ప్రభావవంతమైన మహిళ గౌరీఖాన్


Sun,January 13, 2019 12:58 AM

Gowri
2018 సంవత్సరానికి గాను ఇండియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో మొదటి 50 మందిలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్‌కు చోటు లభించింది. ఈ జాబితాను ఫార్చ్యూన్ విడుదల చేసింది. గౌరీ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఈమె సెలబ్రిటీల ఇండ్లను, రెస్టారెంట్లను అలంకరిస్తారు. దీని కోసం స్థానికంగా ఉన్న డిజైనర్స్‌తోనూ, ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తోనూ ఒప్పందాలు చేసుకున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ భార్యగా కంటే తన వ్యక్తిగత గుర్తింపే ఇష్టమంటున్న గౌరీఖాన్ ప్రస్థానం.

- మధుకర్ వైద్యుల

ఆమెకు 14 ఆయనకు 19.. అవును షారుఖ్‌ఖాన్ 19 ఏళ్ల వయసులోనే గౌరీతో తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడట.

ఢిల్లీకి చెందిన పంజాబీ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో గౌరి జన్మించారు. ఆమె తల్లిదండ్రులు సవిత, కల్నల్ రమేష్ చంద్రాచిబ్బర్‌లు. ఆమె లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది, తరువాత ఢిల్లీ, మోడరన్ స్కూల్ నుంచి 12వ తరగతి, లేడీ శ్రీ రామ్ కళాశాల నుండి బి.ఎ (హాన్స్) తో పట్టభద్రురాలయ్యింది. ఢిల్లీ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైన్‌లో ఆరు-నెలల కోర్సు పూర్తి చేసింది.

సీక్రేట్ టీనేజ్ లవ్..

1984లో గౌరీని షారుఖ్‌ఖాన్ మొదట ఢిల్లీలో చూశాడు. 1984లో స్కూల్ స్టూడెంట్స్‌గా ఉన్నపుడు స్కూల్లో జరిగిన ఒక పార్టీలో అమ్మాయిలు, అబ్బాయిలు డాన్స్ చేసారు. గౌరీ వేరే అబ్బాయి తో డాన్స్ చేస్తుండగా ఆమెను తొలిసారి చూసి, ఆమెపై మనసు పారేసుకున్నాడు షారుఖ్. తనతో డాన్స్ చేయాలని కోరితే నో చెప్పిందట. మొత్తానికి తన మాటలు, చేష్టలతో గౌరీని ఇంప్రెస్ చేసి ఆమెను ప్రేమలోకి దించాడు షారుఖ్.

పెళ్లికి నిరాకరణ

అయితే హిందూ బ్రాహ్మణ, శాఖాహార కుటుంబానికి చెందిన గౌరీ మాత్రం తమ ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి ధైర్యం చేయలేకపోయిందట. దీంతో గౌరీ తండ్రిని మెప్పించడానికి రంగంలోకి దిగిన షారుఖ్ వారి ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరై తనను తాను హిందువుగా పరిచయం చేసుకున్నాడట. షారుఖ్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ పెళ్లికి గౌరీ తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు.

విడిపోవాలనుకుని..

ప్రేమించుకుంటున్న సమయంలో గౌరీ, షారూఖ్ మధ్య చిన్నచిన్న గొడవలు కూడా జరిగాయట. ఓసారి గౌరీ షారూఖ్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. తన ఫ్రెండ్స్‌తో ముంబై వెళ్లి పోయింది. ఈ విషయం తెలిసిన షారుఖ్...తన తల్లికి ప్రేమ గురించి వివరించి ఆమె వద్ద డబ్బు తీసుకుని ముంబై వెళ్లి అన్ని బీచ్‌లు వెతికాడట. చివరకు అక్షా బీచ్‌లో గౌరీని కలిశాడు. ఈ సంఘటనతో షారుఖ్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో గౌరీకి అర్థం చేసుకుంది. షారుక్-గౌరీల మధ్య ఉన్న ప్రేమ విషయం అర్థం చేసుకున్న గౌరీ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు. అక్టోబర్ 25, 1991న ఢిల్లీలో వీరి వివాహం జరిగింది.

కెరీర్..

గౌరీ కేవలం షారుఖ్‌ఖాన్ భార్యగానే కాకుండా... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. 2002లో గౌరీ, షారుఖ్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌తో పాటు, రెడ్‌చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థను ప్రారంభించారు. దీనికి గౌరీ కో-చైర్‌పర్సన్‌గా ఉంది. ఈ బ్యానర్‌లో ఇప్పటి వరకు 16 వరకు చిత్రాలను నిర్మించారు. 2010లో హృతిక్ భార్య సుసానె రోషన్ భాగస్వామ్యంతో సొంతంగా ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేసింది.

ఒకరికి ఒకరు

షారుఖ్, గౌరీ ఎంతో అన్యోన్యంగా, ప్రేమ పూరితంగా, రొమాంటిక్‌గా, ఒకరి అభిరుచులకు, అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఆదర్శవంతమైన దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారికి ఆర్యన్, సుహాన, అబ్రరాం అనే ముగ్గురు పిల్లలున్నారు.


Gowri1

మీడియాలో..

గౌరీఖాన్ మీడియాకు దాదాపు దూరంగా ఉండడానికే ఇష్టపడుతారు. అయితే మీడియా మాత్రం మోస్ట్ ైస్టెలీష్ ఉమెన్ ఇన్ బాలీవుడ్ అని ఆమెను కీర్తిస్తుంటుం ది. 2008లో ఆమె భారతీయ లైఫ్‌ైైస్టెల్ మ్యాగజైన్ వోగ్‌ఇండియా కవర్‌పేజీపై దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆ మ్యాగజైన్ ఆమెను ఫస్ట్ లేడీ ఆఫ్ బాలీవుడ్‌గా కీర్తించింది. ఆ తరువాత ఆమె కూతురు సుహానఖాన్‌తో కలిసి అదే మ్యాగజైన్‌పై 2012లోనూ కనిపించింది. తన భర్త షారుఖ్‌తో కలసి కరణ్‌జోహర్ ఏర్పాటు చేసిన హెచ్‌డీఐఎల్ కల్చర్‌వీక్-2009లో ర్యాంప్‌పై నడిచింది.

1003
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles