సోమవారం 08 మార్చి 2021
Sunday - Feb 13, 2021 , 20:50:23

ఈ వారం మీ రాశి ఫలాలు

ఈ వారం మీ రాశి ఫలాలు

మేషం


సమయానుకూల నిర్ణయాలతో లాభాలు ఉంటాయి. ఆలోచనలను ఆచరణలో పెడతారు. సమస్యలను అధిగమిస్తారు. తలపెట్టిన పనులలో అనుకూలత ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలతో కార్యసాఫల్యత ఉంటుంది. స్నేహితులు, ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. పెద్దలపట్ల భక్తి ప్రపత్తితో ఉంటారు. సాంస్కృతిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలతో మంచిపేరు సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణలో జాగ్రత్త అవసరం. ఒప్పందాలు కలిసివస్తాయి.

వృషభం


స్నేహితులు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. బయటి వ్యక్తుల పరిచయాలు సంతోషాన్నిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చాకచక్యంతో అందరినీ అనుకూలంగా మార్చుకుంటారు. ఆస్తుల విషయంలో చిన్నపాటి తగాదాలు ఉండవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటారు. మంచి ఫలితాలను సాధిస్తారు. వివాదాల జోలికి వెళ్లకుండా పనులు చేసుకోవడం ముఖ్యం. భూములు, వాహనాలు, ఆస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులున్నా పనులు నెరవేరుతాయి. వృత్తిలో సంతృప్తిగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం


వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనిభారం పెరుగుతుంది. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటారు. బంధుమిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టడం అవసరం. విద్యార్థులు అనుకూల ఫలితాలకు శ్రమించాలి. పట్టుదలతో కార్యసాధన, శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహాయంతో కొన్ని నెరవేరుతాయి. మంచిపేరు సంపాదిస్తారు. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో క్రమంగా లాభాలు పొందుతారు. ఆస్తి తగాదాలు ఉండవచ్చు. జాగ్రత్తగా పరిష్కరించుకోవడం ముఖ్యం.

కర్కాటకం


కారణాంతరాలతో నిలిచిపోయిన పనులు పునః ప్రారంభిస్తారు. సమాజంలో మంచివారితో పరిచయాలు కలిసివస్తాయి. మంచి ఆలోచనలు అమలు చేస్తారు. నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. భక్తిభావన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. నిత్య వ్యాపారంలో పనివారితో ఇబ్బందులు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన వారం. మంచి ఫలితాలను పొందుతారు. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాలు కలిసివస్తాయి.

సింహం


ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తవుతాయి. నిత్య వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. కోర్టు పనులలో అనుకూలత ఉంటుంది. శ్రమించి పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో తాత్కాలిక అనుకూలత ఉంటుంది. కొత్త పనుల కోసం ప్రయత్నాలు చేస్తారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి చేసే వ్యాపారాలు, పనులు కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు.

కన్య


గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆలోచించి ప్రణాళికలతో పనులు చేస్తే చాలా విషయాలలో అనుకూలత ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో స్నేహభావం పెరుగుతుంది. సంఘంలో మంచిపేరు సంపాదిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో అధికారుల ప్రశంసలు పొందుతారు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. నిర్మాణాత్మక పనులు చేపడతారు. గతంలో నిలిచిపోయిన పనులను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు.

తుల


ఆదాయం స్థిరంగానే ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కోర్టు పనులు కలిసివస్తాయి. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో అనుకూలత ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహాయ సహకారాలు అవసరం. వాహనాలు, భూముల కొనుగోలును కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రత్యర్థులతో ఇబ్బందులు ఉండవచ్చు. దైవభక్తిని పెంపొందించుకోవడంతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. అధికారుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పనిభారం పెరుగవచ్చు.

వృశ్చికం


ప్రారంభించిన పనులు కలిసివస్తాయి. నలుగురితో పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. ఇంటికి కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. సాహిత్యం, కళలపై అభిరుచి పెరుగుతుంది. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉంటుంది. భూముల కొనుగోలు విషయంలో కలిసివస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహాయంతో అనుకూలత ఉంటుంది. ప్రయాణాలలో కొంత ఆటంకం ఉంటుంది.

ధనుస్సు


ప్రయాణాలు అనుకూలిస్తాయి. మంచి ఆలోచనలు, సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు వుంటాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో అనుకూలత ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులకు అనుకూల వారం. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. పోటీపరీక్షలలో నెగ్గుతారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. న్యాయ సమస్యలు పరిష్కారమవుతాయి. నిత్య వ్యాపారం స్థిరంగా, లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యంతో ఉంటారు. కొన్ని విషయాలలో వృథా ఖర్చులు ఉండవచ్చు. పనివారితో ఇబ్బందులు ఉంటాయి.

మకరం


ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. సంగీత, సాహిత్యాలపట్ల మనసు నిలుపుతారు. సమావేశాలకు హాజరవుతారు. సేవా, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. నిత్య వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పనివారితో ఇబ్బందులు ఉండవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో సంతృప్తిగా ఉంటారు.

కుంభం


అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన వారం. వాహనాల మూలంగా పనులు నెరవేరుతాయి. పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణరంగంలోని వారికి తాత్కాలికంగా కలిసి వస్తుంది. న్యాయ సమస్యలు పరిష్కారమవుతాయి. నిత్య వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సాహిత్యవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రయోజనకరమైన వారం. కొన్ని వృథా ఖర్చులు ఉండవచ్చు. పనులలో జాప్యం ఉంటుంది. ప్రారంభించిన పనులు కొన్ని నిలిచిపోవడం జరుగుతుంది.

మీనం


ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆలోచనలను ఆచరణలో పెడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వస్త్ర, వస్తువులను, ఆభరణాలను కొంటారు. సంగీత, సాహిత్యవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సమావేశాలకు హాజరవుతారు. నిత్య వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సమస్యలను పరిష్కరిస్తారు. ఆస్తుల పాత తగాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. పనివారితో అనుకూలత ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన వారం.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి 

ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త

నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530

ఈ మెయిల్‌ : [email protected]

VIDEOS

logo