Sunday
- Nov 29, 2020 , 01:38:00
మహానగరం..మైలురాళ్లు

హైదరాబాద్‌కు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కాకపోతే, కుతుబ్‌షాహీల రాజధానిగా మారిన దగ్గర నుంచీ ఆకాశమే హద్దుగా విస్తరించింది. చాదర్‌ఘాట్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్.. ఇలా ఒకో ప్రాంతాన్నీ తనలో ఇముడ్చుకుంటూ జనసంద్రమైంది. 1934లోనే పురపాలక సంఘ ఎన్నికలకు సిద్ధమై, స్వాతంత్య్రానికి ముందే ప్రజాస్వామ్య పాలనకు శ్రీకారం చుట్టింది. ఆ ప్రయాణంలో కొన్ని కీలక ఘట్టాలు..
- 1518 - బహమనీ సామ్రాజ్యం అయిదు భాగాలుగా విడిపోయింది. హైదరాబాద్ ప్రాంతం సుల్తాన్ కులీ అధీనంలోకి వచ్చింది. హైదరాబాద్ ఓ ప్రత్యేక నగరంగా ఉనికిలోకి వచ్చింది.
- అక్టోబర్ 9- గోల్కొండ సహిత హైదరాబాద్‌ను రాజధానిగా గుర్తిస్తూ,
- కులీకుతుబ్‌షా ఫర్మానా జారీచేశాడు. ఆ తర్వాత శతాబ్దాలపాటు కుతుబ్‌షాహీలు, మొఘలులు, అసఫ్ జాహీల పాలనలోనే గడిచిపోయింది.
- 1591 - 1866బ్రిటిష్‌వారి అధికార పరిధిలో ఉన్న చాదర్‌ఘాట్ మున్సిపాలిటీగా ఏర్పడింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఆ ప్రాంతం చాలా ఆధునికంగా కనిపించేదట!
- నాలుగో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హైదరాబాద్‌ను ఓ పురపాలక సంస్థగా గుర్తించి... పాలన కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు.
- ఏడో నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిని 55 చదరపు కిలోమీటర్ల నుంచి 84 చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరిస్తూ ఉత్తర్వులు జారీచేశాడు.
- 1933 - హైదరాబాద్‌ను నగరపాలక సంస్థగా మార్చారు. చాదర్‌ఘాట్‌ను అందులో విలీనం చేశారు.
- హైదరాబాద్ నగరపాలక సంస్థకు తొలి ఎన్నికలు జరిగాయి.
- జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్‌లను కలుపుతూ... జూబ్లీహిల్స్ పురపాలక సంస్థ ఏర్పడింది.
- సికింద్రాబాద్‌లో తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను బ్రిటిష్ సర్కారు నిజాం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసింది. దాంతో ‘సికింద్రాబాద్ పురపాలక సంఘాన్ని’ ఏర్పాటు చేశారు.
- హైదరాబాద్ నగరపాలక సంస్థను 1942లో రద్దు చేశారు. దాన్ని ఈ ఏడాది పునరుద్ధరించారు. ఇదే ఏడాది జూబ్లీహిల్స్ పురపాలక సంస్థను కూడా హైదరాబాద్‌లో విలీనం చేశారు.
- సికింద్రాబాద్ పురపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చారు.
- హైదరాబాద్-సికింద్రాబాద్‌లను కలుపుతూ జంటనగరాల ఏకీకృత పాలన మొదలైంది.
- భాగ్యనగర పరిసర ప్రాంతాల్లో ఉన్న 12 నగర పాలక సంస్థలను విలీనం చేసుకుంటూ ‘హైదరాబాద్ మహానగరపాలక సంస్థ’ ఏర్పడింది.
- హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బండ్లగూడ, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట్, బడంగ్పేట్, మీర్పేట్లను కూడా నగరపాలక సంస్థలుగా గుర్తించారు.
తాజావార్తలు
- నెటిజన్స్ ట్రోల్ చేయడంతో పోస్ట్ డిలీట్ చేసిన సమంత
- నిలకడగా శశికళ ఆరోగ్యం
- ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- ఆచార్యలో చరణ్ సరసన ఈ బ్యూటీని ఫైనల్ చేశారా..!
- నేటి నుంచి తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
MOST READ
TRENDING