నెట్టిల్లు


Sun,January 6, 2019 12:21 AM

వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు మారుతుంటాయి. బైక్ నడుపడం. ప్రేమించాలన్న ఆలోచనలు, వారి కోసం ఏమైనా చేయడం. కొన్ని ప్రేమలు పెళ్లి వరకూ వెళ్తాయి. మరికొన్ని మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటాయి. పిల్లలు పుట్టాక వారి మీద ప్రేమ ఉంటుందా లేదా అనేది మాటల్లో చెప్పలేం. కొన్నింటినీ చేతల రూపంలోనే చూపిస్తాం. అలాంటి లవ్‌స్టోరీస్ కొన్ని ఈవారం మీ నెట్టింట్లో..

scooties-and-beauties

స్కూటీస్ & బ్యూటీస్

Total views 77,333+ (డిసెంబర్ 29 నాటికి)
Posted On : Dec 22, 2018
దర్శకత్వం: శృతి మైడాల
నటీనటులు : నందిని, వైజయంతి, ఆదిత్య, సందీప్, రంజిత్
బైక్ నడపడమంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. కానీ నడుపడం రాదు. తన స్నేహితుల దగ్గర ఎలా నడుపాలో నేర్చుకుంటుంది. తన సంతోషాన్ని ఎందుకు పాడుచెయ్యాలే అని ఒకరోజు అమ్మాయి అన్నయ్య బైక్ కీస్ ఇస్తాడు. స్టార్ట్ చేయడంతోనే ఎదురుగా ఉన్న గోడను ఢీ కొడుతుంది. అమ్మాయి ఫ్రెండ్ భయపడి నేను ఆటోలో వస్తా నువ్వు స్కూటీలోనేరా అని చెప్పి వెళ్లిపోతుంది. అలా చాలాసార్లు ఎదురుగా వస్తున్న వారితో తిట్లు తినడం, పట్టించుకోకుండా వెళ్లిపోవడం జరుగుతుంది. సినిమా చూసి తరువాత స్కూటీ పార్కింగ్ దగ్గరికి వెళ్తుంది. దాని పక్కనే చాలా బైకులు పెట్టుంటారు. స్కూటీని వెనక్కి తీయడానికి కూడా వీలు లేకుంటుంది. నానా తంటాలు పడి ఎలాగోలా తీస్తుంటే వెనుక వస్తున్న ఒక అతనికి స్కూటీ తగులుతుంది. నడుపడం రాకుంటే ఎందుకు నడుపుతారో అని గొనుక్కుంటూ స్కూటీని బయటకి తీస్తాడు అబ్బాయి. అమ్మాయి కామ్‌గా ఉంటుంది. కొంత దూరం వెళ్లేసరికి అబ్బాయి బైక్ స్కిడ్ అయి పడిపోతాడు. అప్పుడు అమ్మాయికి టైం వచ్చింది. నాకు సరిగా నడపడం రాకపోవచ్చు కానీ పడకుండా నడుపడం వచ్చు అని కాలర్ ఎగరేస్తుంది. స్టోరీ చిన్నదే అయినా ఫన్నీగా ఉంటుంది. మీరూ చూసెయ్యండి.

nako-prema-katha

నాకో ప్రేమ కథ

Total views 21,202+ (డిసెంబర్ 29 నాటికి)
Posted On : Dec 22, 2018
దర్శకత్వం: సాయి రవితేజ పోలిన
నటీనటులు : ప్రదీప్, అమిత, ఆశిష్ రాజ్, మోహన్ సాయి, టి. చాణిక్య, యోగిని, మనోహర్ కొమ్మలపాటి, తేజ్ సీమకుర్తి, సూరజ్, దేవేంద్ర, వెంకట్ యాలవర్తీ, నిఖిల్ కుమార్ రెడ్డి.
శౌర్యా అనే అబ్బాయికి చిన్నప్పుడే అమ్మానాన్నలు దూరమవుతారు. సుహాస్‌తో స్నేహం ఏర్పడుతుంది. ఒకరిని విడిచి ఒకరుండలేనంతగా మారిపోతారు. తల్లిదండ్రుల ప్రేమ తెలియని శౌర్య వచ్చే అమ్మాయిలో అమ్మని చూసుకోవాలనుకుంటాడు. అలాంటి అమ్మాయి కోసం ఎదురుచూస్తుంటాడు. అమ్మాయి రానే వచ్చింది. తన పేరు కోమలి. తనతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తుంటాడు శౌర్య. దగ్గరికి వెళ్లగానే ఏం చెప్పాలో మరిచిపోతాడు. కోమలి ముందు అపార్ధం చేసుకొని తరువాత శౌర్యతో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. శౌర్య ప్రపోజ్ చేస్తాడు. ఉదయం వరకు టైం తీసుకుంటుంది కోమలి. ఆ రోజు ఇంటికి వెళ్తుండగా తన ఫ్రెండ్ సుహాస్ కోమలితో లవ్‌లో ఉన్నాడని తెలుస్తుంది. చాలా బాధపడుతాడు. ఉదయం లేచి రోడ్డున నడుస్తుంటే అతని మీది నుంచి వాహనాలు వెళ్తుంటాయి. అర్థంకాలేదా.. శౌర్యా చనిపోయాడు. అతణ్ని చంపింది ఎవరు? కోమలి, సుహాస్ నిజంగానే ప్రేమించుకుంటున్నారా? అనేది సస్పెన్స్. కాన్సెప్ట్ బాగానే ఉన్నా అంతగా ఆకట్టుకోలేక పోయింది.

endless-love-story

ఎండ్‌లెస్ లవ్ స్టోరీ

Total views 18,399+ (డిసెంబర్ 29 నాటికి)
Posted On : Dec 22, 2018
దర్శకత్వం: సూర్య పినిశెట్టి
నటీనటులు : సాగర్ కొత్తన్న, ఉత్తర రెడ్డి, సహస్ర్తా రెడ్డి, శశిధర్ స్వామి, సూర్య, లక్కీ, నవీన్.
ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురు చూస్తుంటాడు. అంతలో అమ్మాయి రానే వస్తుంది. నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని తడబడుతూ చెప్తాడు అబ్బాయి. నాకూ నువ్వంటే ఇష్టమే అని ఇన్‌డైరెక్టుగా చెప్తుంది అమ్మాయి. ఇద్దరూ కలిసి తిరగడం, అన్ని విషయాలు చెప్పుకోవడం. ప్రేమంటే ఇంత బాగుంటుందా అనిపించేలా ఉంటారు ఆ జంట. ఇంతకు ముందు ఎవరినీ ప్రేమించలేదు. అందుకే ఈ లవ్ జర్నీ ఇంత బాగుంది. యూ ఆర్ మై ఫస్ట్ లవ్ అని అమ్మాయితో అబ్బాయి చెప్తాడు. ఆ మాట చెప్పడమే ఆనంద్‌కి శాపంగా మారింది. ఆనంద్‌ది ఫస్ట్ లవ్ తను కాదని అమ్మాయికి తెలుస్తుంది. తనని కూడా అలానే వదిలేస్తాడని అనుమానం వస్తుంది. దీంతో డైరెక్టుగా ఆనంద్‌నే అడుగుతుంది. అతను లేదంటాడు. మరి సంధ్య ఎవరని అడుగుతుంది. అది కేవలం అట్రాక్షన్ అని అంటాడు. మరి నేను కూడా తనలా అట్రాక్షనేమో అంటుంది. అట్రాక్షన్ దగ్గరున్నప్పుడే ఉంటుంది. కానీ, ప్రేమ ఎంతకాలం దూరంగా ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా అలానే ఉంటుంది అంటాడు. ఎట్రాక్షనో, ప్రేమో అన్న కన్ఫూజ్‌తో కలిసుండడం నావల్ల కాదు. క్లారిటీ వచ్చే వరకు ఎదురుచూద్దాం అంటుంది అమ్మాయి. ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ.

asha

ఆశ

Total views 12,004+ (డిసెంబర్ 29 నాటికి)
Posted On : Dec 24, 2018
దర్శకత్వం: ఆర్యన్ శాండీ
నటీనటులు : బేబి మాన్యత, జై చంద్ర, శరణ్య జంజమ్, బోసు కంచర్ల, మాస్టర్ కౌశిక్, సంధ్యారాణి.
ఆశకు అమ్మానాన్నలు ఉన్నా లేనట్టే. పిల్లల్ని కనాలి కాబట్టి కన్నారు ఆశ తల్లిదండ్రులు. ఆశ బాగోగులు చూసుకోవడానికి ఒక ఆయాని పెడుతారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఈగోతో ఎవరి పనుల్లో వారు ఉంటారు. ఆయా సరిగా చూసుకుంటుందా ఆశను అంటే అదీ లేదు. పాపకి పెట్టాల్సిన తిండి, ఇవ్వాల్సిన డబ్బులన్నీ తానే తీసుకుంటుంది. ప్రేమతో మాట్లాడే వారు కరువయ్యారు పాపకి. ఆయా కొడుకు చంటి అనే అబ్బాయి పరిచయం అవుతాడు. వాడితోనే ఆడుకోవడం, అల్లరి చేయడం చేస్తుండేది. ఒకరోజు చంటి ఆటపట్టించాడని తల్లికి చెప్తుంది ఆశ. ఆ తర్వాత ఏమైంది అనేది ఆసక్తికరం. పాపకి ప్రేమ దొరక్కా తానే ఒక ఫ్రెండ్‌ని క్రియేట్ చేసుకుంటుంది. పాపతో కొంత సమయం కూడా కేటాయించకపోతే పాప ఎప్పటికీ మీకు దక్కదని డాక్టర్ చెబుతాడు. మీరు కోట్లు సంపాదించి పాపకి ఇవ్వనవసరం లేదు. వీలైనంత ప్రేమని పంచండి అని డాక్టర్ చెప్పిన మాటలకు తల్లిదండ్రులు చాలా బాధపడుతారు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రేమ లేకుంటే ఎలా ఉంటుందో చాలా బాగా చూపించాడు డైరెక్టర్.

వనజ వనిపెంట

359
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles