నెక్‌లైన్‌ల కనికట్టు!


Sun,December 30, 2018 12:19 AM

Samantha
చీరల మీదకు.. ఏడు వారాల నగలు దిగేసుకోవచ్చు..కానీ జాకెట్ నెక్‌లైన్‌ని బట్టి.. నగలను ఎంపిక చేసుకోవాలని అనుకున్నారా? చుడీదార్‌లు..వెస్ట్రన్ ైస్టెల్స్వే సినప్పుడు.. నగలను ఎంపిక చేసుకోవడం కష్టమే కదా మరి..మీ నెక్‌లైన్‌కి తగ్గట్టుగా.. మీ జువెలరీ ఉండాలని గుర్తించండి.. అప్పుడే మీరు ైస్టెల్ ఐకాన్‌గా మారొచ్చు.. ఏ నెక్‌లైన్‌కి.. ఎలాంటి నగలు వేసుకోవాలి.. వాటికి పెండెంట్‌లు ఎలా ఉండాలో తెలుసుకోండి.

- సౌమ్య పలుస

షర్ట్స్

షర్ట్‌లకు, కాలర్ ఉన్న డ్రెస్‌లు, జాకెట్‌లు వేసుకున్నారనుకోండి. అప్పుడు మెడ కప్పుకొని పోతుంది. రకరకాల నెక్లెస్‌లు వాటి మీదకి కూడా వేసుకోవచ్చు. కంఠం మీద చొకర్ ఉండి చిన్న లాకెట్ ఉండేలా చూసుకోండి. లేకపోతే సన్న చైన్ ఉండి.. లాకెట్ పెద్దగా ఉంటే చైన్‌ని కాలర్ కిందకు నెట్టి.. లాకెట్ కనిపించేలా అయినా నగలను ధరించవచ్చు.

స్ట్రాప్‌లెస్ డ్రెస్

ట్రెడీషనల్ డ్రెస్‌ల మీదకే కాదు.. వెస్ట్రన్ ైస్టెల్ డ్రెస్‌లకి కూడా తగినట్టు జువెలరీ సెట్ చేసుకోవాలి. అప్పుడే పర్‌ఫెక్ట్‌గా అనిపిస్తారు. స్ట్రాప్ లెస్ డ్రెస్‌లకి ఎలా జువెలరీ మ్యాచ్ చేసుకోవాలనే సందేహమా? అయితే.. మెడను అతుక్కునేలా, బ్రాస్‌లెట్ మోడల్ నెక్లెస్‌లను ధరిస్తే బాగుంటుంది.

స్కూప్ నెక్‌లైన్

గుండ్రంగా ఉండే నెక్‌లైన్‌లను ఇలా పిలుస్తారు. కాస్త బ్రాడ్‌గా ఉండే నెక్‌లైన్ ఇది. దీనికి తగ్గట్టుగా నెక్లెస్‌లు కూడా మెడ దగ్గరకు హెవీగా ఉండేలా చూసుకోవాలి. మొత్తం స్టోన్స్ లేదా వెనుక చైన్ ఉండి పెద్ద పెద్ద స్టోన్స్‌తో నిండిపోయిన నెక్లెస్‌లయితే సరిగ్గా సూటవుతాయి. మెడ భాగం పూర్తిగా కప్పే విధంగా నెక్లెస్ ఉండాలన్నమాట.
Samantha1
టర్టిల్ నెక్స్ చలికాలం ఒళ్లు మొత్తం కప్పుకునేలా డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు నగల మాటేమిటి? మెడపై వరకు కోట్లు, జాకెట్లు కవర్ చేసేస్తే నగలేం వేసుకోవాలనే సందేహం వద్దు. పెద్ద పెద్ద తాళ్లు ఉన్న నగలు, లాంగ్ చైన్‌లు, లేయర్లుగా ఉండే బంగారు నగలైన, బీడ్స్‌తో లేయర్లు వచ్చిన నగలైనా వేసుకొని ైస్టెల్ ఐకాన్‌గా మారొచ్చు.

అసమెట్రికల్ నెక్‌లైన్స్

ఈ నెక్‌లైన్‌కి ఒక సెపరేట్ డిజైన్ అంటూ ఉండదు. అది ఎలాగైనా ఉండొచ్చు. కొన్నిసార్లు వన్ షోల్డర్ నెక్‌లైన్‌లు ఉన్న డ్రెస్‌లు ఉన్నవాటికి ైస్టెలిష్‌గా ఉండే నగలను ఎంచుకోవాలి. క్లాత్, బీడ్స్ ఉన్న నగలను ఎంచుకోవచ్చు. అవి కూడా పెద్దగా కాకుండా నెక్ దగ్గరకు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ నెక్లెస్ ఏం లేకుండా చెవులకు పెద్దగా జుంకాలు పెడితే మరింత బాగుంటారు.

కోవల్ నెక్స్

ఇలాంటి నెక్‌లైన్‌లు.. డ్రెస్ అందాన్ని రెట్టింపు చేయడానికే. పెద్దగా నగల అవసరం లేకుండా దీనితోనే కవర్ చేసేయొచ్చు. పెద్ద జుంకాలను పెట్టుకుంటే సరిపోతుంది. నగలు వేసుకోవాలనుకుంటే మాత్రం.. మెడ దగ్గరకు ఉండేదయినా పర్వాలేదు. లేకపోతే.. సన్నని చైన్ ఉండి ఈ డిజైన్ కిందకి పెండెంట్ వచ్చే మాదిరి నెక్లెస్‌లయితే సరిగ్గా సెట్టవుతాయి.

వీ- షేప్డ్ నెక్‌లైన్స్

ఇలాంటి నెక్ లైన్ ఉన్న డ్రెస్‌లను తక్కువగా కుట్టించుకుంటారు. అలాంటి వాటికి అదే షేప్‌లో ఉన్న నగలు వేసుకుంటే పర్‌ఫెక్ట్ మ్యాచింగ్‌గా ఉంటుంది. మోనోలితిక్ పెండెంట్ ఉన్న పెండెంట్స్ ఉపయోగించొచ్చు. తలకిందులైన త్రిభుజం షేప్‌లో ఉన్న నగలు కూడా చూడముచ్చటగా కనిపిస్తాయి. చిన్న హ్యాంగింగ్స్‌లా ఉండే నెక్‌లెస్‌లు కూడా నప్పుతాయి.

బోట్ నెక్‌లైన్స్

మీ భుజాలు బ్రాడ్‌గా ఉంటే బోట్ నెక్‌లు బాగుంటాయి. పైగా ఈ నెక్‌ని కాస్త జారినట్టుగా వేస్తే వెస్ట్రన్ ైస్టెల్ లుక్‌తో మెరిసిపోవచ్చు. ఇలాంటి టాప్స్, డ్రెస్‌లు వేసుకున్నప్పుడు పొడవుగా ఉండే చైన్లు, బీడ్స్ ఉన్న చైన్లు, సన్న చైన్ ఉండి పెద్ద పెండెంట్ ఉండే నగలు వేసుకోవాలి. బీడ్స్‌లాంటివి రెండు మూడు వరుసలు ఉన్నవి వేసుకున్నా కరెక్ట్‌గా సూటవుతాయి.

స్కేర్ నెక్‌లైన్స్

పార్టీవేర్‌లకు, చుడీదార్‌లకు కామన్‌గా కనిపించే నెక్ లైన్ ఇది. ఇలాంటి నెక్‌లైన్‌తో పాటు స్లీవ్స్, స్లీవ్‌లెస్ కూడా ట్రై చేస్తుంటారు. ఎలాంటి వాటికైనా సన్నని చైన్ మధ్యలో చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం.. ఈ రెండింటిలో ఎలాంటి పెండెంట్స్ ఉన్న నగలైనా ఈ డ్రెస్‌ల మీదకి సరిగ్గా సూటవుతాయి. ఒకే పెండెంట్‌లా కాకుండా.. అటాచ్డ్ పెండెంట్స్ ఉన్నా సరే ఇలాంటి నెక్‌లైన్స్ మీదకి వేసుకోవచ్చు.

జువెలరీ ఎంపిక

- ఫెయిర్‌గా ఉన్నారా? అయితే మీ రంగుకు తగ్గట్టుగా మీ నగల రంగు ఎంపిక ఉండాలి. అంటే.. సిల్వర్, స్టీల్, కాప్రోనికెల్, ప్లాటినం లాంటివి ఎంచుకోవాలి. చామనఛాయ ఉన్న వాళ్ల గోల్డ్, కాంస్య రంగు ఉన్న నగలు బెటర్.
- మీ కండ్లను బట్టి కూడా నగలలో ఉండే రాళ్లను ఎంపిక చేసుకోవాలని తెలుసా? మీ కళ్లు కాస్త డార్క్‌గా ఉంటే.. ముదురు రంగు రాళ్లు ఉన్న జువెలరీ వేసుకోండి. ఒకవేళ లేత రంగు ఉంటే.. మరీ ఎక్కువ ముదురు రంగు రాళ్లు లేకుండా మీ నగలను ఎంచుకోండి.
- సన్నగా ఉన్నవాళ్లకు మినియేచర్ ఇయరింగ్స్ బెస్ట్ చాయిస్. ముద్దుగా, బొద్దుగా ఉండేవాళ్లు ఎలాంటి వాటినైనా ఎంచుకోండి.
- ఇయరింగ్స్, నెక్లెస్, రింగ్, బ్రాస్‌లెట్ ఇలా పూర్తి సెట్ ధరిస్తున్నారా? అయితే.. కచ్చితంగా క్వాలిటీ ఉన్న జువెలరీ సెట్ మీ దగ్గర ఉన్నప్పుడే వీటన్నిటినీ ధరించండి. ఒకే రకంగా లేని జువెలరీ ఉంటే మీ లుక్ మొత్తం మారిపోతుంది. రెండు రకాలు ఏవైనా సేమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

356
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles