న్యూఢిల్లీ, మే 19: దేశంలో ఇప్పట్లో కరోనా టీకా దొరకడం కష్టమని భావిస్తున్నారా.. రష్యా పర్యటనకు మా ప్యాకేజీని ఎంచుకోండి. అక్కడ స్పుత్నిక్-వీ టీకా రెండు డోసులు వేయిస్తాం.. ఢిల్లీకి చెందిన ట్రావెల్ ఏజెన్సీ ప్రకటన ఇది. కరోనా టీకాల కొరత నేపథ్యంలో ప్రకటించిన ఈ ప్యాకేజీలో 24 రోజుల రష్యా పర్యటన, 2 స్పుత్నిక్ వీ డోసులు ఉన్నాయి. రెండు డోసుల మధ్య వ్యవధి 21 రోజులు అందుకే పర్యటన ప్యాకేజీని 24 రోజులకు రూపొందించారు. ధర రూ.1.29 లక్షలు.