25 గంటల ఉత్కంఠ ఆచూకి కోసం అతిపెద్ద గాలింపు


Sun,December 30, 2018 12:55 AM

YSR
మధుకర్ వైద్యుల
సెల్ : 80966 77409

అది.. సెప్టెంబర్ 2, 2009..


ఆంధ్రప్రదేశ్‌లో భారీవర్షాలు కురుస్తున్న సమయం.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం కోసం బయలుదేరారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 8.20 గంటలకు బేగంపేటలోని క్యాంపు కార్యాలయం నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరారు.వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు వారించారు. అయినా వినలేదు. హెలికాప్టర్ ఎక్కారు.పదినిమిషాల్లో హెలికాప్టర్ గాల్లోకి లేచింది. సమయం 9.15 కావస్తున్నది. వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టరు నుంచి సమాచారం ఆగిపోయింది. పావుగంట తర్వాత హెలికాప్టర్ ప్రకాశం-కర్నూలు సరిహద్దుల్లోని రోళ్లపెంట సమీపంలో ప్రయాణిస్తున్నట్లు వైర్లెస్‌కు సిగ్నల్స్ అందాయి. కానీ, ఐదు నిమిషాలు గడిచాయో లేదో 9.35 : హెలికాప్టర్‌కు శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగం మధ్య అనుసంధానం పూర్తిగా తెగిపోయింది.

గంట క్రితం.. ఇక్కడ ఇదెందుకుంది?


బేగంపేట విమానాశ్రయంలో బెల్ 430 హెలికాప్టరును చూసి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అక్కడి అధికారులను, సిబ్బందిని అడిగారు. అగస్టా ఏమైంది? అని అడిగారు. అగస్టా సర్వీసులో ఉంది.. అందుకే దీనిని సిద్ధం చేశాం అని అధికారులు బదులిచ్చారు. దీనితో ఇబ్బందేమీ లేదు కదా? అని వైఎస్ అడిగారు. ఏమీ లేదు.. అంతా బాగుంది సర్ అని వాళ్లు భరోసా ఇచ్చారని ఆ రోజు ఆయనను హెలికాఫ్టర్‌లో ఎక్కించేందుకు వచ్చిన ఇతర సిబ్బంది వెల్లడించారు.

నల్లమల అటవీప్రాంతంలో హెలికాఫ్టర్ నుండి సంబంధాలు తెగిపోవడంతో అధికార యంత్రాంగంలో కలవరం మొదలైంది. వెంటనే ఆయన ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. గంటలు గడుస్తున్నాయి. ఆయన జాడ మాత్రం చిక్కలేదు. వర్షం కారణంగా ఆయన ఎక్కడో ఓ చోట ల్యాండ్ అయి ఉంటారని అంతా ఊహించారు. కానీ ఎలాంటి సమాచారం లేదు. దీంతో రాష్ట్రప్రభుత్వం అన్ని ముఖ్య విభాగాలకూ, ముఖ్యమంత్రి వైఎస్ ఆత్మీయులకూ సమాచారం అందించారు. సీఎం హెలికాప్టర్ మిస్సింగ్ అంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడంతో రాష్టవ్య్రాప్తంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది.

సీఎం హెలికాప్టర్ మిస్సింగ్‌పై రకరకాల ఊహాగానాలు. నల్లమల మావోయిస్టులకు అనువైన ప్రాంతం కనుక వారే పేల్చివేసి ఉంటారని ఉహాగానాలు. మరోవైపు ఆయనను వారే కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో వైఎస్ కర్నూలు జిల్లాలో దిగారంటూ, చిత్తూరుకు రోడ్డుమార్గంలో వెళుతున్నారంటూ పుకార్లు. ప్రజల్లో ఎడతెగని ఉత్కంఠ. మరికొంత సమయానికే ముఖ్యమంత్రి క్షేమం అంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం.
గాలింపు చర్యలను పర్యవేక్షించేందుకుగాను నాటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొంతమంది కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చేరుకుని అక్కడి నుంచే వైఎస్ ఆచూకి కోసం అధికారులకు సూచనలిస్తూ హెలికాప్టర్ జాడ కనుగొనేందుకు ప్రయత్నించారు. వారిలో బొత్స సత్యనారాయణ, రఘవీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి తదితరులున్నారు.

మిస్ అయిన హెలికాప్టర్‌లో వైఎస్‌తో పాటు సీఎం కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ముఖ్య భద్రతాధికారి వెస్లీ, గ్రూప్ పైలెట్ భాటియా, కో పైలెట్ ఎం.సత్యనారాయణరెడ్డిలు ఉన్నారు. ఎవరి మొబైల్ ఫోన్లూ పనిచేయకపోవడంతో వారి ఆచూకీ కనుగొనడం అత్యంత కష్టమైంది. ఎత్తైన, దట్టమైన చెట్లతో పాటు మావోయిస్టులకు సేఫ్ షెల్టర్ జోన్‌గా పేర్కొనే నల్లమల అడవి పైనుంచి సుమారు రెండు వేల అడుగులకు పై నుండి వెళ్లే హెలికాప్టర్‌ను మావోయిస్టులు పేల్చే అవకాశం ఉందా? ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వారు టార్గెట్ చేసుకుని లక్ష్యాన్ని ఛేదించగలరా? ఒకవేళ హెలికాప్టర్ కూలి ఉంటే? అందులో ఉన్నవారు బతికే అవకాశాలున్నాయా? జవాబులేని ప్రశ్నలెన్నో..

YSR1
అది నల్లమల అడవుల ఫొటోలను చిత్రీకరించింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి సమీపంలో ఉన్న మేరీగంగా రిజర్వాయర్‌లో గుర్తుతెలియని లోహపదార్థాల నుంచి సుఖోయ్ విమానానికి రాడార్ సంకేతాలు అందాయని చెబుతున్నారు.

వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ దొరకలేదంటూ మధ్యాహ్నం 3.45 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య వెల్లడించారు. అలాగే సీఎం బృందం ఆచూకీ కోసం వెదకాలని నల్లమల సమీప జిల్లాల ప్రజలకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. ఐదు హెలికాప్టర్లతో నల్లమల అటవీ ప్రాంతాన్ని ముమ్మరంగా గాలించినా దొరకని హెలికాప్టర్ జాడతో రాష్ట్రంలో ఉత్కంఠ పెరిగింది. ఒకవైపు పోలీసులు.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పరిసర ప్రాంతాల ప్రజలు, చెంచులు ఇలా ఎవరికి తెలిసిన మార్గంలో వారు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.

YSR2
ఎత్తైన, దట్టమైన చెట్లతో పాటు మావోయిస్టులకు సేఫ్ షెల్టర్ జోన్‌గా పేర్కొనే నల్లమల అడవి పైనుంచి సుమారు రెండు వేల అడుగులకు పై నుండి వెళ్లే హెలికాప్టర్‌ను మావోయిస్టులు పేల్చే అవకాశం ఉందా? ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వారు టార్గెట్ చేసుకుని లక్ష్యాన్ని ఛేదించగలరా?

ఒకానొక దశలో ఎన్నో గాలివార్తలు గుప్పుమన్నాయి. ఉమ్మడి రాష్ట్ర ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. అనుక్షణం ఉత్కంఠ. ఆయా చానల్స్ తమకు తెలిసిన చిన్న సమాచారాన్ని కూడా పెద్దది చేసి చూపిస్తూ వైఎస్ మరణించారని, శవం దొరికిందని ఇలా ఎన్నెన్నో కథనాలను వండి వడ్డిస్తున్నాయి. ఏ టీవీ చానల్ ఎలాంటి సమాచారం అందిస్తుందో అన్న ఆతృత అన్ని వర్గాల్లో నెలకొంది. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు గాంధీభవన్‌కు, క్యాంపు అఫీసుకు చేరుకుంటుండడంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. రాష్ట్ర పోలీసులు సహా.. కేంద్ర బృందాలు కూడా రంగంలోకి దిగాయి.

కేంద్రం ఆధీనంలోని.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ, కేంద్ర రక్షణ శాఖ, కేంద్ర అంతరిక్ష పరిశోధనల సంస్థ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖలను సమన్వయపరచి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కోసం గాలింపును ప్రారంభించింది. సాయంత్రం ఆరున్నరకల్లా అత్యంత అధునాతన రాడార్ వ్యవస్థ కలిగిన సుఖోయ్ యుద్ధ విమానం నల్లమల అడవులను జల్లెడ పట్టింది. జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ప్రత్యేక విమానంతో గాలింపు చేపట్టింది. అది నల్లమల అడవుల ఫొటోలను చిత్రీకరించింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి సమీపంలో ఉన్న మేరీగంగా రిజర్వాయర్‌లో గుర్తుతెలియని లోహపదార్థాల నుంచి సుఖోయ్ విమానానికి రాడార్ సంకేతాలు అందాయని చెబుతున్నారు. ఇది బహుశా హెలికాప్టర్ కావచ్చని భావిస్తున్నారు. మరోవైపు నల్లమల నుంచి ప్రవహించే కృష్ణా నదిలో చమురు జాడలు కనిపించాయని అక్కడి జాలర్లు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో హెలికాప్టర్ చిక్కుల్లో పడి ఉంటుందేమోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.అర్ధరాత్రి నుంచి రంగంలోకి దిగి నల్లమల అణువణువునూ శోధించి ఫొటోలు తీయగల సుఖోయ్ యుద్ధ విమానం తీసిన 41 ఫొటోల్లో విలువైన సమాచారం లేదని నిర్థారణ అయింది. అప్పటికీ అర్థరాత్రి పన్నెండు దాటింది. గాలింపు నిలిపివేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆచూకి తెలియకపోవడంతో ప్రజలలో ఉత్కంఠ, ఆందోళన మరింత ఎక్కువైంది.
(తరువాయి వచ్చేవారం)

2232
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles