డ్రీమ్ స్టార్స్.. ఓ ఇంటివారయ్యారు


Sun,January 6, 2019 12:46 AM

వారంతా నిన్నటి వరకు డ్రీమ్ గర్ల్స్.. ఎందరో యువకుల కలల రాకుమారులు.. ఇప్పుడు ఆ కలల్ని చెదరగొట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు గతేడాది చాలామంది డ్రీమ్ హీరోయిన్స్ పెండ్లిళ్లు చేసుకున్నారు. బంధాలను అల్లుకొని బాధ్యతలను పంచుకోవడానికి ఏడడుగులు వేశారు. 2018లో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన హీరోయిన్‌లు ఎవరు? వాళ్ల్ల లిస్ట్ ఓసారి చూద్దామా?

- అజహర్‌షేక్
Priyanka-Chopra

ప్రియాంక చోప్రా

పుట్టినల్లు బాలీవుడ్, మెట్టినిల్లు హాలీవుడ్ అయింది ప్రియాంకకు. డ్రీమ్ గార్ల్స్ ప్రియాంక చొప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లాడింది. బాలీవుడ్‌కు బైబై చెప్తుందని ప్రచారం జరుగుతున్నా.. సినిమాలు చేస్తదా? వదిలేస్తదా? అన్నది మాత్రం ఇంకా సందేహంగానే ఉన్నది. వయసులో చిన్నోడైన నిక్‌ను పెళ్లి చేసుకొని వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. 2018లో ఎక్కువగా చర్చించుకున్న అంశాల్లో ప్రియాంక పెళ్లి ఒకటి.

SWATHI

కలర్స్ స్వాతి

కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి. మా టీవీలో కలర్స్ అనే కార్యక్రమంలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. బుల్లి తెర నుంచి వెండితెరకు వచ్చి పలు ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటించింది. కుర్రకారు గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న కలర్స్ స్వాతి అకస్మాత్తుగా పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించింది. పైలట్‌గా పనిచేస్తున్న వికాస్‌ను పెళ్లి చేసుకొని ఇంటర్నెట్‌లో ఫొటోలు షేర్ చేసింది.

NEHA-DHUPUA

నేహా దూపియా

2018 సంవత్సరంలో ఇది పెద్ద కాంట్రవర్సివెడ్డింగ్. పెద్ద చర్చనీయాంశం అయింది. పెళ్లికి ముందు అంగద్ బేడీతో కలిసి ఉన్నది. పెళ్లి కాకముందు గర్భం దాల్చింది. ఆ విషయం అందరికీ తెలియడంతో పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించింది. మే నెలలో పెళ్లయింది. నవంబర్‌లో పాప పుట్టింది. ఈ విషయంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నా.. పెళ్లి చేసుకున్న నేహా దూపియా మాత్రం భర్తతో బిందాస్‌గా ఉన్నది.

SHRIYA

శ్రియా శరణ్

సడెన్ షాక్ ఇవ్వడం అంటే ఇదేనేమో.. ప్రశాంతంగా ఉన్న కుర్రకారు గుండెల్లో ఒక్కసారిగా తుపానొచ్చేలా చేసింది శ్రియా. గ్లామరస్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి క్యారెక్టర్లను చేసి ఎప్పటికీ తనపై అభిమానం ఉండేలా చెరగని ముద్ర వేసింది. తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని ఫొటోలను పబ్లిక్‌లోకి వదిలింది. అంతకు ముందు ఆమె మీద ఉన్న రూమర్లను అన్నింటినీ తన పెళ్లితో కొట్టేసింది.

DEEPIKA

దీపికా పదుకొనే

పద్మావత్‌గా నటించినా, పడుచు పిల్లలా కనిపించినా తన అందంతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. దీపికా పదుకొనే సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు కూడా అంత బాధపడి ఉండరు ఆమె ఫ్యాన్స్. రణ్‌బీర్ కపూర్‌ని పెండ్లి చేసుకున్నప్పుడు ఎంతమంది ఉపవాసాలున్నారో, ఎంతమంది దేవదాసులయ్యారో. దీపికా పెండ్లి చేసుకుంటుందని ఎంతమంది అభిమానులు బాధపడ్డారో కానీ ఆమె మాత్రం తెగ ఆనందపడింది.

bhavana

భావన

మహాత్మ, ఒంటరి, హీరో, నిప్పు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది మల్లు హీరోయిన్ భావన. పెండ్లికి ముందు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నదో పాపం. కిడ్నాప్ తర్వాత జరిగిన డ్రామా ఆమెను చాలా ఇబ్బందుల పాలు చేసింది. చివరకు కథ సుఖాంతం అయింది. తన స్నేహితుడు, నిర్మాత నవీన్‌తో మూడు ముళ్లు వేయించుకొని ఏడడుగులు నడిచింది. పెండ్లికి ముందు అనుభవించిన కష్టాలను మరిచి పెండ్లితో మురిసిపోయింది.

SONAM

సోనమ్ కపూర్

తండ్రి అనిల్ కపూర్ వారసత్వాన్ని తీసుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చేసిన సినిమాలు తక్కువే అయినా ఎక్కువ కాంట్రవర్సీలు మూటగట్టుకున్నది. సినిమాలో ఎంటర్‌టైన్ చేసినదానికంటే ఎక్కువ ప్రత్యేక ఫొటోషూట్‌లు, హాట్ ఎక్స్‌పోజింగ్‌లు చేసి జనాల్ని ఆకట్టుకున్నది. తన చిన్ననాటి స్నేహితుడు ఫ్యాషన్ డిజైనర్ అహుజాను పెండ్లి చేసుకొని సోనమ్ కే అహుజా అని పేరు మార్చుకున్నది.

ఇన్నాళు ఈ అందమైన బామలను చూసి మురిసిపోయాం. ఇప్పుడు మర్చిపోవాలి. ఒక ఇంటికి కోడళ్లుగా మారారు. ఒక వ్యక్తి భార్యగా జీవిత భాగస్వామి అయ్యారు. తెరమీద కాదు. నిజ జీవితంలోనే పెండ్లిళ్లు చేసుకున్నారు. వీళ్లంతా పెండ్లిళ్ల నిండు ముత్తైదువులు. తర్వాత సినిమాల్లో కనిపించినా అంత క్రేజ్ ఉండొచ్చు. ఉండకపోవచ్చు.

439
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles