ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sunday - Feb 06, 2021 , 21:29:35

ఈ వారం మీ రాశి ఫలాలు

ఈ వారం మీ రాశి ఫలాలు

మేషం


ఆలోచనలకు అనుగుణంగా పనులు చేస్తారు. తలపెట్టిన పనులలో అనుకూలత ఉంటుంది. కొత్త పరిచయాలవల్ల పనులు నెరవేరుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భక్తిభావం పెరుగుతుంది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన వారం. చదువులో రాణిస్తారు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణలో కొంత జాగ్రత్త అవసరం. ఒప్పందాలు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఆస్తుల కొనుగోలు, క్రయ విక్రయాల వల్ల లాభం ఉంటుంది. గత పెట్టుబడులవల్ల ఆదాయం పెరుగుతుంది.

వృషభం


ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. బంధువులు, స్నేహితులతో సంబంధాలు పెంపొందుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పనులపై మనసు నిలుపడం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ప్రత్యర్థులను తెలివితో అనుకూలంగా మలచుకుంటారు. అన్నదమ్ములు, బంధువులతో పనులు నెరవేరుతాయి. కొన్ని మనస్పర్ధలున్నా పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. భూములు, వాహనాల విషయంలో కలిసి వస్తుంది. అప్రమత్తత అవసరం. రావలసిన సొమ్ము కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడతారు.

మిథునం


వృత్తి, వ్యాపారాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయులు, స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆలోచనలను కార్యరూపంలో పెట్టడం అవసరం. శుభకార్య ప్రయత్నాలలో కొంత ఆలస్యం జరగవచ్చు. అనుకూలత ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శ్రమాధికమైనా పనులు పూర్తవుతాయి. ఆకస్మికంగా డబ్బు చేతికి అందినా కొత్త పనులలో ఆలస్యం ఉండవచ్చు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రమంగా వ్యాపారం అనుకూలిస్తుంది. నూతన పెట్టుబడులను కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెట్టుబడులకు, పొదుపుకు అనుకూలమైన వారం. ఆధ్యాత్మికత పెంచుకుంటారు. 

కర్కాటకం


నిలిచి పోయిన పనులలో కదలిక వస్తుంది. నూతన పరిచయాలతో అదృష్టం కలిసి వస్తుంది. ఆలోచనలను అమలు పరుస్తారు. మిత్రుల రాకతో కొంత ఖర్చు పెరిగినా వారి సహాయ సహకారాలు తోడ్పడతాయి. నిర్మాణ పనులలో కొంత ఆలస్యమైనా, మొత్తానికి పూర్తవుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందడంలో కొన్ని వివాదాలు ఏర్పడవచ్చు. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. 

సింహం


తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సోదరుల నుండి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. పనులు పూర్తి కావడంలో ఆలస్యం జరుగవచ్చు. పెద్దల విషయంలో భక్తి భావనలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా కలిసి వస్తాయి. కొత్త ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబసభ్యులు, భార్యాపిల్లల సహకారం పూర్తిగా ఉంటుంది. సమస్యలను చాకచక్యంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని విషయాలలో ఉచిత సలహాలు అందవచ్చు. జాగ్రత్త అవసరం. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. 

కన్య


అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులు, ఆత్మీయుల నుండి సహకారం అందుతుంది. సమాజంలో మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానాలలోని వారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురి ప్రశంసలు పొందుతారు. గృహనిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబ వ్యక్తులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం నయమవుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కొన్ని విషయాలలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం అవసరం. వృత్తి, వ్యాపారాలలో తాత్కాలిక లాభాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన బలపడుతుంది. 

తుల


ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో, వృత్తిలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. బంధుమిత్రులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. సామరస్యంతో ముందుకు వెళ్లడం మంచిది. వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహాయ సహకారం అవసరం కావచ్చు. వాహనాల కొనుగోలులో అవాంతరాలు ఏర్పడవచ్చు. క్రమేపీ అన్ని విషయాలూ సర్దుకుంటాయి. దైవభక్తి పెరుగుతుంది. సంప్రదాయాలకు విలువ ఇస్తారు. తాత్కాలిక ఫలితాలను ఆశించి పనులు చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమాధికం ఉండవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో మనస్పర్ధలు, అధికారుల విమర్శలు ఉండవచ్చు. 

వృశ్చికం


ఉత్సాహంతో పనులు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలలో సంతృప్తి ఉన్నా పనులు నెరవేరడంలో కొంత జాప్యం ఉండవచ్చు. చేపట్టిన కార్యక్రమాలను కష్టపడి పూర్తి చేస్తారు. స్థిర, చరాస్తుల విషయంలో సమస్యలు ఉంటాయి. సామరస్యంతో పరిష్కరించుకుంటారు. సంగీత, సాహిత్య రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. పొదుపుకు అనుకూలమైన వారం. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. చదువులో శ్రమ అవసరం. అనుకూల ఫలితాలు ఉంటాయి. విధి నిర్వహణ సంతృప్తిగా ఉంటుంది. 

ధనుస్సు


ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఉత్సాహంతో పనులు నిర్వర్తిస్తారు. కొత్త పనుల ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృధా ఖర్చులు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపార విధానంలో మార్పు ఉంటుంది. కొత్త పెట్టుబడులను సమకూర్చుకుంటారు. ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో విధి నిర్వహణలో ఆటంకాలున్నా అధికారుల అండదండలు బాగా లభిస్తాయి. నైపుణ్యాలను నిరూపించుకుంటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులవల్ల ఆర్థిక సర్దుబాట్లు అవసరం కావచ్చు. విద్యార్థులకు మంచి సమయం. అనుకూల ఫలితాలు ఉంటాయి. 

మకరం


చేపట్టిన పనులు మెల్లిగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో ముఖ్యమైన చర్చలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. పేరుప్రతిష్ఠలకోసం ప్రయత్నిస్తారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. తరచుగా ఏర్పడే సమస్యలను నేర్పుతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో తాత్కాలిక అనుకూలత ఉంటుంది. పనివారితో ఇబ్బందులు ఉండవచ్చు. పాత అప్పులు తీరుస్తారు. పరిస్థితులు అనుకూలించడంతో పనులు ముందుకు సాగుతాయి. శుభకార్య ప్రయత్నాలలో కొంత సాఫల్యత ఉంటుంది. ఆర్థిక పరిస్థితులవల్ల కొన్ని పనులు వాయిదా పడవచ్చు. రాజకీయ, కోర్టు పనులలో సామాన్య ఫలితాలు ఉంటాయి. 

కుంభం


పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల తోడ్పాటుతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యంతో, ఉత్సాహంతో ఉంటారు. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. నియంత్రణ అవసరం. పనులలో ఆటంకాలున్నా పూర్తవుతాయి. గృహ నిర్మాణం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంతకాలంగా ఎదురుచూస్తున్న డబ్బు చేతికి అందవచ్చు. శుభకార్యాలలో ఖర్చులు ఉంటాయి. నలుగురికి సహాయ పడతారు. పనిలో నైపుణ్యం మూలంగా మంచిపేరు పొందుతారు. సహకారం లభిస్తుంది. పెట్టుబడులకు ప్రతిఫలం పొందుతారు. 

మీనం


ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమస్యలు పరిష్కారమవుతాయి. స్నేహితుల నుండి మంచి సలహాలు పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. పోటీ పరీక్షలలో మంచిస్థాయిలో నిలుస్తారు. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులతో సానుకూలతగా వుంటూ పనులు నెరవేర్చుకుంటారు. పనితనంతో నలుగురినీ ఆకట్టుకుంటారు. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అధికారులు, పెద్దల ఆదరణను పొందుతారు. సమస్యలు పరిష్కారమవుతాయి. 


గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి 

ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త

నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530

ఈ మెయిల్‌ : [email protected]

VIDEOS

logo