Sunday
- Feb 21, 2021 , 00:00:07
VIDEOS
సుద్దులాడుతూ కొబ్బరి సద్ది

తెలంగాణ సంప్రదాయాలకు, ఆచారాలకు ప్రతీక బతుకమ్మ. ఈ పండుగలో, తీరొక్క పూలతోనే కాదు, రోజొక్క తీరు నైవేద్యంతో అమ్మవారి అనుగ్రహం కోరుతారు. సద్దుల బతుకమ్మ రోజు ఐదురకాల సద్దులను సమర్పిస్తారు. వీటిలో కొబ్బరి సద్ది ఉండి తీరుతుంది. తేలికగా జీర్ణమయ్యే కొబ్బరి సద్ది రుచిలోనూ ఘనమే.
- సద్ది అంటే అన్నం. కొబ్బరితో కలిపి వండే అన్నాన్ని కొబ్బరి సద్ది అంటారు. దీనిలో బియ్యంతోపాటు కొబ్బరి, కొబ్బరి పాలను కూడా వాడుతారు. అన్నం ఆరిన తర్వాత కొబ్బరి, పచ్చిమిర్చి, పప్పు దినుసులు, పల్లీలు, కాజుతో కలిపి వేసే తాలింపు కొబ్బరి సద్దిని కంటికి ఇంపుగా, జిహ్వకు రుచిగా తయారుచేస్తుంది.
- కొబ్బరి సద్ది వందల ఏండ్లనాటి వంటకం. కొబ్బరి సద్దిని తెలంగాణలోని ఒక్కోప్రాంతంలో ఒక్కోలా వండుతారు. కొందరు పచ్చి కొబ్బరి పాలతో అన్నం వండి తాలింపు పెడతారు. కొన్ని ప్రాంతాల్లో పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకుతో అన్నంలో తాలింపు వేసి.. పైనుంచి ఎండుకొబ్బరిపొడి చల్లుతారు. దీన్ని కొబ్బరన్నం అని కూడా పిలుస్తారు.
- కొబ్బరన్నానికి మజ్జిగ పులుసు మంచి కాంబినేషన్. గుత్తి వంకాయ మసాలా, ఆలూ కుర్మా, కాప్సికమ్ మసాలా కాంబినేషన్స్ కూడా కొబ్బరి సద్దిని ఆబగా తినేలా చేస్తాయి. సద్దిని కాస్త కారంగా చేసుకుంటే ఏ కూరా నంజుకోవాల్సిన పనిలేకుండా ఓ పట్టు పట్టేయొచ్చు.
- కొబ్బరి, పల్లీలు వంటి పదార్థాలతో వండే కొబ్బరన్నంలో పోషకాలు అపారం. కొందరు కొబ్బరన్నంలో నువ్వులపొడి చల్లుతారు. నువ్వులు రుచిని మరింత పెంచడమే కాకుండా, పోషకాలను రెట్టింపు చేస్తాయి. నువ్వులలోని క్యాల్షియం ఎముకలు దృఢంగా ఉండేందుకు దోహదపడుతుంది.
- చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ దీన్ని కడుపారా తినవచ్చు. ఎందుకంటే దీనిలో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు సైతం నిరభ్యంతరంగా కొబ్బరి సద్దిని ఆరగించవచ్చు.
- కొబ్బరిలో పీచు పదార్థం అధికం. ఇది మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది. కొబ్బరి శరీరానికి శక్తినిస్తుంది. దీనిలోని పోషకాలు శరీరం చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలని అనుకొనే వారికి చాలా మంచిది.
- కొబ్బరిసద్దిని మామూలు రోజుల్లోనూ వండుకుంటారు. వెజిటబుల్ బిర్యానీ, మసాలా రైస్, జీరా రైస్లలానే స్పెషల్ డిష్‌లా వడ్డిస్తారు. కొందరైతే చికెన్, మటన్తోనూ మహా ఇష్టంగా లాగించేస్తారు. అందుకే రెస్టారెంట్లు సైతం కొబ్బరన్నాన్ని మెనూలో చేర్చాయి.
తాజావార్తలు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
MOST READ
TRENDING