పాత కట్టు.. తీసేట్టు!


Sun,January 6, 2019 01:06 AM

Saress
చీరకట్టులోనే.. ఏదో కనికట్టు ఉంది.. కానీ ఎప్పుడూ ఒకే కట్టుతో ఉంటే బోరింగే!లంగా.. జాకెట్.. చీర.. ఎప్పుడూ కాంబినేషన్ ఇదేనా?వీటిలో ఏదీ లేకున్నా చీరకట్టు లేదనుకుంటారు.. జాకెట్ లేకున్నా దానికి రీప్లేస్‌మెంట్ ఉంటుంది.. అసలు లంగా లేకుండా చీరకట్టొచ్చునని అనుకున్నారా?ఇప్పటిదాకా అనుకోకపోతే..
ఇప్పుడు అనుకోండి.. పాతకట్టును కాస్త పక్కన పెట్టి.. అవే పాత చీరల్లో కొత్తగా ఎలా మెరిసిపోవచ్చునో.. కొత్త కట్టుతో ఎలా అందంగా తయారవచ్చునో చూసుకోండి..

- సౌమ్య పలుస

Saress1

టాప్ టీషర్ట్..

చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ దొరుకడం లేదా? దానికి బదులు మీరు అపురూపంగా చూసుకునే ఏదైనా టీషర్ట్‌తో ఆ చీరను జతచేయండి. కాటన్‌లాంటి చీరలకైతే ఈ ైస్టెల్ మరింత బాగుంటుంది. క్యాజువల్ లుక్ కోరుకునే వాళ్లు మామూలు కట్టుతో ఉంచి.. కాస్త పల్లూను మాత్రం డిఫరెంట్‌గా వేసుకునేందుకు ట్రై చేయండి. హై పోనిటెయిల్, హై హీల్స్ వేసుకుంటే అదిరిపోతారు.

Saress2

స్టయిలిష్ ప్యాంట్

చీర కట్టేందుకు లంగాలే కావాల్సిన అవసరం లేదని ఫ్యాషనిస్టులు రుజువు చేస్తున్నారు. లెగ్గింగ్, జెగ్గింగ్, జీన్స్, పలాజో, ప్యాంట్.. ఏదైనా వేసుకొని దాని మీద చీర చుట్టేయొచ్చు. అయితే రెగ్యులర్ కట్టులో కాకుండా ధోతీ ైస్టెల్.. హాఫ్ ైస్టెల్ చీరల్లా కట్టినప్పుడు చీరతో పాటు ఆ ప్యాంట్స్ కూడా ఎలివేట్ అవుతాయి. షిఫాన్, షీర్, జార్జెట్‌లాంటి చీరలు ఈ ప్యాంట్‌ల మీదకి వేసుకోవచ్చు. కాక్‌టెయిల్ ఇయర్‌రింగ్స్, స్ట్రాపీ శాండిల్స్, బాక్స్, క్లచ్‌తో టోటల్ లుక్‌ని మార్చేసుకోవచ్చు.

Saress3

క్రేజీ క్రాప్‌టాప్..

లెహంగాల మీదకి.. జీన్స్ మీదకే కాదు.. చీరల మీదకు కూడా క్రాప్‌టాప్ ట్రై చేయొచ్చు. ఎలాంటి ఫ్యాబ్రిక్ చీరలకైనా ఈ టాప్‌లను మ్యాచ్ చేయొచ్చు. కాకపోతే చీర, టాప్ ఒకే రంగు కాకుండా కాంట్రాస్ట్ అయితే అదిరిపోతుంది. ఇండో-వెస్ట్రన్ ైస్టెల్‌గా కనిపించే ఈ లుక్‌తో కాక్‌టెయిల్ పార్టీలు, ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లాంటి వాటికి ఈ లుక్‌తో వెళ్లిపోవచ్చు. ఫంకీ జువెలరీ అయితే వీటి మీదకి బాగుంటాయి.

Saress4

చలి స్పెషల్..

చలి వణికించేస్తుంది. చీర కట్టి.. దాని మీద లాంగ్ జాకెట్ వేసుకోవడం అంత బాగోదు అనుకుంటారు. కానీ మామూలు బ్లౌజ్‌కి బదులు.. మ్యాచింగ్.. చిన్న కోట్‌ని ధరిస్తే ఎలా ఉంటుంది? అటు చలి తగ్గుతుంది.. ఇటు స్టయిలిష్‌గానూ కనిపిస్తారు. చలికాలంలో జరిగే పెండ్లిళ్లు.. పార్టీలు వేటికైనా ఈ కోట్‌లను ధరించొచ్చు. పల్లూ ఈ కోట్ పై భాగం నుంచి రావాల్సి ఉంటుంది. డిఫరెంట్ ఇయిర్‌రింగ్స్‌తో మీరే స్టయిల్ స్టేట్‌మెంట్ ఇవ్వొచ్చు.

Saress5

కెవ్వు.. కేప్

రెగ్యులర్ లుక్ బోర్‌కొడితే కాస్త డిఫరెంట్ కోసం దీన్ని ట్రై చేయొచ్చు. బ్లౌజ్ కుట్టించి.. దాని మీద నుంచి నెట్ కేప్ వేస్తే అదిరిపోతుంది. పెండ్లికూతుళ్లు.. పెండ్లి సందళ్లలో కొన్ని అకేషన్స్‌ల్లో కేప్ ధరిస్తే బాగుంటారు. క్రేప్ సారీల మీదకి ఈ కేప్ బాగా నప్పుతుంది. అయితే బ్లౌజ్ మాత్రం కాస్త హెవీ వర్క్ ఉన్నదయితే బాగుంటుంది. ఒకవేళ బ్లౌజ్ సింపులయితే.. డిజైనర్ నెట్ తీసుకొని దాన్ని కేప్‌గా కుట్టించుకోండి.

Saress6

అందమైన అంగర్క

కొత్త ఫ్యాషన్ పోకడలకు బాలీవుడ్‌లో ఆద్యులెవరంటే.. వెంటనే సోనమ్‌కపూర్ పేరు చెబుతారు. ఈ ైస్టెల్ రాజుల కాలం నాటిదే అయినా చీరతో మ్యాచ్ చేసి వేసుకున్నది మాత్రం సోనమే! మొగల్ రాజుల డ్రెస్సింగ్‌ని ప్రేరణగా తీసుకొని దీన్ని డిజైన్ చేశారు. బ్లౌజ్‌కి బదులు ఈ కోట్‌ని వేసుకోవాలి. కొంగును లోపల నుంచి తీయాల్సి ఉంటుంది. హెవీ బార్డర్ ఉన్న చీరలకు ఇలాంటి ైస్టెల్ బాగా నప్పుతుంది.

Saress7

భలే.. బికినీ

బ్లౌజ్‌కి బదులు బికినీ టాప్ వేసుకోవాలి. కింద చిన్న స్కర్ట్ ధరించి ఆ తర్వాత చీర చుట్టాలి. ఈ స్టయిల్‌తో గ్లామర్ ప్రపంచాన్ని ఏలేయొచ్చు. బీచ్ పార్టీలు, కాక్‌టెయిల్ పార్టీలకు ఇలా చీరను చుట్టుకోవచ్చు. డిన్నర్ డేట్స్‌కి కూడా ఈ స్టయిల్ బాగుంటుంది. నలుగురిలో డిఫరెంట్‌గా కనిపించాలనుకుంటే ఈ స్టయిల్ ఓకే. స్టిఫ్‌గా ఉండే చీరలు కాకుండా కాస్త జారే ఫ్యాబ్రిక్స్ ఉన్న చీరలు అంటే.. షిఫాన్, జార్జెట్‌లాంటి చీరలు కడితే బాగుంటారు.

Saress9

బోరింగ్ కాకుండా

చీరకట్టుతో విసిగిపోతే.. సాసీ శారీ మాక్సీ డ్రెస్ అని ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. కుచ్చిళ్లు లేకుండా ఉండే ఈ చీరలు అటు ఫ్యాషన్‌గానూ, ఇటు ట్రెడీషనల్‌గానూ కనిపిస్తాయి. కుచ్చిళ్లు ఉండవు కాబట్టి నడుస్తున్నప్పుడు పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు. కాకపోతే ఈ శారీ విత్ మ్యాకీ డ్రెస్ వేసుకున్నప్పుడు బెల్ట్, హై హీల్స్ వేసుకోవడం మాత్రం మరచిపోవద్దు.

Saress8

వెరైటీ కట్టు..

కాంటెంపరరీ లుక్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఇది బాగా సూటవుతుంది. చీర కట్టాలంటే.. లోపల శారీ పెట్టికోట్(లంగా) కావాలి. ఒక్కోప్పుడు లంగా లేకుండానే చీరను కట్టేయొచ్చు. ధోతీ స్టయిల్‌లో చీరను చుట్టేసి.. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవాలి. పైన కొప్పు, ట్రెడీషనల్ జువెలరీని వేసుకుంటే నలుగురిలో మరింత కొత్తగా కనిపించడం ఖాయం.

Saress10

సరదాగా స్కార్ఫ్

చీర ఎలా కట్టినా.. హెవీగా నగలు వేసేస్తే సెట్ అవుతుందనుకుంటారు. కానీ ఏ నగలు లేకుండా మెడ చుట్టూ అందమైన స్కార్ఫ్ చుట్టేస్తే అందం రెట్టింపవుతుంది. ప్లెయిన్ చీరల మీదకు ప్రింటెడ్ స్కార్ఫ్‌లను వేసుకోవాలి. దాన్ని కూడా టైలాగా కడితే ఎలాంటి జువెలరీ అవసరముండదు. పైగా చలికాలం కాబట్టి వెచ్చగా కూడా ఉంటుంది.

519
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles