలత ఉంటుంది. దీంతో ఆఫీసులో మంచి పేరు పొందుతారు. పనులు కలిసివస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, హోటలు, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలిస్తుంది. వినోదాలు, విందులలో పాల్గొంటారు. తీర్థయాత్రలు, పుణ్యనదుల స్నానాలు ఆచరిస్తారు. పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్ధలు గోచరిస్తున్నాయి.

కన్య

ఈ రాశి వారు ఈ వారంలో భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి కలిసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనారోగ్యం నుంచి విముక్తులవుతారు. ముఖ్యమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందకపోవచ్చు. పైగా అధికారుల విమర్శలకు గురవుతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అననుకూల ప్రాంతాలకు బదిలీలు ఉండొచ్చు. అనాలోచిత పెట్టుబడులు పెట్టొద్దు.

తుల

ఈ రాశి వారు ఈ వారంలో భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులను కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. అన్నదమ్ములు, బంధువులతో స్నేహంగా ఉంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు పనివారితో అనుకూలత ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారు భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు క్రయవిక్రయాల్లో లాభాలు ఉంటాయి. ఇంజినీరింగ్, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. నిత్యావసర వస్తు వ్యాపారం, హోటలు, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యగ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో తోటివారితో మనస్పర్ధలు ఏర్పడే సూచనలున్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారు భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. దీంతో మానసిక ప్రశాంతత పొందుతారు. మీ ప్రధాన గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులకు రోజువారీ క్రయవిక్రయాల్లో నష్టాలు ఉండొచ్చు. ఆలోచించ కుండా పెట్టుబడులు పెట్టొద్దు. ఉద్యోగంలో తోటి వారితో మనస్పర్ధలు వచ్చే సూచనలున్నాయి. పైఅధికారులు విమర్శించొచ్చు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉండొచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలు ఏర్పడే సూచనలున్నాయి.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభ ఫలితాలున్నాయి. వ్యవసాయ దారులకు పనివారితో అనుకూలత ఉంటుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి బాగా కలిసివస్తుంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు, నగలు కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాలు ప్రతికూలం.

కుంభం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. అనారోగ్యం ను ంచి విముక్తులవుతారు. ప్రణాళికాబద్ధం గా పనులు చేయాలి. ఆర్థిక పరిస్థితి మె రుగువుతుంది. పనివారితో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగు లకు తోటి వారితో మనస్పర్ధలు ఏర్పడొచ్చు. కోర్టు, రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు రోజువారీ క్రయవిక్రయాల్లో ఇబ్బందులుం టాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవ చ్చు. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగవు.

మీనం

ఈ రాశి వారికి ఈ వారంలో రాజకీయ పనులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు రోజువారీ క్రయవిక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. నిత్యావసర వస్తు, షేర్, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన, పుణ్యనదీ స్నానాలు ఆచరిస్తారు. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులు, నగలు కొనే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాలు, అనారోగ్యం ఉండొచ్చు.

rasulu1
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ. నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

2282
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles