సోమవారం 01 మార్చి 2021
Sunday - Feb 20, 2021 , 23:53:49

ఆ రెండూ పూర్తయితేనే.. ఏ సినిమా అయినా!

ఆ రెండూ పూర్తయితేనే.. ఏ సినిమా అయినా!

ఇండస్ట్రీలో అవకాశం రావడమే గొప్ప! నిరూపించు కోవడానికి సిద్ధంగా ఉంటారంతా. కానీ, తను మాత్రం చేయగలిగిన పాత్రలకే పచ్చజెండా ఊపింది. ‘హోరాహోరీ’తో  తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఈ ముంబయి ముద్దుగుమ్మ ‘హుషారు’తో అందరికీ దగ్గరైంది. తాజాగా ‘జాంబిరెడ్డి’లో  ప్రేక్షకులను అలరించిన దక్ష నాగర్కర్‌ గురించి కొన్ని ముచ్చట్లు..

  • నేను ఢిల్లీలో ఉన్నప్పుడు డైరెక్టర్‌ ప్రశాంత్‌గారు ఫోన్‌ చేసి ‘తెలుగులో మనం ఒక జాంబి సినిమా చేస్తున్నాం’ అని చెప్పారు. కథ విన్నాక నాలో ఆసక్తి పెరిగింది. అదే ‘జాంబిరెడ్డి’, పక్కా కమర్షియల్‌ సినిమా. హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమైన ‘జాంబి’ జానర్‌లో తొలిసారిగా తెలుగులో వచ్చిన 
  • సినిమాలో నేనూ భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. 
  • ఆచితూచి కథలు ఎంచుకోవడం వల్ల ఎక్కువ సినిమాలు చేయలేకపోయా. దీనివల్ల తాత్కాలికంగా కొన్ని అవకాశాలు కోల్పోవచ్చేమో కానీ, దీర్ఘకాలంలో మంచి సినిమాలు చేసిన తృప్తి దక్కుతుంది. 
  • ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ సాయి గణేష్‌తో ఓ చిత్రం చేస్తున్నా. సాయి గణేష్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్‌ హిందీ వెబ్‌ సిరీస్‌కు ఇటీవలే ఓకే చెప్పా. త్వరలోనే ఓటీటీలోనూ   మీ ముందుకొస్తా.
  • మంచి పాత్రలకు ఓటేస్తూనే, అందాల ఆరబోతకు ఓకే చెప్పిన ఈ బెంగళూరు ముద్దుగుమ్మను ఇకనైనా అవకాశాలు వరిస్తాయేమో చూడాలి.
  • నాకు కమర్షియల్‌ సినిమాలంటే ప్రాణం. గ్లామర్‌ పాత్రలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఫుల్‌గా రెడీ అయ్యి డ్యాన్స్‌ చేయడమంటే చాలా ఇష్టం. ‘హుషారు’ తర్వాత నేను కావాలనేం విరామం ఇవ్వలేదు. ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలకు సంతకం చేశాను. అవి పూర్తయిన తర్వాతే 
  • భవిష్యత్‌ ప్రణాళిక గురించి ఆలోచిస్తా. 
  • నా మొదటి సినిమా ‘హోరాహోరీ’. దీనికి ముందు కొన్ని సినిమాలు చేసినా అవన్నీ చాలా చిన్న పాత్రలే. ‘హోరాహోరీ’ చేసినప్పుడు నా వయసు పంతొమ్మిది. బీబీఏ చదువుతున్నా. షూటింగ్‌ వల్ల ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాయలేక పోయాను. అందుకే, చదువయ్యాకే సినిమాలు చేయాలని నిర్ణయించుకొన్నా. పట్టుదలతో డిగ్రీ పాసయ్యా. తర్వాత రెండేండ్లకు ‘హుషారు’ చేశాను.

VIDEOS

logo