ఖండాలు దాటిన శిల్పకళ

పెద్ద చదువులు చదివినా కులవృత్తి శిల్పకళనే జీవనాధారం చేసుకున్నాడు. అందులోనే ప్రత్యేక కోర్సులు చేసి, నైపుణ్యాన్ని సాధించాడు. కళకు సృజనాత్మకతను జోడిస్తూ అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దుతున్నాడు. అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొని, తన ప్రతిభతో అనేక అవార్డులనూ అందుకున్నాడు హర్షవర్ధన్ దుర్గడ్డ.
మొయినాబాద్ మండలం మోత్కుపల్లి గ్రామంలో శిల్పాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు హర్షవర్ధన్. రాయలసీమలోని ఆళ్లగడ్డకు చెందిన శిల్పకళాకారుల కుటుంబంలో పుట్టిన హర్షవర్ధన్ చిన్నతనంలోనే శిల్పకళ పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. ఆయన తండ్రి కూడా శిల్పే. అనేక జాతీయ అవార్డులనూ సొంతం చేసుకున్నాడు. విశాఖలో ఇంటర్దాకా చదివిన హర్ష ఢిల్లీలో విజువల్ ఆర్ట్స్ విభాగంలో పీజీ చేశాడు. డ్రాయింగ్, మోడలింగ్, వీడియో టూల్స్, డిజైనింగ్ విభాగాల్లో శిక్షణ పొందాడు. శిల్పకళా సాహిత్యం, చరిత్రలాంటి అంశాలపై అవగాహన పెంచుకున్నాడు. అనేకమంది కళాకారులతో పరిచయాలు పెంచుకొని, వారితో ఆలోచనలను పంచుకున్నాడు.
మోత్కుపల్లిలో పరిశ్రమ
తన కళకు సృజనను జోడించి, సరికొత్త శిల్పాలను తయారుచేయాలనే లక్ష్యంతో మోత్కుపల్లిలో పరిశ్రమను ఏర్పాటు చేశాడు హర్ష. తనతోపాటు మరో నలుగురు కళాకారులకూ ఉపాధిని కల్పిస్తున్నాడు. ఒక్కో శిల్పం తయారీకి రెండు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో సందర్శకులు అతడి కళా ప్రతిభను చూసి అబ్బుర పడుతుంటారు. హర్షవర్ధన్ ఆన్లైన్లో కూడా వాటిని అమ్మకానికి పెడుతుంటాడు. సమాజానికి సందేశాన్ని ఉంటాయి హర్షవర్ధన్ శిల్పాలు. ఇప్పటివరకు తన శిల్పాలతో అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, దక్షిణ కొరియా, లండన్లలో ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు హర్ష తెలిపారు. ఆ శిల్పాలు అవార్డుల పంటను పండిస్తున్నాయి. వర్లింగ్ మ్యాన్ (భ్రమణం), ఆబ్సెంట్ ఫేసెస్ (కనిపించని ముఖం), నిబిరు(గ్రహం), స్పిన్పేస్(బొంగరంపై చదరంగం), టోపో(బొంగరం).. తదితర పేర్లతో అనేక శిల్పాలకు జీవం పోశాడు. కోలమ్ ఆఫ్ సౌండ్ (ధ్వని స్తంభం) పేరిట రూపొందించిన కళారూపాన్ని ఆండ్రూస్రైటెన్ అవార్డు కూడా వరించింది. రియోటింటో శిల్పకళా అవార్డుకింద 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 25 లక్షలు) నగదు బహుమతినీ అందుకున్నాడు. హర్షవర్ధ్దన్ ప్రాణం పోసిన ‘స్వార్థం’ అనే కళాఖండం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.
ఎంతో వైవిధ్యం
శిల్పకళ అనగానే విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. ఇందులో అనేక రూపాలున్నాయి. సామాజిక పరిణామాలను ప్రధానాంశాలుగా తీసుకుని సృజనాత్మకతను జోడిస్తే కనుక అద్భుతమైన కళాఖండాలను రూపొందించవచ్చు.
-హర్షవర్ధన్ దుర్గడ్డ
- బేగరి శ్రీనివాస్
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..