గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Aug 29, 2020 , 23:05:20

రాశి ఫలాలు - 30-08-2020 నుంచి 05-09-2020 వరకు

రాశి ఫలాలు - 30-08-2020 నుంచి 05-09-2020 వరకు

మేషం

ఈ వారం కలిసివస్తుంది. చివరలో ఖర్చులు ఉంటాయి. భోజన సౌఖ్యం ఉంటుంది. ఆహార, ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులు, ఆత్మీయుల చేయూత లభిస్తుంది. సేవా కార్యక్రమాలకు డబ్బు వెచ్చిస్తారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొంటారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. చాకచక్యంతో పనులు నిర్వర్తిస్తారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు. ప్రశాంతంగా పనులు పూర్తి చేస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులు పెరగవచ్చు. సమస్యలను అధిగమిస్తారు. ఆర్ధికస్థితి గతంలో కంటే మెరుగవుతుంది. వృత్తి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అభిరుచికి తగిన భోజనం చేస్తారు. 
వృషభం

వారం మధ్య అధిక ఖర్చులు ఉంటాయి. ఆహారం పట్ల జాగ్రత్త పడండి. అందరితో సంతోషంగా గడుపుతారు. ఇంటా బయట సంతృప్తిగా ఉంటారు. సోదరులతో సత్సంబంధాలు పెంచుకొంటారు. పనులలో ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఫలితాలు అనుకూలిస్తాయి. మంచివారితో పరిచయాలు పెరుగుతాయి. నలుగురిలో మంచిపేరు లభిస్తుంది. పట్టుదల, సహనంతో పనులు పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రుల సహాయాన్ని వినియోగించుకొంటారు. వ్యాపారంలో లాభాలు స్థిరంగా ఉంటాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఏకాగ్రతతో సాధన చేయడం వల్ల విద్యార్థులు చదువులో బాగా రాణించే అవకాశం ఉంటుంది. సంప్రదాయాలు, ఆచారాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. పని భారం పెరుగుతుంది. అందరితో బాధ్యతాయుతంగా ఉండండి. 
మిథునం

వారం ప్రారంభంలో అప్రమత్తత అవసరం. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పనిభారంతోపాటు బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆహార సూత్రాలు పాటిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. సమయస్ఫూర్తితో ఆలోచనలను ఆచరణలో పెడ్తారు. కార్యసాధనలో దీక్షా దక్షతలు ప్రదర్శిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. పదిమందితో జరిగే కార్యక్రమాలలో పాల్గొనేప్పుడు అంటువ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు పాటించడం అవసరం. ప్రయాణాలలో అలసట ఉంటుంది. ఖర్చులు ఉండవచ్చు. పెద్దల సలహాలను గౌరవిస్తారు. భక్తి, ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. మీకున్న మంచిపేరువల్ల పనులు నెరవేరుతాయి. ఆలోచనలను నలుగురితో పంచుకొంటారు. 
కర్కాటకం

వారం మధ్యలో అధిక ఖర్చులు వుంటాయి. మిగతా రోజులు అనుకూలం. ఇంట్లో అందరితో సంతృప్తిగా ఉంటారు. అందరితో స్నేహభావంతో మెలగుతారు. పెద్దల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలను అమలు చేస్తారు. ఉన్నత భావాలు గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. పనులను ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పూర్తి చేస్తారు. దైవిక సేవా కార్యక్రమాలలో శ్రద్ధాసక్తులతో  పాల్గొంటారు.  నూతనోత్సాహంతో పనులు చేస్తారు. తలచిన పనులు అనుకూలిస్తాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఆర్థిక సర్దుబాట్లు అవసరం. వృత్తిద్వారా వచ్చే రాబడిలో పెరుగుదల ఉండక పోవడమేకాక ఖర్చులు పెరుగుతాయి. 
సింహం

వారాంతంలో అధిక ఖర్చులు వుంటాయి. మిగతా రోజులు అనుకూలంగా వుంటాయి. ప్రణాళికాబద్ధంగా, యుక్తితో పనులు చేస్తారు. అనుకూల ఫలితాలను పొందుతారు. నలుగురికి సహాయం చేస్తారు. సాంప్రదాయ జీవనశైలితో ఉంటారు. పెద్దలను గౌరవిస్తారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో సామరస్యంగా మెలగుతారు. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేసుకొంటారు. గతంలో కంటే భూమి వ్యవహారాలు, వాహనాల వ్యాపారాలు అనుకూలంగా ఉండవచ్చు. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. రుణంగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. పనులను శ్రద్ధతో చేస్తారు. విద్యార్థులకు ఉన్నత చదువులకు వెళ్లడానికి ఇది మంచి సమయం. 
కన్య

వారాంతంలో కొంత ఎక్కువ ఖర్చులు వుంటాయి. మిగతా రోజులు సామాన్యంగా గడుస్తాయి. కొంత అనుకూలంగా ఉన్నా ప్రధాన గ్రహాల స్థితి ప్రతికూలంగా ఉంది కనుక, జాగ్రత్త అవసరం. పనులలో సహనం, పట్టుదల చూపితే అనుకూల ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో అభిప్రాయ బేధాలు ఉండవచ్చు. స్నేహంగా ఉండటానికి ప్రయత్నించండి. అనవసర విషయాలలో తలదూర్చకుండా ఉండటం మంచిది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. పనులు ప్రారంభించే ముందు మంచి చెడు ఆలోచన అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆహార సూత్రాలు పాటిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. పనులలో సంతృప్తి ఉంటుంది. ఉద్యోగంలో నైపుణ్యం చూపుతారు. 
తుల

వారం ప్రారంభంలో అధిక ఖర్చులు ఉండవచ్చు. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. పరిస్థితులకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. ఆస్తుల వివాదాలకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులు, వ్యాపార భాగస్వాముల సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఆదాయం స్థిరంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అధికారుల ఆదరణతో స్థిరత్వం సాధిస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆప్తులనుండి మంచి సలహాలు పొందుతారు. ఆలోచనలను ఆచరణలో పెడ్తారు. వాహనాల పనులు నెరవేరుతాయి. ప్రేమానురాగాలతో సంతోషంగా ఉంటారు. పేరు ప్రతిష్టలుగల వ్యక్తుల సాహచర్యంతో కార్యసాఫల్యతను సాధిస్తారు. పై అధికారులు, సహోద్యోగులతో సామరస్యంగా ఉంటారు. వృశ్చికం

వారం మధ్యలో ఎక్కువ ఖర్చులు వుంటాయి. మిగతా రోజులు అనుకూలంగా వుంటాయి. ఉత్తేజంతో పనులు చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలలో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వస్త్ర వస్తువులను కొంటారు. పొదుపు చేస్తారు. పెట్టుబడులపై మనసు నిలుపుతారు. డబ్బు సమయానికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. చదువులో రాణిస్తారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరత్వానికి పట్టుదలతో పనిచేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం వుంటుంది. ప్రభుత్వ రాజకీయ కోర్టు పనులలో అనుకూలం. బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. 
ధనుస్సు

వారం మధ్యలో వృథా ఖర్చులు వుంటాయి. జాగ్రత్త వహించండి. మిగతా రోజులు సామాన్యంగా గడుస్తాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది. పనులలో ఆలస్యం కావచ్చు. ద్విగుణీకృత ప్రయత్నం, శ్రమ అవసరం. స్థిరమైన ఆలోచనలతో పనులు చేస్తారు. ప్రతి చిన్న పనికి సమయం వెచ్చించవలసి రావచ్చు. రావలసిన డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం అవుతుంది. ఆదాయ మార్గాలపై మనసు పెట్టాలి. వ్యాపార విధానంలో మార్పు చేసుకోవాలి. వృథా ఖర్చులు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆర్థిక సర్దుబాట్లు చేసుకోవాలి. విద్యార్థులు ఏకాగ్రతతో శ్రమిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో మంచివారితో స్నేహం కలిసివస్తుంది. లక్ష్య సాధనా స్ఫూర్తితో పనులు చేయాలి. 
మకరం

వారాంతంలో వృథా ఖర్చులు ఉండవచ్చు. మిగతా రోజులు అనుకూలం. బంధుమిత్రులతో సత్సంబంధాలు వుంటాయి. సలహాలు, సంప్రదింపులతో పనులు నెరవేరుతాయి. పెద్దలు, కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. అనుభవాలను పంచుకొంటారు. వ్యాపార పెట్టుబడులు వాయిదా వేసుకొంటారు. తాత్కాలిక లాభాలు వచ్చే పనులు చేస్తారు. అనుకూల ఫలితాలు వుంటాయి. అనవసర చర్చలకు దూరంగా ఉంటూ పనులపై మనసు నిలుపుతారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. వాహనాలపై ఖర్చులు పెరుగుతాయి. పనివారితో తరచూ ఇబ్బందులు ఉండవచ్చు. డబ్బు విషయంలో వివాదాలు, మనస్పర్ధలు తలెత్తుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. కుంభం

వారం ప్రారంభంలో అనవసర ఖర్చులు ఉండవచ్చు. మిగతా రోజులు అనుకూలం. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొంటారు. ఆరోగ్యంతో ఉత్సాహంగా, సంతృపిగా ఉంటారు. కుటుంబ పెద్దలు, భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు.  కొత్త సమస్యలు పెరుగవచ్చు. పనులలో ఆటంకాలు ఆలస్యంగా పూర్తవుతాయి. గృహనిర్మాణం వివాహాది శుభ కార్యప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకున్నంతగా అనుకూలంగా ఉండక పోవచ్చు. ఉద్యోగంలో అస్థిరత ఉండవచ్చు. స్థిరత్వం కోసం ప్రయత్నాలు అవసరం. పనిలో నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అందరి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం గతంలోకంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది.
మీనం

వారం ప్రారంభంలో ఆహారం పట్ల జాగ్రత్త పడండి. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి స్థిరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. సంతోషంగా ఉంటారు. పాత పనులను పూర్తి చేస్తూ కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల సలహాలతో పనులు నెరవేరుతాయి. గత పెట్టుబడులవల్ల ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులు శ్రమిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. లక్ష్యస్ఫూర్తితో, ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తారు. గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి 

ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త

నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530

ఈ మెయిల్‌ : [email protected]


logo