జీవితమిచ్చే అవకాశం


Sun,January 6, 2019 12:35 AM

JIVEETHAMICHE-AVAKSHAM
ప్రపంచాన్నీ మనుషుల్నీ కలగలిపే అద్భుతాలు సమత్వం.. అభేదం. ఇవి అనూనయంగా వర్ధిల్లుతుంటేనే జీవన మనుగడ సాధ్యపడుతుంది, మనిషి ప్రపంచంలో తనకన్నా భేదమైనదేదీ లేదని విశ్వసించి సుఖదుఃఖాలలో సమత్వం చూడాలి. జయాపజాలలో సమత్వం చూడాలి. బాహ్య ప్రపంచం నా ఆధీనంలో లేదు. నా అంతర్గత ప్రపంచం మాత్రం నా ఆధీనంలోనే ఉంది. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులెదురైనా నా జీవన పోరాటం ఆగనివ్వననీ ప్రతీ మనిషి నిర్ధారించుకునే జీవించాలి. దృఢమైన మనోనిశ్చయం కావాలి. జీవన పోరాటానికి ఎంత శ్రద్ధ కావాలంటే, ఎంత కష్టపడాలంటే, ఎంతగా మనసును కఠినంగా మార్చుకోవాలంటే.. తల్లిదండ్రులు దూరమైనా, ఆనవాళ్లెవరూ తనతో లేకపోయినా, సమాజంలో తన కోసం సహాయం అందించే వారెవరూ ముందుకురాకపోయినా అసలు బతుకడానికి ఆసరానే లేకపోయినా సరే, జీవనపోరాటం మానుకోవడానికి వీలులేదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఒక్క సదవకాశం నిర్భయ సందేశమై తప్పక వస్తుందంటోందీ చిన్న కథ.

- ఇట్టేడు అర్కనందనా దేవి

జీవితం ప్రతీ ఒక్కరికీ రెండో అవకాశాన్ని తప్పక ఇస్తుంది. గతాన్ని గురించీ, నిన్నటి రాత్రి నీవు వదులుకున్న రత్నాల గురించీ మర్చిపో. నీ చేతిలో మిగిలున్న రత్నాన్ని జీవితంలో వెలుగులు నింపుకునేందుకు జీవించమని చెప్పి వెళ్ళిపోతాడు.

ఒకానొక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. చిన్నప్పడే అతని తల్లిదండ్రులు దూరమయ్యారు. అయిన వారెందరున్నా ఆదరించి దగ్గరకు తీసేవాళ్లే కరువయ్యారు. ఆటవిడుపులూ, అమాయకత్వం, ఆనందంతో గడపాల్సిన బాల్యాన్ని తిండి గడవడమే కష్టంగా గడపాల్సి వచ్చింది. క్రమశిక్షణ నేర్పే విద్యను అందుకోలేని స్థితికి చిరునామా కావాల్సి వచ్చింది అతని జీవితం. కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, కడుపునిండా తినడానికి కావలసినంత సంపాదించుకోవడానికి పనిలేక, ఎవరినైనా సహాయం అడగాలన్న విషయమైనా తెలియకనే చిన్నతనం నుంచి యవ్వనంలోని వచ్చేశాడా వ్యక్తి.

పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయాయి. చుట్టూ ఉన్న ప్రపంచం సంపదలనూ, సౌకర్యాలనూ, ఆకర్షణలనూ చూస్తుంటే ఆ వ్యక్తికి జీవిత సత్యమేంటో అర్థం కావడం లేదు. ఒకవైపు సంపదలూ, ఆనందాలూ, మరోవైపు దారిద్య్రం, కష్టనష్టాలు.. ఏంటీ జీవితమనే ప్రశ్న ఉదయించిందతనిలో. చిన్నపాటి నుంచీ అంతులేని కష్టాలే తప్ప, సుఖాన్ని అనుభవించే అవకాశమూ రాలేదు. దురదృష్టం తప్ప అదృష్టానికి నోచుకునే రోజంటూ రాదా.. అనే ఎదురు చూపులోనే జీవితం ముగిసిపోతుందేమోనన్న భావన అతనిలో విరక్తిని పెంచింది.

సమాజంలో బతికే విధానం తెలియక, పని చేసుకొని బతుకడానికి దారి తెలియక రోజూ చస్తూ జీవించే కాన్న చావే మేలని నిర్ణయం తీసుకొని ఒకనాటి రాత్రి ఊరిని దాటి అడవి మార్గంలో అలసిపోయేదాకా నడుస్తూ నడుస్తూ సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడు. తన అడుగు అక్కడే ఆగిపోవడం, సముద్రంలో కొట్టుకుపోవడమే సరైనదనే సంకేతంలా అనిపించిందతనికి. అలా సముద్రం ఒడ్డున కూర్చుండిపోయాడు. ఆరోజు అమావాస్య. ఆనాటి చీకటి తన బతుకులోని చీకటిని తలపించింది. సముద్రపు అలలు ఎగసి పడిపోతున్నాయి. వాటిని చూసినపుఎపడు అతనికి అనిపించింది. నా జీవితంలో మాత్రం కష్టాలనేవి వస్తూనే ఉన్నాయి గానీ పోవడం లేదని చాలా బాధపడతాడు.

ఆ వ్యక్తి గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈనాటి చీకటి పోయేలోపు అయితే కష్టాలైనా పోవాలి. లేదంటే నేనైనా పోవాలని అనుకున్నాడు. ఉధృతమైన సముద్రపు అలల వెల్లువలా అతనిలో ఆలోచనలు మనసును తొలిచేస్తున్నాయి. చేతికందిన రాళ్ళను ఒక్కొక్కటిగా సముద్రంలోకి విసిరేస్తూ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను గర్తు చేసుకుంటున్నాడు. అతనిలో గతం గురించిన బాధ తప్ప, భవిష్యత్తుపై ఆశ లేదు. అలా రాత్రంతా సముద్రలోకి రాళ్ళను విసుకుతూనే ఉన్నాడు. రాత్రి గడిచిపోయింది. తన చేతిలోని చివరి రాయిని విసురుతుండగా తెల్లారింది. సూర్యుని కిరణాల వెలుగు అతని చేతిలో ఉన్నది రాయి కాదు రత్నమని అతనికి తెలిసేలా చేసింది, రాత్రంతా అతను సముద్రంలోకి విసిరేసినవి రాళ్ళు కాదు రత్నాలని అర్థమైంది. అనందం, ఆందోళన ఒకేసారి కలిగాయతనిలో . రాత్రంతా అన్ని రత్నాలను రాళ్లనుకొని సముద్రంలోకి విసిరేసినందుకు బాధపడాలా? చేతిలో ఒక్కరాయైనా మిగిలి ఉన్నందుకు ఆనందిచాలా అర్థం కావడం లేదా వ్యక్తికి.

ఇంతలో అక్కడికి ఒక సాధువు వచ్చ సంధిగ్ధావస్థిలో ఉన్న ఆ వ్యక్తి ద్వారా జరిగింది తెలుసుకొని ఇది నీకొక మరో అవకాశం. జీవితం ప్రతీ ఒక్కరికీ రెండో అవకాశాన్ని తప్పక ఇస్తుంది. గతాన్ని గురించీ, నిన్నటి రాత్రి నీవు వదులుకున్న రత్నాల గురించీ మర్చిపో. నీ చేతిలో మిగిలున్న రత్నాన్ని జీవితంలో వెలుగులు నింపుకునేందుకు వినియోగించుకొని జీవితాన్ని చివరిదాకా జీవించమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి తనకంది వచ్చిన జీవితావకాశాన్ని సరిగ్గా వినియోగించుకొని ఆదర్శ వ్యక్తిగా సమాజంలో నిలదొక్కుకున్నాడు.

416
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles