రాశి ఫలాలు


Sun,January 6, 2019 01:49 AM

6-1-2019 నుంచి 12-1-2019 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి చంద్రస్థితి అనుకూలంగా ఉంది. అయినా ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. నూతన వస్తువులు, వస్త్రాలు కొంటారు. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, హోటలు, క్యాటరింగ్ వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అయినా దీర్ఘకాలిక పెట్టుబడులు, భూముల కొనుగోలు విషయంలో ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వ, కార్పొరేటు ఉద్యోగంలో ఉన్న వారు, భవన నిర్మాణ రంగంలో ఉన్నవారు, రోజువారీ వ్యాపారంలో ఉన్నవారు, పనివారితో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి రోజువారీ క్రయవిక్రయాల వల్ల లాభాలున్నాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. న్యాయవాద, ఇంజినీరింగ్, భవన నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో మంచి సంబంధాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వాహన కొనుగోలు సూచనలు న్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చదువు, శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచిపేరు పొందుతారు. పెద్దల సూచనలు తప్పక పాటించాలి.

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారి దాదాపు అన్ని ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. భార్యా పిల్లలతో వాగ్వివాదాలు ఉండొచ్చు. సమయానికి భుజించకుండా, అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. శుభకార్యాలు, ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక సమస్య వల్ల ముఖ్యపనులు వాయిదా వేసుకోవల్సి రావొచ్చు. ప్రారంభించిన ప్రతి పనిలోనూ ఆలస్యం గోచరిస్తున్నది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో ప్రభుత్వ, కార్పోరేటు ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. రోజువారీ క్రయవిక్రయా వల్ల లాభాలున్నాయి. పెట్టుబడులు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంజినీరింగు, న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా సంతృప్తి ఉంటుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారు పెద్దల సలహాలను పాటిస్తారు. పుణ్యక్షేత్రాలు, నదీస్నానాలు ఆచరిస్తారు. భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. సమయానికి భుజిస్తారు. సరదాగా కాలయాపన చేస్తారు. ఉద్యోగస్తులకు తోటి వారితో మనస్పర్థలు ఏర్పడొచ్చు.ప్రారంభించిన పనులు ఆటంకాలతో ముందుకు సాగుతాయి. చదువు, ఉద్యోగం, శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించక పోవచ్చు. పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. సమయానికి చేతికి డబ్బు అందకపోవచ్చు. అనవసర ప్రయాణాలు ఉంటాయి. వాహనాల వల్ల ఖర్చులుంటాయి.

కన్య

స్వయంవృత్తి, వ్యాపారంలో ఉన్న ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాల వల్ల లాభాలుంటాయి. న్యాయవాద, వైద్యవృత్తిలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. హోటలు, క్యాటరింగ్, సంగీత, సాహిత్య, సినిమా, పత్రికా రంగాల్లో ఉన్న వారికి ఈ వారం కలిసివస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనారోగ్యం నుండి విముక్తులవుతారు. షేర్ వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

తుల

ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగం కలిసివస్తుంది. ఆఫీసులో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయంలో కార్యకర్తల సహాయ సహకారాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు తొందరగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తులవుతారు. ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. మంచి పేరు సంపాదిస్తారు. వ్యవసాయ దారులకు పనివారితో అనుకూలత ఉంటుంది.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారు భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా, పత్రికా రంగాల్లో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్ వ్యాపారంలో ఉన్న వారికి తాత్కాలిక లాభాలుంటాయి. దీర్ఘకాలిక, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. న్యాయవాద, వైద్య, ఇంజినీరింగ్ వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రారంభించిన పనులు మెల్లిగా ముందుకు సాగుతాయి. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించక పోవచ్చు.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారి ప్రధానగ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటా రు. విందులకు, వినోదాలకు హాజరవుతారు. వస్త్ర, ఫ్యాన్సీ, హోటలు, క్యాటరింగ్ వ్యాపారాల్లో ఉన్న వారికి కలిసి వస్తుంది. వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాల వల్ల నష్టం ఉండొచ్చు. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. వాహనాల వల్ల ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారు ప్రారంభించిన పనులు పూర్తి చేయగలుగుతారు. నలుగురిలో మంచి పేరు పొందుతారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఉన్నత విద్య, శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారికి సమస్యలు ఉన్నా, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వాహనాల వల్ల కలిసి వస్తుంది. స్నేహితులు, బంధువులతో మంచిమాట ఉంటుంది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. సమావేశాలకు, వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. సమయానికి భుజిస్తారు.

కుంభం

ఈ రాశి ఉద్యోగులకు ఆఫీసులో మంచి పేరు వస్తుంది. దీంతో ఆదాయం పెరుగుతుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో రోజువారీ క్రయవిక్రయాల వల్ల లాభాలు ఉంటాయి. నిత్యావసర వస్తు, వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలిస్తుంది. పనివారితో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తులవుతారు. సంగీత, సాహిత్య, సినిమా, పత్రికా రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు రాకపోవచ్చు.

మీనం

ఈ రాశి వారు ఈ వారం భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్నవారికి కలిసివస్తుంది. హోటలు, క్యాటరింగ్, ఫ్యాన్సీ, వస్త్ర, కూరగాయలు, ఫల, పుష్ప, నిత్యావసర వస్తు, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహాయసహకారాలు అందుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు మంచి పేరు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.
rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి ఎం.ఎస్సీ. నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

1594
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles